For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Credit Score: క్రెడిట్ కార్డ్ విషయంలో ఈ 4 తప్పులు అస్సలు చేయకండి.. లేకుంటే క్రెడిట్ స్కోర్ ఫసక్..

|

CIBIL Score: క్రెడిట్ స్కోర్‌ను పెంచుకోవటం గురించి మీరు చాలా సార్లు అనేక అంశాలను చదివి ఉండవచ్చు. అయితే.. మీ క్రెడిట్ స్కోర్‌పై ఎలాంటి అంశాలు ప్రభావం చూపుతాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలే.. ఈ రోజుల్లో క్రెడిట్ కార్డులను అందరూ విపరీతంగా వాడేస్తున్నారు. తాజాగా రిజర్వు బ్యాంక్ విడుదల చేసిన వివరాలు కూడా అదే సూచిస్తున్నాయి. దేశంలో క్రెడిట్ కార్డులు, బై నౌ పే లేటర్ సాధనాలు, ఇతర క్రెడిట్ లైన్లను వినియోగదారులు ఎక్కువగా వినియోగిస్తున్నారు.

ఈ తరుణంలో వాటి విషయంలో చేయకూడని తప్పుల గురించి కూడా మనం తప్పకుండా తెలుసుకోవాలి. అయితే ప్రధానంగా ఈ నాలుగు తప్పుల కారణంగా మీ క్రెడిట్ స్కోర్ ప్రభావితం అయ్యే అవతుంది. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటేనే సులువుగా, ఆకర్షనీయమైన వడ్డీ రేట్లను రుణాలను బ్యాంకులు అందిస్తాయి కాబట్టి చేయకూడని తప్పుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..

 పరిమితిని మించకూడదు..

పరిమితిని మించకూడదు..

జీవితంలో జరిగే విషయాలను మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఆర్థిక విషయాల్లో ఇది చాలా ముఖ్యమైనది. మీ క్రెడిట్ కార్డ్ లావాదేవీలను ట్రాక్ చేయడం అత్యవసరం అని గుర్తుంచుకోండి. క్రెడిట్ కార్డ్‌లను అత్యవసర పరిస్థితులు లేదా విలాసవంతమైన ఖర్చుల కోసం ఉపయోగించవచ్చు. ఇది మీ క్రెడిట్ స్కోర్‌పై కూడా ప్రభావం చూపుతుంది. అయితే గరిష్ఠ పరిమితిని మించకుండా ఉపయోగించుకోవాలి. అలాంటప్పుడే మంచి క్రెడిట్ హిస్టరీ బిల్డ్ అవుతుంది.

 30 శాతం లోపల ఉపయోగించండి..

30 శాతం లోపల ఉపయోగించండి..

క్రెడిట్ కార్డ్‌ని సరిగ్గా ఎలా ఉపయోగించాలో మీకు తెలియకపోతే.. మీ క్రెడిట్ కార్డ్ పరిమితిలో 30% లోపల యుటిలిటీని ఉంచండి. మీరు ఒక నెలలో క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎంత వాడతారనేది కూడా గమనించుకోవలసిన విషయం. అలాగే.. మీ క్రెడిట్ కార్డ్‌ని సకాలంలో చెల్లించడంలో విఫలమవడం లేదా బిల్లింగ్ సమయంలో తక్కువ మొత్తాన్ని మాత్రమే చెల్లించడం సరైనది కాదు. అంటే కనీస మెుత్తాన్ని మాత్రమే చెల్లించటం వల్ల మీ క్రెడిట్ స్కోర్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది.

సకాలంలో బిల్లు చెల్లించండి..

సకాలంలో బిల్లు చెల్లించండి..

క్రెడిట్ కార్డ్ బిల్లును పూర్తిగా చెల్లించడంలో విఫలమయ్యే బదులు, మీరు కనీస మొత్తాన్ని చెల్లించవచ్చు. కానీ ఇలా తక్కువ మెుత్తాన్ని చెల్లించటాన్ని రొటీన్‌గా చేసుకోకండి. ఎందుకంటే మీరు కొంత డబ్బు చెల్లించినప్పటికీ.. ఇంకా చెల్లించాల్సింది మిగిలే ఉంటుందని గుర్తుంచుకోండి. దీనివల్ల మీ క్రెడిట్ స్కోర్ ప్రభావితం అవ్వడంతో పాటు, మిగిలిన మెుత్తంపై కంపెనీలు భారీ వడ్డీని వసూలు చేస్తాయి. ఇలా జరగటం వల్ల మీపై భారం మరింతగా పెరుగుతుంది.

అవసరమైన దానికంటే ఎక్కువ షాపింగ్ వద్దు..

అవసరమైన దానికంటే ఎక్కువ షాపింగ్ వద్దు..

కస్టమర్లను ఆకట్టుకోవడానికి కార్డ్ జారీ చేసే కంపెనీలు తక్కువ వడ్డీ, బోనస్‌లను అందిస్తుంటాయి. ఇది టెంప్టింగ్‌గా అనిపించినప్పటికీ.. అవసరమైనంత వరకు మాత్రమే దానిని వినియోగించుకోవాలి. అధికంగా వాడటం వల్ల చెల్లించటం సాధ్యం కాకపోవచ్చు. దీని కారణంగా మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుందని గుర్తుంచుకోండి. దీనితో పాటు మీరు తరచుగా క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోండి. అప్పుడే మీ క్రెడిట్ స్కోర్‌లో ఏవైనా తప్పులున్నా, తగ్గుతున్నా వాటిపై దృష్టి సారించవచ్చు. ఇలా చేయటం వల్ల క్రెడిట్ కార్డుల విషయంలో మీరు చేసే తప్పులను తగ్గించుకోవచ్చు. మెరుగైన క్రెడిట్ స్కోర్ తో బెనిఫిట్ పొందవచ్చు.

English summary

Credit Score: క్రెడిట్ కార్డ్ విషయంలో ఈ 4 తప్పులు అస్సలు చేయకండి.. లేకుంటే క్రెడిట్ స్కోర్ ఫసక్.. | Avoid these four mistakes in using credit cards to maintain good credit score

know about these mistakes that you make while using credit cards that ruin your credit score
Story first published: Wednesday, June 29, 2022, 11:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X