For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రపంచ కుబేరుడిగా జెఫ్ బెజోస్‌ను వెనక్కి నెట్టిన అర్నాల్ట్: టాప్ 10లో వీరే...

|

అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌కు లూయీస్ వ్యూటన్ మోయెట్ హెనెస్సీ అధినేత బెర్నార్డ్ అర్నాల్ట్ షాకిచ్చారు! ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ జాబితాలో బెర్నార్డ్ అర్నాల్ట్ ముందుకు వచ్చారు. ఈ జాబితా ప్రకారం ఈ ఫ్రెంచ్ వ్యాపారవేత్త నికర సంపద 198.9 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. గతంలోను ఆయన ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానానికి ఎగబాకారు.

2019 డిసెంబర్ నెలలో, జనవరి 2020లో ఆయన ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. ఇప్పుడు మరోసారి జెఫ్ బెజోస్‌ను వెనక్కి నెట్టాడు. తాజా ర్యాంకింగ్స్ ప్రకారం జెఫ్ బెజోస్ సంపద 194.9 బిలియన్ డాలర్లుగా ఉంది. మూడో స్థానంలో ఉన్న టెస్లా ఇంక్ అధినేత ఎలాన్ మస్క్ సంపద 185.5 బిలియన్ డాలర్లుగా నమోదయింది.

LVMH సేల్స్ వృద్ధి

LVMH సేల్స్ వృద్ధి

ఎలాన్ మస్క్‌కు చెందిన కంపెనీ టెస్లా 2021 మొదటి త్రైమాసికంలో 14 యూరోల ఆదాయాన్ని నమోదు చేసింది. 2020 అదే త్రైమాసికంతో పోలిస్తే ఇది 32 శాతం అధికం. ఇక, లూయీస్ వ్యూటన్ మోయెట్ హెనెస్సీ(LVMH) కంపెనీస్ 70 బ్రాండ్స్‌తో కలిసి ఉంది.

ఇందులో లూయీస్ వ్యూటన్, సెపోరా, టిఫానీ అండ్ కంపెనీ, స్టెల్లా మెకర్ట్నీగుస్సీ, క్రిస్టియన్ డియోర్, గివెంచీ వంటివి ఉన్నాయి. LVMH సేల్స్ గత త్రైమాసికంలో వృద్ధి 11 శాతం నమోదయింది. తద్వారా కరోనా ముందుస్థాయి 28.7 బిలియన్ యూరోలు లేదా 34.1 బిలియన్ డాలర్లుగా నమోదయింది. ఇది 5.3 బిలియన్ యూరోస్ ప్రాఫిట్‌ను నమోదు చేసింది. 2019 త్రైమాసికంతో పోలిస్దే ఇది 64 శాతం అధికం.

ఎలాన్ మస్క్‌ను అప్పుడు దాటేశాడు

ఎలాన్ మస్క్‌ను అప్పుడు దాటేశాడు

అంతకుముందు, ఫస్ట్ త్రైమాసికం సమయంలోనే టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌ను దాటేశారు అర్నాల్డ్ బెర్నాల్ట్. 2021 జనవరి నెలలో LVMH అమెరికన్ జ్యువెల్లర్ టిఫానీ అండ్ కంపెనీని కొనుగోలుకు సంబంధించి 15.8 బిలియన్ డాలర్ల భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఫోర్బ్స్‌లో అర్నాల్ట్ తన బయోలో చెప్పిన దాని ప్రకారం అతిపెద్ద లగ్జరీ బ్రాండ్ అక్వైజేషన్‌గా దీనిని భావిస్తున్నారు.

అంతేకాదు, ఈ కంపెనీ 2019లో లగ్జరీ హాస్పిటాలిటీ గ్రూప్, బెల్మాండ్ కోసం 3.2 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. ఇది 46 హోటల్స్, ట్రెయిన్స్, రివర్ క్రూయిజ్‌ను నిర్వహిస్తోంది. లూయిస్ వ్యూటన్, సెఫోరా వంటి దిగ్గజ 70 బ్రాండ్స్‌తో కూడిన సామ్రాజ్యానికి బెర్నార్డ్ అర్నాల్డ్ రాజు.

టాప్ 10 ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్లు

టాప్ 10 ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్లు

- Bernard Arnault & Family - $198.9 బిలియన్లు - LVMH

- Jeff Bezos - $194.9 బిలియన్లు - అమెజాన్

- Elon Musk - $185.5 బిలియన్లు - టెస్లా, స్పేసెక్స్

- Bill Gates - $132.0 బిలియన్లు - మైక్రోసాఫ్ట్

- Mark Zuckerberg - 130.6 బిలియన్లు - ఫేస్‌బుక్

- Larry Page - $116.5 బిలియన్లు - గూగుల్

- Larry Ellison - $116.4 బిలియన్లు - సాఫ్టువేర్

- Sergey Brin - $112.8 బిలియన్లు - గూగుల్

- Warren Buffett - $101.6 బిలియన్లు - బెర్క్‌‌షైర్ హాత్‌వే

- Francoise Bettencourt Meyers & Family - 92.9 బిలియన్లు - L'Oreal

English summary

ప్రపంచ కుబేరుడిగా జెఫ్ బెజోస్‌ను వెనక్కి నెట్టిన అర్నాల్ట్: టాప్ 10లో వీరే... | Bernard Arnault overtakes Jeff Bezos as world's richest person

Louis Vuitton Moet Hennessy Chairman Bernard Arnault has become the richest person in the world after surpassing Amazon founder Jeff Bezos.
Story first published: Sunday, August 8, 2021, 15:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X