For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా దెబ్బ, బ్యాంకుల కీలక నిర్ణయం, ఆఫీస్‌లలో ఉద్యోగుల తగ్గింపు!

|

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6వేల మంది మృత్యువాత పడ్డారు. లక్షన్నరకు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఐటీ కంపెనీలు సహా వివిధ సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ఇస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ కంపెనీలు ఇప్పుడు దీనినే అమలు చేస్తున్నాయి.

ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు, 4% పెరిగిన DA, రూ.10,000 వరకుప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు, 4% పెరిగిన DA, రూ.10,000 వరకు

ఇంటి నుండే పని చేయండి

ఇంటి నుండే పని చేయండి

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చేసే లక్ష్యంలో భాగంగా కంపెనీలు వర్క్ ప్రమ్ హోమ్ ఇస్తున్నాయి. వీలైనంత మందిని ఇంటి వద్ద నుండే పని చేయాలని ఆదేశించాయి. యాక్సిస్ బ్యాంకు, డచ్ బ్యాంకు, జపాన్‌కు చెందిన MUFG తమ ఉద్యోగులను ఇంటి నుండి పని చేయాలని ఆదేశించాయి.

విదేశాలకు నో..

విదేశాలకు నో..

యాక్సిస్, డచ్ బ్యాంకులు అత్యవసర పరిస్థితుల్లో బిజినెస్ కంటిన్యుటీ ప్లాన్-BCP)ని అమలు చేస్తోంది. ప్రధాన కార్యాలయంలో ప్రతి ముగ్గురిలో ఇద్దరిని ఇంటి వద్ద నుండి పని చేయాలని కోరింది. ఇక, విదేశాల్లో ఎవరు కూడా పర్యటించవద్దని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది.

దగ్గర్లోని బ్రాంచీకి వెళ్లి బ్యాంకు సిస్టంకు అనుసంధానం కావొచ్చు

దగ్గర్లోని బ్రాంచీకి వెళ్లి బ్యాంకు సిస్టంకు అనుసంధానం కావొచ్చు

గురువారం నుండి తాము BCPని అమలు చేస్తున్నామని, మూడింట రెండొంతుల ఉద్యోగులను ఆఫీస్‌లోకి అనుమతించడం లేదని అన్ని విభాగాలకు తెలియజేశామని, వారు ఇంటి వద్ద నుండి పని చేయవచ్చునని యాక్సిస్ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తెలిపారు. బ్యాంకు సిస్టంకు అనుసంధానం కావాలంటే దగ్గరలోని శాఖకు వెళ్తే సరిపోతుందన్నారు. అంతేకాదు, 16వ తేదీ నుండి కేవలం 10 శాతం ఉద్యోగులతో పని చేయించే అంశాన్ని పరిశీలిస్తోంది.

అన్ని బ్యాంకులు అదే దారిలో...

అన్ని బ్యాంకులు అదే దారిలో...

ముంబైలోని పలు ప్రాంతాల్లో తాము BCPని ప్రారంభించామని, తప్పనిసరైన ఉద్యోగులు మాత్రమే కార్యాలయాల్లో పని చేస్తారని, మిగతా వారు ఇంటి వద్ద నుండి పని చేస్తారని డచ్ బ్యాంకు ప్రతినిధులు చెబుతున్నారు. ఇదే విధానం ద్వారా పని చేయించాలని సిటీ బ్యాంకు భావిస్తోంది. త్వరలో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వనుంది. భారత్ సహా అన్ని దేశాల్లోని సిటీ బ్యాంకు ఉద్యోగులు ఇంటి వద్ద నుండి పని చేసేలా ఆదేశాలు రావొచ్చు.

English summary

కరోనా దెబ్బ, బ్యాంకుల కీలక నిర్ణయం, ఆఫీస్‌లలో ఉద్యోగుల తగ్గింపు! | Banks take emergency steps to reduce Coronavirus disruption

Banks such as Axis Bank, Deutsche Bank and Japanese lender MUFG have taken unprecedented steps in their day to day functioning to reduce the risk from the coronavirus outbreak.
Story first published: Sunday, March 15, 2020, 15:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X