For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మరోసారి బ్యాంకులు బంద్: కీలక బడ్జెట్ టైంలో 2 రోజులు స్ట్రైక్, కారణమిదే..

|

ఢిల్లీ: బ్యాంకు యూనియన్లు మరోసారి సమ్మెకు దిగుతున్నాయి. వేతన సవరణపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌తో జరిపిన చర్చలు ముందుకు సాగకపోవడంతో జనవరి 31, ఫిబ్రవరి 1వ తేదీన రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించాలని బ్యాంకు యూనియన్లు నిర్ణయించాయి. ఈ మేరకు అన్ని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) లేఖ రాసింది.

కేబుల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్: పే ఛానల్ ధర రూ.12కు మించకూడదుకేబుల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్: పే ఛానల్ ధర రూ.12కు మించకూడదు

వరుసగా మూడ్రోజులు..

వరుసగా మూడ్రోజులు..

దీంతో జనవరి 31 (శుక్రవారం), ఫిబ్రవరి 1 (శనివారం) బ్యాంకులు క్లోజ్ కానున్నాయి. ఆదివారం సెలవు రోజు. కాబట్టి బ్యాంకులు వరుసగా మూడు రోజుల పాటు ఓపెన్ కావు. ఇప్పటికే జనవరి 8న కొన్ని బ్యాంకు యూనియన్లు భారత్ బంద్‌లో పాల్గొన్నాయి. ఇప్పుడు మరోసారి బంద్ నిర్వహిస్తున్నాయి.

కీలక బడ్జెట్ సమయంలో..

కీలక బడ్జెట్ సమయంలో..

జనవరి 31వ తేదీన పార్లమెంటులో ఎకనామిక్ సర్వేను ప్రవేశపెడతారు. ఆ తర్వాత మరుసటి రోజు (ఫిబ్రవరి 1) కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. ఈ సమయంలో బ్యాంకుల బంద్ గమనార్హం.

నిరవధిక సమ్మె హెచ్చరిక

నిరవధిక సమ్మె హెచ్చరిక

మార్చి 11వ తేదీ నుంచి 13వ తేదీ మధ్య కూడా సమ్మె నిర్వహిస్తామని UFBU తెలిపింది. అప్పటికీ కూడా సమస్యను పరిష్కరించకుంటే కాకపోతే ఏప్రిల్ 1 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తామని బ్యాంకు యూనియన్లు హెచ్చరిస్తున్నాయి. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA)తో వేతన సవరణపై చర్చలు విఫలం కావడంతో UFBU ఈ నిర్ణయం తీసుకున్నది. కనీసం 15% వేతనాలను పెంచాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. UFBU దేశవ్యాప్తంగా 9 కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తోంది.

English summary

మరోసారి బ్యాంకులు బంద్: కీలక బడ్జెట్ టైంలో 2 రోజులు స్ట్రైక్, కారణమిదే.. | Bank strike for 2 days from January 31, branches could be shut on Budget day

After wage revision talks with the Indian Banks' Association (IBA) failed, bank employees' unions today called for a two-day nationwide bank strike on January 31 and February 1. This would be the second bank strike this month, after the first one was observed along with Bharat Bandh on January 8.
Story first published: Thursday, January 16, 2020, 9:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X