For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చైనా కంపెనీలకు షాక్, 4,500 చైనా గేమ్స్ యాప్స్ తొలగించిన ఆపిల్

|

సరిహద్దుల్లో ఉద్రిక్తతలను పెంచే ప్రయత్నం చేస్తోన్న చైనాకి భారత ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. 59 చైనీస్ యాప్స్‌ను నిషేధించింది. తాజాగా, ఆపిల్.. చైనీస్ యాప్‌కు భారీ ఝలక్ ఇచ్చింది. మూడు రోజుల్లో ఏకంగా 4,500 చైనీస్ గేమ్స్‌ను తొలగించింది. మొబేల్ గేమింగ్ లైసెన్స్ నిబంధనల్లో ఆపిల్ పలు సంస్కరణలు చేపట్టింది. ఇందులో భాగంగా చైనా గేమ్స్‌ను తొలగించింది. చట్టపరంగా అనుమతిలేని గేమ్స్‌ను తాము ఉండనివ్వమని స్పష్టం చేసింది.

59 యాప్స్ నిషేధంపై WTOకు వెళ్తే... ఈ కారణాలతో చైనా అడ్డంగా బుక్కైనట్లే!59 యాప్స్ నిషేధంపై WTOకు వెళ్తే... ఈ కారణాలతో చైనా అడ్డంగా బుక్కైనట్లే!

లైసెన్స్ నిబంధనలు

లైసెన్స్ నిబంధనలు

లైసెన్స్ నిబంధనల్ని కఠినతరం చేస్తున్నట్లు గత ఏడాది ఆపిల్ ప్రకటించింది. తొలగించిన ఆ యాప్స్‌ను లైసెన్స్ నిబంధనలను తిరిగి పునరుద్ధరించిన తర్వాత అప్ లోడ్ చేసుకోవచ్చునని తేల్చి చెప్పింది. ఆపిల్ తీసుకున్న ఈ చర్యలతో చైనా సంస్థలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా చైనీస్ యాప్ డెవలపర్స్ తమ యాప్స్‌ను యాప్ స్టోర్‌లలో ఉంచడం కోసం చైనీస్ రెగ్యులేటరీ నుండి అధికారిక లైసెన్స్ కలిగి ఉండాలి. లైసెన్స్ రాకముందే ప్రాసెస్‌లో ఉండగానే పలు యాప్స్.. స్టోర్స్‌లలో ప్రత్యక్షమవుతున్నాయి. ఇప్పుడు తాజా నిబంధనల ప్రకారం డెవలపర్స్ లైసెన్స్ పొందిన తర్వాతే యాప్స్‌ను అప్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఆపిల్ అతిపెద్ద ప్రక్షాళన

ఆపిల్ అతిపెద్ద ప్రక్షాళన

ఆపిల్ దీనిని ఇదివరకే ప్రకటించింది. జూన్ 30వ తేదీ నుండి అమలులోకి వస్తుందని కూడా తెలిపింది. దీంతో వరుసగా గత మూడు రోజుల నుండి లైసెన్స్ పొందని యాప్స్‌ను తొలగిస్తోంది. నివేదిక ప్రకారం జూలై నెలలో మొదటి రెండు రోజుల్లోనే చైనా యాప్ స్టోర్ నుండి 3,000కు పైగా యాప్స్‌ను తొలగించారు. మొత్తంగా 4500 యాప్స్ తొలగించారు. ఆపిల్ గేమ్ యాప్స్ ప్రక్షాళనల్లో ఇది అతి పెద్దదిగా నిలిచింది.

అప్పుడే తిరిగి రావడం కష్టం

అప్పుడే తిరిగి రావడం కష్టం

చైనా ప్రతి సంవత్సరం 1500 లైసెన్స్‌ను మాత్రమే జారీ చేస్తుంది. అలాగే లైసెన్స్ ప్రక్రియ పూర్తి కావడానికి ఆరు నెలల నుండి ఏడాది సమయం పడుతుంది. అందువల్ల యాప్ స్టోర్ నుండి రిమూవ్ చేసిన ఈ యాప్స్ తిరిగి అప్ లోడ్ కావాలంటే త్వరగా అయ్యే పని కాదని అంటున్నారు. పరిమిత సంఖ్యలో లైసెన్స్‌లు ఇవ్వడం, లైసెన్స్ రావడానికి చాలాకాలం పట్టడం ఇందుకు కారణం. ఆపిల్ జూలై 1న 1,571 యాప్స్, జూలై 2న 1,805 యాప్స్, జూలై 3న 1,276 యాప్స్‌ను తొలగించింది. ఇది ఇలాగే కొనసాగుతుందని, దాదాపు 20,000 యాప్స్ పైన ప్రభావం పడవచ్చునని అంటున్నారు.

English summary

చైనా కంపెనీలకు షాక్, 4,500 చైనా గేమ్స్ యాప్స్ తొలగించిన ఆపిల్ | Apple removed 4,500 china games from APP store

Apple has removed more than 4,500 mobile games from the Chinese App Store in three days thanks to a change in licensing restrictions in China.
Story first published: Sunday, July 5, 2020, 16:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X