For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.8 లక్షల కోట్ల రుణాల పునర్వ్యవస్థీకరణ!

|

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) రుణాల పునర్వ్యవస్థీకరణకు అనుమతి ఇవ్వడంతో రూ.8.4 లక్షల కోట్ల విలువైన రుణాలను బ్యాంకులు ఇందుకోసం పరిశీలించే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ తెలిపింది. అంటే బ్యాంకులు రూ.8.4 లక్షల కోట్ల వరకు రుణాల్ని పునర్వ్యవస్థీకరించే అవకాశం కనిపిస్తోంది. మొత్తం బ్యాంకింగ్ రుణాల్లో ఇవి 7.7 శాతానికి సమానం. ఒకవేళ పునర్వ్యవస్థీకరణకు ఆర్బీఐ నిర్ణయం తీసుకోకుంటే ఈ రూ.8.4 లక్షల కోట్ల రుణాల్లో 60 శాతం నిరర్థక ఆస్తులుగా మారే ప్రమాదం ఉందని ఇండియా రేటింగ్స్ తెలిపింది.

కరోనా కారణంగా ఆర్థికంగా అన్ని వ్యవస్థలు చితికిపోయాయి. ప్రస్తుత విపత్కర పరిస్థితులు అన్ని రకాల రుణ చెల్లింపులను ప్రభావితం చేస్తున్నాయి. రుణాల ఈఎంఐలను వాయిదా వేసుకునేలా ఇప్పటికే ఆర్బీఐ 6 నెలల మారటోరియం వెసులుబాటును కల్పించించింది. ఈ నెల 31వ తేదీతో మారటోరియం గడువు ముగియనుంది. ఆర్బీఐ రీక్యాస్ట్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ క్రమంలో కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రుణగ్రహీతల కోసం బ్యాంకులు రుణాల్ని పునర్వ్యవస్థీకరించే అవకాశాలు ఉన్నాయని భావిస్తోంది.

 Banks set to restructure up to Rs 8.4 lakh crore of loans after RBI decision

రూ.8.4 లక్షల కోట్ల వరకు రుణాలను పునర్వ్యవస్థీకరించవచ్చని ఇండియా రేటింగ్స్ అంచనా వేస్తోంది. కార్పొరేట్ రుణాల్లో 90 శాతం పునర్వ్యవస్థీకరణకు రావొచ్చునని అంచనా వేసింది. నాన్ కార్పోరేట్ విభాగంలో రూ.2.1 లక్షల కోట్లు, కార్పోరేట్ విభాగంలో రూ.3.3 లక్షల కోట్లు నుండి రూ.6.3 లక్షల కోట్ల వరకు రుణాల పునర్వ్యవస్థీకరణ ఉండవచ్చునని చెబుతున్నారు. రియల్ ఎస్టేట్, ఎయిర్ లైన్స్, హోటల్స్, ఇతర వినియోదారు సేవల కంపెనీలకు ఇచ్చిన రుణాల్లో అధిక శాథం పునర్వ్యవస్థీకరణ జరగవచ్చునని, వ్యాల్యూపరంగా చూస్తే మౌలిక రంగం, విద్యుత్, నిర్మాణ రంగాల్లో రుణ పునర్వ్యవస్థీకరణ ఉండవచ్చు.

టిక్‌టాక్ కొనుగోలు, మైక్రోసాఫ్ట్‌కు పోటీగా రేసులోకి ఒరాకిల్, ట్రంప్ పచ్చజెండాటిక్‌టాక్ కొనుగోలు, మైక్రోసాఫ్ట్‌కు పోటీగా రేసులోకి ఒరాకిల్, ట్రంప్ పచ్చజెండా

English summary

రూ.8 లక్షల కోట్ల రుణాల పునర్వ్యవస్థీకరణ! | Banks set to restructure up to Rs 8.4 lakh crore of loans after RBI decision

Banks are likely to restructure up to Rs 8.4 lakh crore of loans, or 7.7 per cent of the overall system's credit, under the newly announced recast package, a domestic ratings agency said on Wednesday.
Story first published: Thursday, August 20, 2020, 12:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X