For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నష్టాల్లో దిగ్గజ జీన్స్ కంపెనీలు, భారీగా తగ్గిన ఆదాయం, ఎందుకంటే?

|

కరోనా మహమ్మారి లాక్ డౌన్ సమయంలో చాలామంది పురానీ జీన్స్‌కు గుడ్‌బై చెప్పే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఎక్కువమంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. దీంతో కంపొర్టబుల్‌గా భావించే పంచెలు, షార్ట్స్ ధరించేందుకు మొగ్గు చూపుతున్నారు. జీన్ పాయింట్స్ వార్డ్‌రోబ్ ఎసెన్షియల్ లేదా కంపొర్ట్‌వేర్ అనే అభిప్రాయం నుండి చాలామంది బయటపడ్డారని తెలిపారు. కరోనా మహమ్మారి వివిధ రంగాలపై భారీ ప్రభావం పడింది. ఇందులో భాగంగా దుస్తుల సేల్స్ కూడా దెబ్బతిన్నాయి.

20 ఏళ్లలో తొలిసారి దారుణంగా కుప్పకూలిన ఆ దేశ ఆర్థిక వ్యవస్థ20 ఏళ్లలో తొలిసారి దారుణంగా కుప్పకూలిన ఆ దేశ ఆర్థిక వ్యవస్థ

పడిపోయిన జీన్స్ సేల్స్.. ఆదాయం సగానికి పైగా డౌన్

పడిపోయిన జీన్స్ సేల్స్.. ఆదాయం సగానికి పైగా డౌన్

ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో లాక్‌డౌన్ ప్రకటించడంతో డెనిమ్ అమ్మకాలు పెద్దమొత్తంలో క్షీణించాయి. చాలామంది అమెరికన్ డెనిమ్ మేకర్స్ ఏప్రిల్ నుండి పలు దివాలా పిటిషన్లు దాఖలు చేశారు. లెవీస్ సేల్స్ ప్రపంచవ్యాప్తంగా భారీగా పడిపోవడంతో ఆదాయం 62 శాతం మేర క్షీణించింది. వర్క్ ఫోర్స్‌లో దాదాపు సగం మందిని తొలగించింది. కరోనాకు ముందే చాలామంది కంపోర్టబుల్ వేర్స్ కోసం అథ్లీజర్ వైపు మొగ్గు చూపడంతో డెనిమ్ అమ్మకాలు తగ్గడం ప్రారంభమైంది. కరోనాతో ఆ దెబ్బ మరింతగా పడింది.

జీన్స్ సేల్స్ డౌన్

జీన్స్ సేల్స్ డౌన్

జీన్స్ సేల్స్ ఇంతగా పడిపోవడానికి ప్రధాన కారణం వర్క్ ఫ్రమ్ హోమ్ పెరగడం. పైజామాలు, వదులుగా ఉండే టీ-షర్ట్స్ వంటివి ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అసలే ఇంటి నుండి పని.. అలాంటి సమయంలో బిగుతుగా ఉండే జీన్స్ ధరించే బదులు కంపోర్టబుల్‌గా ఉండే దుస్తులు ధరించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం దుకాణాల్లో జీన్స్ అల్మారాల్లో, ర్యాకుల్లో మిగిలిపోతున్నాయట.

జీన్స్.. యూత్ వేర్

జీన్స్.. యూత్ వేర్

శ్రామిక వర్గం మొదలు వైట్ కాలర్ ఉద్యోగుల వరకు డెనిమ్ సహా వివిధ కంపెనీ జీన్స్ కొనుగోలుకు ఆసక్తి కనబరిచేవారు. ఇది ఎప్పటి నుండో కొనసాగుతోంది. వివిధ కారణాలకు తోడు అద్భుతమైన ప్రకటనలు కూడా తోడు కావడంతో జీన్స్ ప్యాంట్స్ యూత్ వేర్‌గా మారిపోయింది. జీన్స్ వేశారంటే కాస్త యవ్వనంగా కనిపిస్తారు. కొంతమంది టీనేజర్స్ పాతకాలపు జీన్స్ పట్ల కూడా మక్కువ చూపిస్తారు.

అల్మారాల్లోనే జీన్స్.. కొనుగోలుకు ఆసక్తి లేని వినియోగదారులు

అల్మారాల్లోనే జీన్స్.. కొనుగోలుకు ఆసక్తి లేని వినియోగదారులు

ప్రముఖ కంపెనీలు వివిధ కోణాల్లో తమ తమ జీన్స్ సేల్స్ కోసం ప్రకటనలు ఇస్తాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అప్పటికే తమ తమ అల్మారాల్లోని జీన్స్ ప్యాంట్స్ వేసుకోలేని పరిస్థితి. కాబట్టి కస్టమర్లు మరిన్ని దుస్తులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. చాలా వరకు జీన్స్ వాటర్ ఇంటెన్సివ్ గార్మెంట్. ఒక జత ఉత్పత్తి కోసం పదివేల లీటర్ల నీటిని వినియోగించాల్సి ఉంది. అంతేకాదు, వీటిలో టాక్సిక్ కెమికల్స్ ఉపయోగిస్తారు. మరో విషయం ఏమంటే మీరు కొనుగోలు చేసే ఖరీదైన జీన్స్ ధర.. వీటిని ఉత్పత్తి చేసే ఓ కార్మికుడి వేతనం కంటే ఎక్కువగా ఉంటుందట.

English summary

నష్టాల్లో దిగ్గజ జీన్స్ కంపెనీలు, భారీగా తగ్గిన ఆదాయం, ఎందుకంటే? | Apparel sales have been hit worldwide during the coronavirus crisis

Lockdown has helped many say goodbye to purani jeans. People have finally been dissuaded out of the delusion that jeans are a wardrobe essential or comfort wear.
Story first published: Sunday, August 16, 2020, 14:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X