సిలికాన్ సిటీ బెంగళూరు అద్భుతమైన వృద్ధిని సాధిస్తోంది. ట్రాఫిక్ పెరగడమే కాదు.. విమాన ప్రయాణికుల సంఖ్య కూడా ఆకాశాన్ని తాకుతోంది. ప్రస్తుతం ఉన్న కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (KIA) పై ఒత్తిడి తగ్గించేందుకు కర్ణాటక ప్రభుత్వం బెంగళూరు రెండో విమానాశ్రయం (Bengaluru 2nd Airport) నిర్మాణానికి అడుగులు వేగవంతం చేసింది.

ఈ ప్రాజెక్టు కోసం అనువైన స్థలాన్ని ఎంపిక చేసేందుకు తాజాగా కర్ణాటక రాష్ట్ర పారిశ్రామిక & మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (KSIIDC) టెండర్లను ఆహ్వానించింది.
షార్ట్‌లిస్ట్ చేసిన మూడు ప్రాంతాలు ఇవే!
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ప్రాథమిక నివేదిక ప్రకారం.. నగరానికి బయట మూడు ప్రాంతాలను ఎంపిక చేశారు. ఎంపిక చేసిన ప్రతి ప్రాంతంలో సుమారు 4,500 ఎకరాల భూమి అందుబాటులో ఉందని ప్రభుత్వం గుర్తించింది. అవేంటంటే..
- కనకపుర రోడ్ - చూడహళ్లి (Chudahalli)
- కనకపుర రోడ్ - సోమనహళ్లి (Somanahalli)
- నెలమంగళ - కుణిగల్ రోడ్ (Tumakuru Road పరిసరాల్లో)
రాజకీయంగానూ ఆసక్తికర చర్చ
ఈ రెండో విమానాశ్రయం ఎక్కడ రావాలనే దానిపై కర్ణాటక మంత్రుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ తన సొంత నియోజకవర్గ ప్రాంతమైన కనకపుర రోడ్ వైపు మొగ్గు చూపుతున్నారు. హోం మంత్రి జి. పరమేశ్వర మాత్రం తుమకూరు రోడ్ (నెలమంగళ) వైపు విమానాశ్రయం వస్తే ఆ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు.
కన్సల్టెంట్ చేసే అధ్యయనం ఏమిటి?
ప్రభుత్వం నియమించబోయే కన్సల్టెంట్ ఈ మూడు ప్రాంతాలపై లోతైన విశ్లేషణ చేస్తారు. ఇందులో ప్రధానంగా.. భూమి స్వభావం, వాతావరణ పరిస్థితులు, రన్‌వే నిర్మాణానికి అనుకూలత.. అలాగే నగరం నుంచి రోడ్డు, రైలు మార్గాల ద్వారా విమానాశ్రయానికి ఎంత త్వరగా చేరుకోవచ్చు అనే అంశాలపై రీసెర్చ్ చేస్తారు. దీంతోపాటు రాబోయే 35 ఏళ్లలో ట్రాఫిక్ ఎలా ఉండబోతోంది?,విమానాశ్రయం వల్ల పర్యావరణానికి కలిగే నష్టం ఎంత అనేది కూడా అంచనా వేస్తారు.
హోసూరు విమానాశ్రయంతో పోటీ?
పక్కనే ఉన్న తమిళనాడు ప్రభుత్వం కూడా బెంగళూరు సరిహద్దుల్లోని హోసూరు (Hosur) వద్దఅంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించేందుకు వేగంగా పావులు కదుపుతోంది. ఏడాదికి 3 కోట్ల మంది ప్రయాణించే సామర్థ్యంతో దీనిని నిర్మించనున్నారు. ఈ పోటీని తట్టుకోవాలన్నా, బెంగళూరు ఐటీ రంగానికి ఊతం ఇవ్వాలన్నా రెండో విమానాశ్రయం అత్యవసరమని కర్ణాటక ప్రభుత్వం భావిస్తోంది.
సెకండ్ ఎయిర్ పోర్ట్ వల్ల లాభాలివే..
బెంగళూరుకు రెండో విమానాశ్రయం రావడం వల్ల కేవలం ప్రయాణ సౌకర్యాలే కాకుండా, ఆర్థికంగా కూడా నగరం మరో మెట్టు ఎక్కనుంది. ముఖ్యంగా కనకపుర లేదా నెలమంగళ ప్రాంతాల్లో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు కావడం వల్ల ఆయా పరిసరాల్లో రియల్ ఎస్టేట్ రంగం అనూహ్యంగా పుంజుకుంటుంది. కొత్త హోటళ్లు, లాజిస్టిక్ పార్కులు, ఐటీ హబ్‌లు, వాణిజ్య సముదాయాల ఏర్పాటుతో వేలాది మంది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అలాగే, ప్రస్తుతం కెంపేగౌడ విమానాశ్రయానికి వెళ్లాలంటే సిటీ ట్రాఫిక్‌లో గంటల తరబడి ప్రయాణించాల్సిన ఇబ్బంది తప్పుతుంది. నగరంలోని సౌత్, వెస్ట్ ప్రాంతాల వారికి ప్రయాణ సమయం గణనీయంగా తగ్గి, రవాణా వ్యవస్థ మరింత వేగవంతం అవుతుంది.
More From GoodReturns

Bengaluru: మళ్ళీ పెరగనున్న టోల్ చార్జీలు.. ఏ రూట్లో ఎంత పెరిగిందంటే?

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications