For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Steel Prices: ఇల్లు కట్టుకునే వారికి బ్యాడ్ న్యూస్.. జూన్ 1 నుంచి పెరగనున్న స్టీల్ ధరలు.. టన్నుకు ఎంతంటే..

|

Steel Prices: గత కొంత కాలంగా క్రమంగా కొంత మేర తగ్గుతూ వచ్చిన స్టీల్ ధరలకు మళ్లీ రెక్కలు వచ్చాయి. అసలే ద్రవ్యోల్బణం కారణంగా దేశంలో అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటిన వేళ ఈ వార్త ప్రజలపై మరింత భారంగా మారనుంది. అయితే కరోనా తరువాత ఆర్థిక వ్యవస్థ కొంత మేర కుదుకుపడుతోంది. ఈ కారణంగా ఆగిపోయిన అనేక నిర్మాణాలు తిరిగి పంజుకోవటం, ఇళ్లకు కూడా డిమాండ్ పెరగటం కూడా మనం గమనించవచ్చు. ఈ క్రమంలో.. అధిక ఇన్‌పుట్ ఖర్చుల కారణంగా స్టీల్ ధరలు జూలై నుంచి పెరుగుతాయని పరిశ్రమ ఎగ్జిక్యూటివ్ బుధవారం తెలిపారు.

రేటు పెరగటానికి ప్రధాన కారణాలు

రేటు పెరగటానికి ప్రధాన కారణాలు

ఒకపక్క బొగ్గు ధర టన్నుకు రూ.17,000 ఉండగా.. ఒడిశా మినరల్ కార్పొరేషన్ ఇనుప ఖనిజం ధరలు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. దేశంలో ఇనుప ఖనిజం ప్రధాన సరఫరాదారుగా ఒడిశా ఉందని ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంలో JSPL మేనేజింగ్ డైరెక్టర్ VR శర్మ పీటీఐ మీడియా సంస్థకు తెలిపారు. స్టీల్ రేట్లు ఇప్పటికే దిగువకు పడిపోయాయని.. ఈ సమయంలో వాటిని మరింత తగ్గించే అవకాశం లేదని ఆయన అన్నారు. ఇన్‌పుట్ ఖర్చులు అధికంగా ఉండటం వల్ల జూలై 1 నుంచి స్టీల్ ధరల సవరణ ఉంటుంది చెప్పారు.

ఇప్పటికే పెరిగిన రేట్లు

ఇప్పటికే పెరిగిన రేట్లు

సెకండరీ స్టీల్ తయారీదారులు ఇప్పటికే గత నాలుగు రోజుల్లో టన్నుకు రీబర్స్ ధరను రూ.2,000 పెంచారని తెలిపారు. దీంతో వాటి ధర టన్నుకు రూ. 55,000 వేలుగా ఉందని శర్మ తెలిపారు. దేశంలోని ఉక్కు తయారీదారులపై ఒత్తిడిని పెంచే అనేక ఇతర అంశాలు ఉన్నాయని అన్నారు. బొగ్గు లభ్యతతో సమస్యలు ఉన్నాయని శర్మ స్పష్టం చేశారు. చాలా వరకు బొగ్గును విద్యుత్ రంగానికి మళ్లించడంతో బొగ్గు సరఫరాకు ట్రాలీలు కూడా అందుబాటులో లేవని ఆయన తెలిపారు.

స్టీల్ తో పాటు ఇటుకలు, ఇసుక

స్టీల్ తో పాటు ఇటుకలు, ఇసుక

స్టీల్ ప్లేయర్‌లు తమ పవర్ ప్లాంట్‌లను పోషించడానికి బొగ్గును, ఉక్కు తయారీకి ఇనుప ఖనిజాన్ని ఉపయోగిస్తారు. మే నెలలో టన్ను హాట్ రోల్డ్ కాయిల్ (HRC) ధర గరిష్ఠంగా రూ.76,000 ఉండగా.. ప్రస్తుతం అది టన్నుకు రూ. 59,000-60,000 శ్రేణిలో ఉంది. వీటికి తోడు వర్షాకాలం కారణంగా ఇటుకలు, ఇసుక, సిమెంట్ వంటి వాటి ధరలు కూడా త్వరలోనే పెరుగుతాయని తెలుస్తోంది. కాబట్టి వినియోగదారులు ముందుగానే మేల్కోవటం చాలా ముఖ్యం.

English summary

Steel Prices: ఇల్లు కట్టుకునే వారికి బ్యాడ్ న్యూస్.. జూన్ 1 నుంచి పెరగనున్న స్టీల్ ధరలు.. టన్నుకు ఎంతంటే.. | bad news to people constructing houses as Steel prices likely to go up again from July 1 on high input cost

steel prices going to rise from july 1st know full details
Story first published: Thursday, June 30, 2022, 17:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X