For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.62,000 కోట్లు... టాప్ 100 ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారుల రుణాల రైటాఫ్

|

ముంబై: మార్చి 2020 నాటికి బ్యాంకులు టాప్ 100 ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారులకు చెందిన దాదాపు రూ.62,000 కోట్ల రుణాలను రైటాఫ్ చేసినట్లు నివేదిక వెల్లడిస్తోంది. ఈ ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారుల జాబితాలో జతిన్ మెహతాకు చెందిన విన్సమ్ డైమండ్స్ అండ్ జ్యువెల్లరీ ముందు ఉంది. రుణాల రైటాఫ్ అంటే లోన్ మాఫీ చేసినట్లు కాదు. బ్యాంకులు తమ అకౌంట్ బుక్స్‌ను క్లియర్ చేసుకోవడానికి ఉపకరిస్తుంది. అలాగే తక్కువ ఎన్పీఏ రేషియోను చూపించుకునే అవకాశం కల్పిస్తుంది.

IRCTC గుడ్‌న్యూస్, ఆన్‌లైన్‌లో బస్సు బుకింగ్ కూడా... ఇలా చేయండిIRCTC గుడ్‌న్యూస్, ఆన్‌లైన్‌లో బస్సు బుకింగ్ కూడా... ఇలా చేయండి

బ్యాంకు క్రెడిబులిటీ

బ్యాంకు క్రెడిబులిటీ

అధిక ఎన్పీఏ నిష్పత్తి కలిగిన బ్యాంకు క్రెడిబులిటీ కోల్పోతోంది. అందుకే టెక్నికల్‌గా బ్యాంకు క్రెడిబులిటీ కోసం లోన్ రైటాఫ్ ఉపయోగపడుతుంది. అధిక ఎన్పీఏ నిష్పత్తి బ్యాంకు ద్రవ్య సమస్యలకు దారితీస్తుంది. మరో మాటలో చెప్పాలంటే అధిక ఎన్పీఏ నిష్పత్తిని కలిగిన ఒక నిర్దిష్ట బ్యాంకు డిపాజిటర్ల బకాయిలను తిరిగి చెల్లించడంలో డిఫాల్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాగా, బ్యాంకులు గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రూ.62,000 కోట్ల రుణాలను రైటాఫ్ చేసినట్లు సమాచార హక్కు చట్టం కింద సమాచార హక్కుల కార్యకర్త బిశ్వనాథ్ గోస్వామి ద్వారా వెల్లడైంది.

వీరు టాప్

వీరు టాప్

రైటాఫ్ రుణాల్లో వజ్రాల వ్యాపారి జతిన్ మెహెతా మొదటి స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా (రూ.1314 కోట్లు), మీడియా సంస్థ డెక్కన్ క్రానికల్‌కు చెందిన రుణాలు కూడా ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాంలో సూత్రదారులు, గీతాంజలి జెమ్స్ అధినేత మెహుల్ చోక్సీ రుణాలు రూ.5,071 కోట్లుగా ఉన్నాయి. అయితే ఇందులో రూ.622 కోట్లు రైటాఫ్ అయ్యాయి. విస్డమ్ డైమండ్స్ రూ.3,098 కోట్లు, బాస్మతీ రైస్ మేకర్ ఆరీఈఐ ఆగ్రో రూ.2,789 కోట్లు, కెమికల్స్ కంపెనీ కుధోస్ ఖెమీ రూ.1,979 కోట్లు, షిప్ బిల్డింగ్ కంపెనీ ఏబీజీ షిప్ యార్డ్ రూ.1875 కోట్లు ఉన్నాయి.

విదేశీ రుణ గ్రహీతల సమాచారంపై..

విదేశీ రుణ గ్రహీతల సమాచారంపై..

2015లో సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం విదేశీ రుణ గ్రహీతల సమాచారం ఇవ్వలేమని ఆర్టీఐ స్పష్టం చేసింది. రుణాలను బ్యాంకులు రైటాఫ్ చేస్తున్నప్పటికీ వసూలు అవకాశాలు సజీవమే. ఖాతా పుస్తకాల్లో మొండి బకాయి (నిరర్థక ఆస్తి లేదా ఎన్పీఏ)ల భారాన్ని తగ్గించడానికే బ్యాంకులు రైటాఫ్ చేస్తాయని చెబుతోంది. 2019 మార్చి 31 నాటికి కూడా టాప్ 100 ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు చెందిన రూ.58,375 కోట్ల రుణాలను బ్యాంకులు రైటాఫ్‌ చేశాయి.

English summary

రూ.62,000 కోట్లు... టాప్ 100 ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారుల రుణాల రైటాఫ్ | Banks wrote off Rs 62,000 crore loans of 100 wilful defaulters as of March 2020

It has been reported by RBI that banks have written off almost Rs 62,000 crore of loans of top 100 wilful defaulters as of March 2020. The list of willful defaulters has been topped by Jatin Mehta’s Winsome Diamonds & Jewellery, helping them to show lower non-performing assets.
Story first published: Sunday, February 7, 2021, 11:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X