For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

AI: టెస్లా AI సాంకేతికతపై ఆపిల్ కో ఫౌండర్ విమర్శలు.. మస్క్ మాటతప్పాడంటూ ఆరోపణలు

|

AI: అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పై టెక్ ఐకాన్ మరియు ఆపిల్ సంస్థ సహ వ్యవస్థాపకులు స్టీవ్ వోజ్నియాక్ తీవ్ర విమర్శలు చేశారు. సైల్ఫ్ డ్రైవింగ్ కార్ల విషయంలో మస్క్ విఫలమైనట్లు ఆరోపించారు. వాటిలో వినియోగించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత ప్రాణాంతకం కావచ్చని హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వోజ్నియాక్ పలు విషయాలను వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి ఎలాన్ మస్క్ చేస్తున్న ప్రయత్నాలను ఆయన కొనియాడారు. కానీ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను పరిచయం చేస్తానన్న మస్క్ వాగ్ధానం ఇంకా నెరవేర్చకపోవడంపై నిరాశను వ్యక్తం చేశారు.

 teslaai

"2016 నాటికి మాకు సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను అందిస్తానని మస్క్ ప్రామిస్ చేశారు. దాని కోసం నేను నగదు సైతం చెల్లించాను. 50 వేల డాలర్లు వెర్షన్‌ కి అప్‌గ్రేడ్ చేసాను. కానీ అది ఇంతవరకు పూర్తి కాలేదు. ఆయన ఎప్పుడూ వాగ్ధానాలు చేస్తూ ఉంటారు కానీ అవి జరగవు " అని స్టీవ్ వోజ్నియాక్ వెల్లడించారు.

టెస్లాకు చెందిన AI సాంకేతికత గురించి కూడా వోజ్నియాక్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ కృత్రిమ మేధస్సు ప్రమాదకరమని హెచ్చరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో బగ్స్, తప్పులను అధ్యయనం చేయాలంటే టెస్లా కారును తీసుకుంటే సరిపోతుందన్నారు. AI విషయమై భయాలు ఉన్నప్పటికీ తాను కొత్త సాంకేతికతకు భయపడనని, దాని దుర్వినియోగం విషయంలోనే కన్సర్న్ ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ టెక్నాలజీ అభివృద్ధి చేసే కంపెనీలు నైతిక విలువలకు, భద్రతకు ప్రాధాన్యత ఇచ్చేలా నిబంధనలు పాటించాలని పిలుపునిచ్చారు.

English summary

AI: టెస్లా AI సాంకేతికతపై ఆపిల్ కో ఫౌండర్ విమర్శలు.. మస్క్ మాటతప్పాడంటూ ఆరోపణలు | Apple co-founder Steve Wozniak allegations on Tesla AI technology

Apple co-founder Steve Wozniak allegations on Tesla AI technology
Story first published: Friday, May 12, 2023, 13:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X