For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Free Benz Car: ఉద్యోగులకు బెంజ్ కార్ ఆఫర్.. ఆ ఒక్క చిన్నపని చేస్తే చాలు.. స్టార్టప్ క్రేజీ ఐడియా..

|

Startup: ఒక స్టార్టప్ ఐడియాను పట్టాలెక్కించి కార్యరూపంలోకి తీసుకురావటం అంత ఈజీ కాదు. ఒకవేళ ఆలోటనను ముందుకు తీసుకెళ్లేందుకు ఇన్వెస్టర్లు దొరికినా మార్కెట్లో పోటీ తట్టుకుని నిలబడి లాభాల బాట పట్టేలా చేయటం అంత సులువేమీకాదు.

స్టార్టప్ గురించి..

స్టార్టప్ గురించి..

మనందరికీ భారత్‌పే సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ బాగా తెలుసు. అయితే ఇప్పుడు ఆయన చేసిన ఒక ప్రకటన సంచలనంగా మారింది. దేశంలో చాలా మందిని ఆకర్షిస్తోంది కూడా. భారత్ పే వివాదం తర్వాత ఆయనకు ప్రజాదరణ భారీగా పెరిగింది. దీంతో ఆయన షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్- 1లో న్యాయనిర్ణేతగా మారారు. BharatPe నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన తన సొంత స్టార్టప్ కంపెనీ ప్రారంభిస్తున్నారు. తన లింక్డ్ఇన్ ప్రొఫైల్ లో దీనికి సంబంధించిన వివరాలను పంచుకున్నారు. స్టార్టప్‌తో పాటు జనాలకు కూడా బ్యాంగ్ ఆఫర్ ఇచ్చారు.

ప్రజలకు ఆహ్వానం..

ప్రజలకు ఆహ్వానం..

అష్నీర్ గ్రోవర్ తన కొత్త స్టార్టప్ థర్డ్ యునికార్న్‌ను ప్రకటించారు. అయితే దీనిలో ఇన్వెస్ట్ చేసేందుకు పెట్టుబడిదారులను, వ్యక్తులను ఆహ్వానించారు. ఇదే సమయంలో ప్రజలకు ఆకర్షణీయమైన ఆఫర్లను కూడా ప్రకటించారు. 2023లో భిన్నమైన పనులు చేద్దామనుకుంటున్నానని.. త్వరలో మూడో యునికార్న్‌తో మార్కెట్‌లో దూసుకుపోతామని చెప్పారు. అష్నీర్ గ్రోవర్ తన స్టార్టప్‌ను విభిన్న శైలిలో పరిచయం చేస్తూ.. మీరు తదుపరి TODU - FODUలో భాగం కావాలనుకుంటే ముందుకు రండి అంటూ అందులో రాశారు.

బెంజ్ కార్ ఆఫర్..

బెంజ్ కార్ ఆఫర్..

తాను ప్రారంభిస్తున్న యునికార్న్‌లో భాగం కావాలంటూ ప్రజలకు చేసిన ఆఫర్ కూడా ప్రత్యేకమైనది. దీనికోసం తాను వెంచర్ క్యాపిటలిస్ట్ నుంచి నిధులను సేకరించటం లేదని అష్నీర్ గ్రోవర్ రాశారు. కొత్త వ్యాపారాన్ని తన సొంత డబ్బుతోనే ప్రారంభించాలని నిర్ణయించినట్లు చెప్పారు. అష్నీర్ బృందంలో దాదాపు 50 మంది సభ్యులు ఉంటారు. తన స్టార్టప్‌లో ఉద్యోగిగా ఐదేళ్లు పూర్తిచేసుకున్న వారికి.. మెర్సిడెస్ కారును అందించనున్నట్లు వెల్లడించారు. తన కొత్త స్టార్టప్ కంపెనీకి థర్డ్ యునికార్న్ అని పేరు పెట్టారు గ్రోవర్.

English summary

Free Benz Car: ఉద్యోగులకు బెంజ్ కార్ ఆఫర్.. ఆ ఒక్క చిన్నపని చేస్తే చాలు.. స్టార్టప్ క్రేజీ ఐడియా.. | Ashnner Grover offering mercedes benz car to startup employees know details

Ashnner Grover offering mercedes benz car to startup employees know details
Story first published: Thursday, January 12, 2023, 12:01 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X