For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Anand Mahindra: బిగ్ బుల్ పై మహీంద్రా ట్వీట్.. ఈ లాభదాయకమైన పెట్టుబడి చిట్కా పాటించాలంటూ..

|

Anand Mahindra: దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. సమాజంలోని అనేక విషయాలపై ఆయన స్పందిస్తూ ఉంటారు. అదే విధంగా సోషల్ మీడియా ద్వారా చాలా మందికి సహాయం చేస్తుంటారు. అయితే ప్రస్తుతం ఆయన స్టాక్ మార్కెట్ బిగ్ బుల్ రాకేష్ జున్‌జున్‌వాలాపై తాజాగా ఒక పోస్ట్ చేశారు. సండే థాట్స్ అనే ట్యాగ్ పేరుతో ట్వీట్ పోస్ట్ చేశారు.

రాకేష్ జున్ జున్‌వాలా..

రాకేష్ జున్ జున్‌వాలా..

సంపద సృష్టి గురించి రాకేష్ జున్ జున్‌వాలా తరచుగా మాట్లాడుతుంటారు. స్టాక్ మార్కెట్ లోకి కొత్తగా అడుగుపెట్టినవారు, నిపుణులు, స్టాక్ మార్కెట్ పెట్టుబడి గురించి తెలుసుకోవాలనుకునే వారు తప్పకుండా బిగ్ బుల్ ను అనుసరిస్తుంటారు. రిటైల్ ఇన్వెస్టర్ల హృదయాల్లో ఆయన పట్ల భిన్నమైన గౌరవం నెలకొంది. ఇప్పుడు ఆనంద్ మహీంద్రా ఇంటర్నెట్‌లో చాలా ఇష్టపడే రాకేష్ జున్‌జున్‌వాలా అతిపెద్ద పెట్టుబడి చిట్కాలను ప్రస్తావించారు. భారత్‌పై నమ్మకం ఉంటే స్టాక్‌ మార్కెట్‌లో ఎక్కువ కాలం ఉంటారని ఆయన ఎప్పుడూ చెబుతుండేవారు.

ఆనంద్ మహీంద్రా:

మహీంద్రా తన ట్వీట్‌లో ఒక పేపర్ కటింగ్‌ను పంచుకున్నారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దానిలో సారాంశం ప్రకారం బిగ్ బుల్ జీవిత చివరి దశలో.. రాకేష్ జున్‌జున్‌వాలా అత్యంత విలువైన, లాభదాయకమైన పెట్టుబడి చిట్కాలను అందించారు. ఇది కోట్ల సలహా అని, ఇందులో డబ్బు కాదు సమయాన్ని వెచ్చించాలన్నారు. ఇప్పటివరకు ఈ ట్వీట్‌కి దాదాపు 1700 రీట్వీట్లు, 7700 లైక్‌లు వచ్చాయి.

45 వేల కోట్ల యజమాని..

45 వేల కోట్ల యజమాని..

రాకేష్ జున్‌జున్‌వాలా ఒక వార్తాపత్రికతో మాట్లాడుతూ.. ఆరోగ్యంపై తాను చెత్త పెట్టుబడి పెట్టానన్నారు. ప్రజలు ఆరోగ్యంపై అత్యధికంగా పెట్టుబడి పెట్టాలని ఆయన చెప్పేందుకు ప్రయత్నించారు. 45 వేల కోట్ల యజమాని అయినప్పటికీ ఆరోగ్యం విషయంలో సంతోషంగా లేరన్నారు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ సంపదను సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఈ ప్రయత్నంలో ఆరోగ్యంపై దృష్టి పెట్టడం లేదని అన్నారు. సంపాదించిన తరువాత దానిని అనుభవించటానికి హెల్త్ చాలా కీలకమైనదని పేర్కొన్నారు.

 స్టాక్ మార్కెట్ పై నమ్మకం..

స్టాక్ మార్కెట్ పై నమ్మకం..

స్టాక్ మార్కెట్ గురించి జున్‌జున్‌వాలా దృఢమైన నమ్మకం "భారతదేశంపై నమ్మకం" నుంచి వచ్చింది. ఆయన ఎల్లప్పుడూ భారత మార్కెట్లపై బుల్లిష్ గానే ఉండేవారు. మరణానికి కొద్ది రోజుల కిందట కూడా రానున్న కాలంలో పెరుగుతాయని కానీ అది మెల్లగా ఉంటుందని వెల్లడించారు. స్టాక్ మార్కెట్లు పెట్టుబడిదారుని సహనాన్ని పరీక్షించినప్పటీ.. వారి విశ్వాసం గొరవించబడుతుందని జున్‌జున్‌వాలా చెప్పేవారు. పెట్టుబడి పెట్టేముందు 20 సార్లు.. దానిని అమ్మే ముందు 50 సార్లు ఆలోచించుకోవాలని బిగ్ బుల్ చెబుతుండేవారు. ఏది కొంటున్నారు.. దానిని ముందుగా అమ్మేయటం వల్ల కలిగే నష్టం గురించి తప్పక తెలుసుకోవాలని ఆయన చెబుతుండేవారు.

English summary

Anand Mahindra: బిగ్ బుల్ పై మహీంద్రా ట్వీట్.. ఈ లాభదాయకమైన పెట్టుబడి చిట్కా పాటించాలంటూ.. | anand mahindra praised rakesh jhunjhunwala over health investment comments in twitter going viral

business tycoon anand mahindra praised rakesh jhunjhunwala going viral in twitter
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X