For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Bank strike-Holidays: వరుసగా 5 రోజులు బ్యాంకులు క్లోజ్, ఈ బ్యాంకులు పని చేస్తాయ్

|

వేతన సవరణ కోరుతూ వివిధ బ్యాంకు యూనియన్లు జనవరి 31, ఫిబ్రవరి 1వ తేదీన సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. తమ డిమాండ్లు పరిష్కరించకుంటే మార్చిలో మరోసారి సమ్మెకు దిగుతామని బ్యాంకు యూనియన్లు వెల్లడించాయి. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA)తో ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BEFI), ఆలిండియా బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA) జరిపిన చర్చలు విఫలమయ్యాయి.

వరుసగా 5 రోజులు క్లోజ్

వరుసగా 5 రోజులు క్లోజ్

IBAతో బ్యాంకు యూనియన్లు జరిపిన చర్చలు విఫలం కావడంతో మార్చి 11వ తేదీ నుంచి మార్చి 13వ తేదీ వరకు వరుసగా మూడు రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చాయి. సమ్మె మూడు రోజులతో పాటు బ్యాంకులకు రెండు రోజులు వరుస సెలవులు ఉన్నాయి. దీంతో బ్యాంకులు మొత్తం 5 రోజులు మూతపడనున్నాయి.

వేతనాల పెంపు కోసం..

వేతనాల పెంపు కోసం..

11, 12, 13 తేదీల్లో సమ్మె, మార్చి 14వ తేదీన రెండో శనివారం, ఆ తర్వాత 15వ తేదీన ఆదివారం. కాబట్టి ఐదు రోజులు కస్టమర్లకు ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రతి అయిదేళ్లకోసారి వేతనాలను సవరించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. చివరిసారి 2012లో సవరించాల్సింది ఆలస్యం జరిగింది. 2017లో సవరించాల్సి ఉండగా అది అమలు కాలేదు. వేతనాల సవరణ కోసం యూనియన్లు చర్చలు జరిపినా విఫలమయ్యాయి. పే స్లిప్‌పై 20 శాతం పెంపు కావాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. IBA మాత్రం 19 శాతం ఇస్తామని చెబుతోంది.

5 డే వర్కింగ్ ఎందుకు వద్దంటే?

5 డే వర్కింగ్ ఎందుకు వద్దంటే?

యూనియన్ల ప్రధాన డిమాండ్లలో వేతన సవరణతో పాటు 5 డే వర్కింగ్ డే ఉంది. దేశంలో పబ్లిక్ హాలీడేలు ఎక్కువగా ఉండటంతో వారానికి ఐదు రోజుల పని దినాలు సాధ్యం కాదని IBA చెబుతోంది. ప్రతి శని, ఆదివారాలు బ్యాంకులు మూతబడితే ప్రజలకు అసౌకర్యం ఏర్పడుతుందని అంటోంది.

ఆ బ్యాంకులపై ప్రభావం ఉండదు

ఆ బ్యాంకులపై ప్రభావం ఉండదు

మిగతా డిమాండ్ల విషయానికి వస్తే పెన్షన్ స్కీం తొలగింపు, ఫ్యామిలీ పెన్షన్ ఇంప్రూమెంట్, బేసిక్ వేతనంలో స్పెషల్ అలవెన్స్ మెర్జ్ చేయడం వంటి ఇతర డిమాండ్లు ఉన్నాయి. సమ్మె కారణంగా బ్యాంకులు పని చేయవు. ఆ సమయంలో ఏమైనా పనులు ఉంటే ముందే పూర్తి చేసుకోవాలి. ఐదు రోజుల పాటు బ్యాంకులు పని చేయవు కాబట్టి ఏటీఎంలపై ప్రభావం పడే అవకాశముంది. సమ్మె ప్రభావం ప్రయివేటు బ్యాంకులైన HDFC, ICICI వంటి వాటిపై ఉండదు. ఈ బ్యాంకుల కార్యకలాపాలు యథావిధిగా కొనసాగనున్నాయి.

English summary

Bank strike-Holidays: వరుసగా 5 రోజులు బ్యాంకులు క్లోజ్, ఈ బ్యాంకులు పని చేస్తాయ్ | Bank strike for 3 days again March over salary hike, Banks shut for five days

After a two-day bank strike on 31 January and 1 February, lakhs of employees of several PSU banks have threatened to sit on another bank strike next week. If the shutdown is successful, several banks and even ATMs could be closed for five consecutive days in the second week of March.
Story first published: Sunday, February 9, 2020, 7:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X