For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Banana Prices: ఆకాశానికి అరటిపండు.. డజను ధర రూ.100.. సరఫరా ఎందుకు తగ్గిందంటే..

|

Banana Prices: అరటి పండ్ల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. పండుగల సమయం దగ్గర పడుతున్న క్రమంలో సామాన్యుల పండు ధర ఆకాశాన్ని తాకుతోంది. శ్రావణ మాసం సమయంలో అనేక మంది పండ్లను మాత్రమే ఆహారంగా తీసుకుంటారు. అనేక చోట్ల ఆ సారి వీటి స్టాక్స్ తక్కువగానే కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం అనేక రాష్ట్రాల్లో వరదల కారణంగా పంట తీవ్రంగా దెబ్బతినటమే. దీనివల్ల డిమాండ్ కు తగినట్లుగా సరఫరా లేదని వ్యాపారులు చెబుతున్నారు. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో నాణ్యమైన అరటి పండ్ల ధర డజను రూ.100కి చేరిన పరిస్థితి సామాన్యులకు భారంగా మారింది.

సరఫరా తగ్గి.. డిమాండ్ పెరిగింది

సరఫరా తగ్గి.. డిమాండ్ పెరిగింది

పంట నష్టం కారణంగా దిగుబడి తగ్గిపోవటంతో చాలా రాష్ట్రాల నుంచి అరటి మార్కెట్లకు తక్కువగా వస్తోంది. మార్కెట్లో పండుగల సీజన్ కారణంగా డిమాండ్ ఉన్నప్పటికీ దానికి తగినట్లుగా సరఫరా లేదని మండీల్లోని వ్యాపారులు చెబుతున్నారు. సాధారణ రోజుల్లో అరటిపళ్ల లోడ్ తో వచ్చే లారీల సంఖ్య కూడా ఇప్పుడు తగ్గిందని వారు అంటున్నారు. ఈ కారణంగా అరటిపళ్ల ధరలు పెరిగాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది.

రెండున్నర రెట్లు ఖరీదుగా మారిన అరటి..

రెండున్నర రెట్లు ఖరీదుగా మారిన అరటి..

ఆసియాలోనే అతిపెద్ద కూరగాయలు, పండ్ల మార్కెట్ అయిన ఆజాద్‌పూర్‌లో అరటిపండ్ల ధర ఆకాశాన్ని తాకుతోంది. రెండ్రోజుల క్రితం వరకు రూ.250-300కి లభించే 12 డజన్ల అరటిపండ్లు ఇప్పుడు రూ.700కి పెరిగాయి. ఈ కారణంగానే అరటిపండ్లు చిల్లరగా డజను రూ.70-80కి విక్రయిస్తున్నారు. ఇప్పటికే అనేక మంది వ్యాపారులు గోదాములకు తాళాలు వేయగా.. వీటి ధరలు ఇంకా పెరుగుతాయని అంటున్నారు. దేశవ్యాప్తంగా అత్యధికంగా మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి అరటిపండ్ల సరఫరా ఉంటుంది.

విదేశాలకు ఎగుమతులు..

విదేశాలకు ఎగుమతులు..

రైతులకు విదేశీ మార్కెట్‌లో మంచి ధర లభిస్తోంది. దీంతో దేశీయ మార్కెట్‌లో సరఫరా తగ్గింది. దీంతో గత మూడు నెలలుగా అరటిపళ్ల ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. మూడు నెలల గతంలో 16 టన్నుల అరటి బండి రూ.2.5 లక్షలకు వచ్చేదని వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పుడు దానికి ఐదు లక్షల రూపాయలు ఖర్చవుతోందని చెబుతున్నారు.

80 ఏళ్లలో ఎన్నడూ లేని రేటు..

80 ఏళ్లలో ఎన్నడూ లేని రేటు..

అరటిపండ్లను సిద్ధం చేయడానికి, స్టోర్ చేయటానికి ఏసీ గోదాములను వినియోగించటం వల్ల ఖర్చులు పెరిగాయని తెలుస్తోంది. అరటిపండ్లను ముగ్గించటానికి ముందుగా వాటిపై రసాయనాలు చల్లుతారు. అనంతరం గోడౌన్‌కు తాళం వేసి ఏసీ ప్లాంట్‌ను ప్రారంభిస్తారు. నిరంతరాయంగా ఏసీ నడుస్తుండడంతో భారీగా కరెంటు బిల్లు వస్తోందని వ్యాపారులు చెబుతున్నారు. తన గోదాముల్లో ఒకదానికి నెలకు కనీసం రూ.30,000 బిల్లు వస్తుందని ఒక వ్యాపారి చెప్పారు. అరటిపండ్ల ధరలు కూడా పెరగడానికి ఇదే కారణంగా తెలుస్తోంది. సబీహాబాద్ మండిలో అరటిపళ్లు ధర ఎనిమిది దశాబ్దాల్లో ఎన్నడూ తాను చూడలేదని రామ్ ప్రసాద్ మౌర్య అనే వినియోగదారుడు తెలిపాడు.

Read more about: news
English summary

Banana Prices: ఆకాశానికి అరటిపండు.. డజను ధర రూ.100.. సరఫరా ఎందుకు తగ్గిందంటే.. | banana prices sky rocking with 100 rupees a dozen know reason behind high prices

banana prices sky rocking with 100 rupees a dozen
Story first published: Friday, July 22, 2022, 11:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X