For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనాపై పోరుకు అజీమ్ ప్రేమ్‌జీ రూ.1,125 కోట్ల భారీ విరాళం

|

కరోనా మహమ్మారిపై పోరుకు అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్, విప్రో భారీ విరాళాన్ని అందిస్తోంది. రిలయన్స్, టాటా గ్రూప్, అదానీ గ్రూప్, వేదాంత ఇలా ఎన్నో కార్పోరేట్ సంస్థలు ఈ వైరస్ పైన పోరుకు వందలు, వేల కోట్లు ఇస్తున్నారు. బుధవారం మహమ్మారిపై పోరుకు విప్రో, అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్, విప్రో ఎంటర్‌ప్రైజెస్ ప్రకటన చేశాయి. రూ.1,125 కోట్లను ప్రకటించింది.

టాటా నుండి అంబానీ వరకు కరోనాపై పోరుకు భారీ విరాళాలు, ధరలూ తగ్గించారుటాటా నుండి అంబానీ వరకు కరోనాపై పోరుకు భారీ విరాళాలు, ధరలూ తగ్గించారు

రూ.1,125 కోట్లు..

రూ.1,125 కోట్లు..

కరోనాపై పోరుకు అజీమ్ ప్రేమ్‌జీ రూ.1125 కోట్ల విరాళం ప్రకటించారు. ఇందులో అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ ద్వారా రూ.1000 కోట్లు, విప్రో లిమిటెడ్ ద్వారా రూ.100 కోట్లు, విప్రో ఎంటర్ ప్రైజెస్ ద్వారా రూ.25 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. విప్రో ప్రతి సంవత్సరం CSR ఫండ్ కింద కేటాయించే మొత్తం కాకుండా అదనంగా ఈ విరాళాన్ని ఇచ్చారు.

కష్టకాలంలో..

కష్టకాలంలో..

కరోనా వైరస్ పైన భారత్ చేస్తోన్న పోరుకు ఈ నిధుల ద్వారా మద్దతు లభిస్తోందని భావిస్తున్నట్లు విప్రో అభిప్రాయపడింది. ముఖ్యంగా కష్టకాలంలో వెనుకబడిన వర్గాలకు ప్రయోజనం చేకూరుతుందని ఆశిస్తున్నట్లు తెలిపింది. పరిస్థితులు దయనీయంగా ఉన్న ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరిచేందుకు సమగ్ర చర్యలు చేపట్టనున్నట్లు తెలిపింది.

ఇన్పోసిస్ వైద్య సేవలు కూడా..

ఇన్పోసిస్ వైద్య సేవలు కూడా..

కరోనాపై పోరుకు రతన్ టాటా గ్రూప్ రూ.1,500 కోట్లు అందించింది. ఇన్ఫోసిస్ రూ.100 కోట్లు ఇచ్చింది. అంతేకాదు, నారాయణ హెల్త్‌తో కలిసి బెంగళూరులో 100 మంది పేషెంట్లకు నిర్బంద వైద్య సదుపాయాలు అందిస్తామని తెలిపింది ఇన్ఫోసిస్. సమాజంలో ఆర్థికంగా బలహీనంగా ఉన్న రోగులకు ఇందులో చికిత్స అందిస్తుంటారని, డాక్టర్లు, నర్సుల ద్వారా క్రమం తప్పకుండా పర్యవేక్షణ ఉంటుందని, అవసరమైన మందులు ఉచితంగా అందిస్తామని ఇన్ఫోసిస్ తెలిపింది.

English summary

కరోనాపై పోరుకు అజీమ్ ప్రేమ్‌జీ రూ.1,125 కోట్ల భారీ విరాళం | Azim Premji Foundation, Wipro commit Rs 1,125 crore to tackle Covid 19

On Wednesday, Azim Premji Foundation, Wipro, and Wipro Enterprises together committed a sum of Rs 1,125 crore for tackling Covid-19, making it one of the largest such donations among India corporate houses.
Story first published: Thursday, April 2, 2020, 7:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X