For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెద్ద సైజ్ అపార్ట్‌మెంట్లకు డిమాండ్, హైదరాబాద్‌లోనే ఎక్కువ

|

హైదరాబాద్: కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగుతోంది. దీంతో ఇళ్ల కొనుగోలుదారులు ఇప్పుడు పెద్ద అపార్ట్‌మెంట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. దేశంలోని ఏడు పెద్ద లేదా ప్రధాన నగరాల్లో అపార్ట్‌మెంట్ పరిమాణం నాలుగేళ్లలో మొదటిసారి పెరిగినట్లు ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ ప్రాపర్టీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఓ వైపు రియాల్టీ పెట్టుబడులు క్షీణించగా, మరోవైపు ప్లాట్ల విస్తీర్ణాలు పెరుగుతున్నాయి.

ఈ ఉత్పత్తులపై దిగుమతి సంకాలు భారీగా పెరవగవచ్చు, ఎందుకంటే?ఈ ఉత్పత్తులపై దిగుమతి సంకాలు భారీగా పెరవగవచ్చు, ఎందుకంటే?

హైదరాబాద్‌లోనే ఎక్కువ

హైదరాబాద్‌లోనే ఎక్కువ

2020లో ఏడు ప్రధాన నగరాల్లో అపార్ట్‌మెంట్ సగటు పరిమాణం 10% వృద్ధి చెంది 1,150 చదరపు అడుగులకు చేరుకుంది. విస్తీర్ణం ఎక్కువ ఉన్న ఫ్లాట్లకు డిమాండ్ పెరగడమే వృద్ధికి కారణామని ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ వెల్లడించింది. 2019లో దేశంలో సగటు ఫ్లాట్ల విస్తీర్ణం 1,050 చదరపు అడుగులు. దేశంలోని ఇతర మెట్రో నగరాల కంటే హైదరాబాద్ సిటీలోనే అపార్ట్‌మెంట్స్ సైజ్ బాగా వృద్ధి చెందింది. 2019లో హైదరాబాద్‌లో సగటు ఫ్లాట్స్ విస్తీర్ణం 1,700 చదరపు అడుగులు కాగా, గత ఏడాది 3 శాతం పెరిగి 1,750 చదరపు అడుగులకు చేరుకుంది.

ఫ్లాట్ విస్తీర్ణం తగ్గుతూ

ఫ్లాట్ విస్తీర్ణం తగ్గుతూ

2016 నుంచి ప్రతి ఏడాది సగటు ఫ్లాట్ విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. అయితే గత ఏడాది మాత్రం పెరిగింది. ఆదాయ స్థోమత, నిర్వహణ చార్జీల తగ్గింపు కోసం గతంలో గృహ కొనుగోలుదారులు చిన్న సైజ్ అపార్ట్‌మెంట్స్‌పై ఆసక్తి చూపేవాళ్లు. అందుకు తగ్గట్లుగా తక్కువ ధరలతో ఆకర్షించేందుకు డెవలపర్స్ చిన్న పరిమాణం కలిగిన ఫ్లాట్స్ నిర్మించేవాళ్లు. అయితే 2020లో మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల కొనుగోలుదారుల గృహ ప్రాధాన్యతలో మార్పులు వచ్చాయని చెబుతున్నారు. అందుకే గత నాలుగేళ్లుగా ఎన్నడు లేనివిధంగా 2020లో అపార్ట్‌మెంట్ల విస్తీర్ణాలు పెరిగాయి.

ఎలా తగ్గిందంటే

ఎలా తగ్గిందంటే

దేశంలోని మొదటి ఏడు నగరాల్లో అపార్ట్‌మెంట్ పరిమాణం సగటున 2015లో 1400 చదరపు అడుగులు, 2016లో 1440 చదరపు అడుగులు, 2016లో 1260 చదరపు అడుగులు, 2017లో 1260 చదరపు అడుగులు, 2018లో 1160 చదరపు అడుగులు, 2019లో 1050 చదరపు అడుగులు, 2020లో 1150 చదరపు అడుగులుగా ఉంది. మొదట్లో పరిమాణం తగ్గడానికి తక్కువ ధరల గృహాలు మిలీనియల్స్ ప్రాధాన్యత, తక్కువ ధరతో ఎక్కువ కొనుగోలుదారులను ఆకర్షించేందుకు డెవలపర్లు మొగ్గు చూపడం.

English summary

పెద్ద సైజ్ అపార్ట్‌మెంట్లకు డిమాండ్, హైదరాబాద్‌లోనే ఎక్కువ | Average apartment sizes remain high in Hyderabad

Average apartment size in residential projects launched last year increased by 10 per cent to 1,150 sq ft, as builders expected demand for bigger flats to rise after the COVID-19 pandemic, according to property consultant Anarock.
Story first published: Friday, January 22, 2021, 19:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X