For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆటో సేల్స్ 11 శాతం డౌన్, పీవీ సేల్స్ 8 శాతం జంప్

|

ఆగస్ట్ నెలలో వాహనాల సేల్స్ ఏడాది ప్రాతిపదికన 11 శాతం తగ్గాయి. పాసింజర్ వెహికిల్ సేల్స్ 8 శాతం పెరిగాయి. ప్రధానంగా సెమీ కండక్టర్స్ కొరత ఆటో సేల్స్ పైన తీవ్ర ప్రభావం చూపింది. సెమీ కండక్టర్స్ కొరత వాహనాల ఉత్పత్తిపై ప్రభావం చూపిందని ఆటో ఇండస్ట్రీ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్-సియామ్(SIAM) తెలిపింది. కమర్షియల్ వెహికిల్స్‌ను మినహాయించి అన్ని రకాల వాహనాల సేల్స్ ఆగస్ట్ నెలలో 15,86,873 యూనిట్లుగా నమోదయ్యాయి. 2020 ఆగస్ట్ నెలలో ఈ సేల్స్ 17,90,115గా ఉన్నాయి.

ఓఈఎ నుండి డీలర్స్‌కు టూ-వీలర్స్ వాహనాల డిస్పాచ్ తగ్గింది. అదే సమయంలో 2020 ఆగస్ట్ నెలతో పోలిస్తే గత నెలలో(ఆగస్ట్ 2021) త్రీవీలర్, పాసింజర్ వెహికిల్స్ డిస్పాచ్ పెరిగింది. టూవీలర్స్ ఓఈఎంల నుండి డీలర్స్‌కు ఏడాది ప్రాతిపదికన 15 శాతం తగ్గి 15,59,665 యూనిట్ల నుండి 13,31,436 యూనిట్లకు పడిపోయాయి. మోటార్ సైకిల్ సేల్స్ 2020 ఆగస్ట్‌లో 10,32,476 యూనిట్లు అమ్ముడుపోగా, ఈ ఆగస్ట్ నెలలో 8,25,849 యూనిట్లకు తగ్గింది. అంటే దాదాపు 20 శాతం క్షీణించింది. స్కూటర్ డిస్పాచ్ 1 శాతం తగ్గి 4,56,848 నుండి 4,51,967 యూనిట్లకు పరిమితమైంది.

మొత్తం పాసింజర్ వెహికిల్ సేల్స్(కార్లు, యుటిలిటీ వెహికిల్స్, వ్యాన్స్ కలిపి) ఓఈఎంల నుండి డీలర్‌షిప్స్‌కు 7 శాతం పెరిగాయి. గత ఏడాది ఆగస్ట్‌లో 2,15,916 యూనిట్లు కాగా, ఈ ఆగస్ట్‌లో 2,32,224 యూనిట్లకు పెరిగింది. త్రీ-వీలర్ హోల్‌సేల్స్ ఏకంగా 60 శాతం పెరిగి 14,534 యూనిట్ల నుండి 23,210 యూనిట్లకు పెరిగాయి. వరుసగా వస్తున్న పలు సవాళ్లతో భారత ఆటో మొబైల్ పరిశ్రమ తీవ్ర ఒత్తిడిలో ఉందని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ అన్నారు. గ్లోబల్ సెమీ కండక్టర్ షార్టేజ్ కొనసాగుతోందని, ఈ ప్రభావం వాహనాల ఉత్పత్తిపై కనిపిస్తోందని చెబుతున్నారు.

Auto sales drop 11 percent in August, PV sales grow 8 percent

ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా ఆటో పరిశ్రమలో సెమీ కండక్టర్స్ వినియోగం పరిగింది. టెక్నాలజీ అడ్వాన్స్‌మెంట్, న్యూ మోడల్, మరిన్ని ఎలక్ట్రానికి ఫీచర్స్‌తో కలిపి వస్తున్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీ, డ్రైవర్ అసిస్టెంట్, నావిగేషన్, హైబ్రిడ్ ఎలక్ట్రిక్ సిస్టం, ఇంజైన్ కంట్రోల్ యూనిట్ వంటివి ఉంటున్నాయి. సెమీ కండక్డర్స్ డిమాండ్‌లో ఆటో పరిశ్రమ వాటా పది శాతంగా ఉంది. మిగిలిన వాటిలో ఎలక్ట్రానిక్ అప్లియెన్సెస్, గాడ్జెట్స్ ఇండస్ట్రీ (మొబైల్ ఫోన్స్, ల్యాప్‌టాప్ వంటివి) ఉన్నాయి.

ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుండి ఆగస్ట్ మధ్య పాసింజర్ వెహికిల్ సేల్స్ సెగ్మెంట్ సేల్స్ 2016-17 కంటే తక్కువగా ఉన్నాయి. టూ-వీలర్ సెగ్మెంట్ సేల్స్ 2011-12 కంటే తక్కువగా, త్రీ-వీలర్ సెగ్మెంట్ సేల్స్ ఎన్నో ఏళ్ల కంటే తక్కువగా ఉన్నాయి.

మధ్య స్థాయి సెడాన్ మోడల్ సియాజ్ మొత్తంగా మూడు లక్షల అమ్మకాల మైలురాయిని అధిగమించినట్లు మారుతీ సుజుకీ ప్రకటించింది. 2014లో కంపెనీ మొట్టమొదటిసారిగా ఈ కారును విడుదల చేసింది. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగిన సియాజ్‌లో ఇంధన సామర్థ్యాన్ని పెంచే స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీని వినియోగించారు. ప్రస్తుతం ఈ కార్ల ధరలు రూ.8.72- రూ.11.71 లక్షలు (ఎక్స్-షోరూం, ఢిల్లీ)గా ఉంది.

English summary

ఆటో సేల్స్ 11 శాతం డౌన్, పీవీ సేల్స్ 8 శాతం జంప్ | Auto sales drop 11 percent in August, PV sales grow 8 percent

The total wholesales across categories, excluding commercial vehicles, declined to 15,86,873 units last month, compared to 17,90,115 units in August 2020.
Story first published: Sunday, September 12, 2021, 15:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X