For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టెక్ దిగ్గజం ఆపిల్ శుభవార్త: మరో 4 రోజుల్లో తొలి ఆన్‌లైన్ స్టోర్

|

ఆపిల్ ఐఫోన్ అభిమానులకు శుభవార్త. మరో నాలుగు రోజుల్లో తన తొలి ఆన్‌లైన్ స్టోర్‌ను ప్రారంభించనుంది ఈ టెక్ దిగ్గజం. ఈ మేరకు ఆపిల్ సీఈవో టిమ్ కుక్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. దీంతో భారత్‌లో తమ కస్టమర్లకు ఆపిల్ మరింత చేరువవుతుందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 23వ తేదీన తమ తొలి స్టోర్‌‍ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రపంచంలోనే భారత్ రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్. చాలా ఏళ్ల తర్వాత స్టోర్‌ను ప్రారంభిస్తోంది.

ICICI గుడ్‌న్యూస్, వారికీ రూ.50 లక్షల వరకు హోమ్‌లోన్: ఎవరెవరికి, ఎలా తీసుకోవాలి?ICICI గుడ్‌న్యూస్, వారికీ రూ.50 లక్షల వరకు హోమ్‌లోన్: ఎవరెవరికి, ఎలా తీసుకోవాలి?

సెప్టెంబర్ 23న స్టోర్.. వివిధ భాషల్లో సలహాలు

సెప్టెంబర్ 23న స్టోర్.. వివిధ భాషల్లో సలహాలు

తమకు ఇష్టమైన వారితో, చుట్టు ఉన్న ప్రపంచంతో సన్నిహితంగా ఉండటం కస్టమర్లకు ఎంత ముఖ్యమో తమకు తెలుసునని, అందుకే తమ కస్టమర్లకు మరింతగా చేరువయ్యేందుకు, వారికి సేవలు అందించేందుకు తాము ఉత్సాహంగా ఎదురు చూస్తున్నామని, ఇందుకోసం సెప్టెంబర్ 23వ తేదీన భారత్‌లో తొలి ఆన్‌లైన్ స్టోర్‌ను ప్రారంభిస్తున్నామని టిమ్‌కుక్ వెల్లడించారు. భారత్‌లో విస్తరిస్తున్నందుకు గర్వంగా ఉందని, యూజర్లకు మద్దతు, సాయం చేసేందుకు సిద్ధమని ఆపిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఓబ్రియన్ తెలిపారు. ఆపిల్ స్పెషలిస్ట్స్ ద్వారా సలహాలు పొందవచ్చునని, కొత్త ఆపిల్ ఉత్పత్తులపై వివిధ భారతీయ భాషల్లో తెలుసుకోవచ్చునని చెప్పారు.

చెల్లింపులు వివిధ మార్గాల్లో..

చెల్లింపులు వివిధ మార్గాల్లో..

- ఆపిల్ స్టోర్ ఆన్‌లైన్‌లో డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఈఎంఐ, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు ఆన్ డెలివరీ, యూపీఐ, రూపే ఇలా వివిధ మార్గాల్లో చెల్లింపులు జరపవచ్చు.

- ఆన్ లైన్ స్టోర్ ద్వారా ఆపిల్ కేర్ ప్లస్ అందుబాటులో ఉన్నాయి. వీటిపై రెండేళ్ల పాటు వారెంటీ ఉంటుంది. టెక్నికల్ సపోర్ట్, యాక్సిడెంటల్ డ్యామేజ్ వారెంటీ ఉంది.

- ట్రేడ్ ఇన్ ప్రోగ్రాం ఆఫర్ కూడా ఉంది. దీంతో అర్హత కలిగిన స్మార్ట్ ఫోన్‌కు బదులు తక్కువ ధరకు ఐఫోన్ కొనుగోలు చేయవచ్చు.

- ఆపిల్ యాక్సెసరీస్, కేర్, మాక్, ఐప్యాడ్ ఉత్పత్తులపై ప్రత్యేక ఆఫర్ ఇస్తోంది. ఈ పండుగ సీజన్‌లో ఆపిల్ సిగ్నేచర్ గిఫ్ట్ ర్యాప్, ఎంచుకున్న ఉత్పత్తులపై గిఫ్ట్ ర్యాప్, కస్టమ్ ఎన్‌గ్రేవింగ్ ఆప్షన్స్ ఉన్నాయి.

- ఎయిర్ పాడ్స్‌లో ఇంగ్లీష్, తెలుగు, బెంగాళీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మరాఠీ, తమిళ్ భాషల్లో ఎమోజీ లేదా టెక్స్ట్ అందుబాటులో ఉంటుంది.

ఇప్పటి వరకు వీటి ద్వారా..

ఇప్పటి వరకు వీటి ద్వారా..

ఆపిల్ సంస్థ ఇప్పటి వరకు తమ ఉత్పత్తులను మన దేశంలో విక్రయించడం కోసం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ దిగ్గజాలపై ఆధారపడింది. థర్డ్ పార్టీ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిటైలర్స్ ద్వారా విక్రయించింది. భారత్‌లో తమ 2021లోపు తొలి ఆపిల్ రిటైల్ స్టోర్‌ను ప్రారంభిస్తామని ఆపిల్ ఇదివరకే ప్రకటించింది. అయితే ఈ ఏడాదిలోనే దీనిని తీసుకు రానుంది.

English summary

టెక్ దిగ్గజం ఆపిల్ శుభవార్త: మరో 4 రోజుల్లో తొలి ఆన్‌లైన్ స్టోర్ | Apple store online is launching in India on September 23

Customers will have the option to pay for products on Apple Store online with a debit card, credit card EMI, net banking, credit card on delivery, UPI, and RuPay. Apple will provide free, no-contact delivery on these products.
Story first published: Friday, September 18, 2020, 17:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X