For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

14న బజాజ్ చేతక్ EV స్కూటర్ లాంచ్: ధర, ఇతర ఫీచర్స్...

|

vముంబై: చాలామంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ వాహనం జనవరి 14వ తేదీన మార్కెట్లోకి వస్తోంది. బజాజ్ చేతక్ బ్రాండ్ EVతో పునరాగమం చేస్తోన్న విషయం తెలిసిందే. గతంలో చేతక్ అంటే ఎంతో క్రేజ్. దీంతో ఇప్పుడు అదే పేరుతో ఈవీని తీసుకు వస్తోంది బజాజ్. ఈ స్కూటర్ ధర, ఎప్పుడు వస్తుందనే వివరాలు వెలుగు చూసినట్లుగా చెబుతున్నారు.

రూ.1.5 లక్షల లోపే బజాజ్ 'చేతక్': ఎలక్ట్రిక్ వెహికిల్స్‌పై రూ.30,000 వరకు సబ్సిడీరూ.1.5 లక్షల లోపే బజాజ్ 'చేతక్': ఎలక్ట్రిక్ వెహికిల్స్‌పై రూ.30,000 వరకు సబ్సిడీ

14న విడుదల... ధర రూ.1.20 లక్షలు

14న విడుదల... ధర రూ.1.20 లక్షలు

జనవరి 14, 2020న బజాజ్ చేతక్ విడుదల చేయనున్నారని సమాచారం. ఈ స్కూటర్ ధర దాదాపు రూ.1.20 లక్షలు (ఎక్స్ షోరూం) ఉంటుందని అంచనా. ఈ చేతక్ విక్రయాలు మొదట పుణేలో ప్రారంభమవుతున్నాయి. ఆ తర్వాత దశలవారీగా బెంగళూరు, ఢిల్లీ, ముంబై సహా మెట్రో నగరాల్లో విక్రయిస్తారు.

బజాజ్ చేతక్ స్కూటర్‌ను విడుదల చేసిన తర్వాతనే బుకింగ్స్ ప్రారంభమవుతాయి.

85 కిలో మీటర్ల దూరం...

85 కిలో మీటర్ల దూరం...

బజాజ్ చేతక్ 4kW ఎలక్ట్రిక్ మోటార్, దానికి శక్తిని ఇచ్చి లిథియం అయాన్ బ్యాటరీలను అమర్చారు. దీనిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ఎకో మోడల్ 95 కిలో మీటర్ల దూరం వెళ్తుంది. స్పోర్ట్స్ మోడల్ 85 కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తుంది.

మూడేళ్ల వారంటీ

మూడేళ్ల వారంటీ

ఈ స్కూటర్‌కు అన్ని రకాల ఆధునిక రైడింగ్ సదుపాయాలు కల్పించారు. మెటల్ బాడీ, ఎల్ఈడీ లైట్లు, సైడ్ స్టాండ్, ఇండికేటర్ ఫీచర్స్, పిలియన్ ఫూట్‌పెగ్స్ ఉన్నాయి. అలాయ్ వీల్స్‌తో పాటు బ్రేకింగ్ కోసం డిస్క్ బ్రేక్ సిస్టంను అమర్చారు. ఈ స్కూటర్‌కు మూడేళ్లు లేదా 50 వేల కిలో మీటర్ల వారెంటీ ఉండవచ్చు.

English summary

14న బజాజ్ చేతక్ EV స్కూటర్ లాంచ్: ధర, ఇతర ఫీచర్స్... | Bajaj to launch Chetak electric scooter on January 14

Bajaj Chetak Electric, which marks Bajaj Auto's foray into the electric vehicle space, will be launched on January 14, the company announced.
Story first published: Thursday, January 9, 2020, 9:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X