For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మరో బ్యాంక్ లాభాలబాట: 107 శాతం నెట్ ప్రాఫిట్

|

ముంబై: దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ నెట్‌వర్క్ ఉన్న స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో భారీ లాభాలను కళ్లచూసింది. 62 శాతం మేర నికర లాభాన్ని ఆర్జించింది. దీని విలువ 8,432 కోట్ల రూపాయలు. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి ఎస్బీఐ నమోదు చేసిన నెట్ ప్రాఫిట్ 5,196 కోట్ల రూపాయలు. ఈ సారి ఈ సంఖ్యను భారీగా పెంచుకోగలిగింది. 8,432 కోట్ల రూపాయలకు చేర్చగలిగింది.

Reliance Jio Outage: యూజర్ల గగ్గోలు: ట్రోల్స్‌తో ఫైర్Reliance Jio Outage: యూజర్ల గగ్గోలు: ట్రోల్స్‌తో ఫైర్

మరో జాతీయ బ్యాంక్ కూడా ఇదే బాటలో ప్రయాణించింది. భారీ లాభాలను అందుకుంది. అదే బ్యాంక్ ఆఫ్ బరోడా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 107 శాతానికి పైగా నెట్ ప్రాఫిట్‌ను నమోదు చేసింది. దీని విలువ 2,197.03 కోట్ల రూపాయలు. గత సంవత్సరం ఇదే మూడో త్రైమాసికంలో బ్యాంక్ ఆఫ్ బరోడా నమోదు చేసిన నికర లాభం 1,061.11 కోట్ల రూపాయలు. సంవత్సరం తిరిగే సరికి.. ఈ నెట్ ప్రాఫిట్‌ను 107 శాతానికి పెంచుకోగలిగింది.

Bank of Baroda reported 107% rise in net profit at Rs 2,197 crore for the Q3

వచ్చే మార్చి 31వ తేదీ నాటికి ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను బ్యాంక్ ఆఫ్ బరోడా కొద్దిసేపటి కిందటే రెగ్యులేటరీకి సమర్పించింది. అక్టోబర్-నవంబర్-డిసెంబర్ కాలానికి సంబంధించిన కార్యకలాపాల వివరాలను ఇందులో పొందుపరిచింది. నికర వడ్డీ ఆదాయాన్ని 14.38 శాతం పెరిగినట్టు పేర్కొంది. వడ్డీల ద్వారా వచ్చిన నికర ఆదాయం 8,552.03 కోట్ల రూపాయలుగా చూపించింది. నెట్ ఇంటరెస్ట్ మార్జిన్‌ 3.13 శాతం, బేసిస్ పాయింట్లు 36గా పేర్కొంది.

స్థూల నికర నిరర్థక ఆస్తుల విలువ స్వల్పంగా తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నాటికి ఎన్పీఏల విలువ 63,182 కోట్ల రూపాయలు కాగా.. ఇప్పుడు 55,997 కోట్ల రూపాయలకు తగ్గింది. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్న మొండి రుణ బకాయిల భారం 7.25 శాతంగా కనిపించింది. నెట్ ఎన్పీఏ రేషియో 2.25 శాతంగా రికార్డు చేసింది. రెండో త్రైమాసికంతో పోల్చుకుంటే కొంత తగ్గింది. జులై-ఆగస్టు-సెప్టెంబర్ రెండో త్రైమాసికానికి నెట్ ఎన్పీఏ రేషియో 2.83 శాతం.

బ్యాంక్ ఆఫ్ బరోడా జారీ చేసిన అడ్వాన్సులు భారీగా పెరిగాయి. 4.75 శాతంగా నమోదైంది. దీని విలువ 7.32 ట్రిలియన్లు. గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఈ మొత్తం విలువ 1.28 ట్రిలియన్లు మాత్రమే.

English summary

మరో బ్యాంక్ లాభాలబాట: 107 శాతం నెట్ ప్రాఫిట్ | Bank of Baroda reported 107% rise in net profit at Rs 2,197 crore for the Q3

Bank of Baroda reported a 107 percent rise in net profit for December quarter stood at Rs 2,197.03 crore against Rs 1,061.11 crore a year ago.
Story first published: Saturday, February 5, 2022, 17:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X