For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మరింతకాలం ఇంతే.. కొనుగోలు చేయవచ్చా: ముందుగానే రూ.50,000 బంగారం ధరలు!

|

భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక సంక్షోభం వంటి సందర్భాలలో బంగారం సురక్షిత పెట్టుబడిగా భావిస్తూ ఇన్వెస్టర్లు అటువైపు చూస్తారు. కరోనా - లాక్ డౌన్ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్, చమురు కంటే పసిడిపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపించారు. దేశంలో, ప్రపంచవ్యాప్తంగాఇప్పుడిప్పుడే లాక్ డౌన్ సడలింపులు కొనసాగుతూ, ఆర్థిక వ్యవస్థలు తెరుచుకుంటున్నాయి.

భారీగా తగ్గిన బంగారం ధర, అక్కడ జపాన్ ప్యాకేజీ ఎఫెక్ట్! ఇప్పుడు కొనుగోలు చేయవచ్చా?భారీగా తగ్గిన బంగారం ధర, అక్కడ జపాన్ ప్యాకేజీ ఎఫెక్ట్! ఇప్పుడు కొనుగోలు చేయవచ్చా?

ఐనా మరింతకాలం బంగారంపై ఒత్తిడి

ఐనా మరింతకాలం బంగారంపై ఒత్తిడి

ఆర్థిక వ్యవస్థలు తెరుచుకుంటున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ వైపు కూడా చూస్తారు. ఇది బంగారం ధరలపై ప్రభావం చూపించవచ్చు. అయితే ఆర్థిక వ్యవస్థలు తెరుచుకొని, మార్కెట్ పుంజుకున్నప్పటికీ సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడికి అప్పుడే డిమాండ్ తగ్గకపోవచ్చు. బంగారంపై ఒత్తిడి మరికొంతకాలం ఉండే అవకాశముంది.

ఎంసీఎక్స్‌లో రూ.50,000

ఎంసీఎక్స్‌లో రూ.50,000

ఎంసీఎక్స్‌లో బంగారం ధర సమీప భవిష్యత్తులో రూ.50,000 చేరుకోవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. నిన్న జూన్ 1వ తేదీన (సోమవారం) ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం రూ.47,300 పలికింది. ఆ తర్వాత రూ.47,083కు దిగి వచ్చింది.

బంగారంపై వీటి ప్రభావం

బంగారంపై వీటి ప్రభావం

కరోనా కారణంగా కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థలు పుంజుకోవడం కోసం ప్రపంచ దేశాలు పెద్ద ఎత్తున ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తున్నాయి. దీంతో మార్కెట్లు పుంజుకోవడంతో పాటు, డిమాండ్ పెరిగే అవకాశముంది. కేంద్ర బ్యాంకులు వ్యవస్థలోకి నగదును ఇన్ఫ్యూజ్ చేస్తున్నాయి. బంగారంపై ఈ ప్రభావం ఉంటుంది.

హాంగ్‌కాంగ్ అంశానికి సంబంధించి చైనా భద్రతా చట్టం బంగారం డిమాండ్‌కు అనుకూలంగా ఉంది. అమెరికా - చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇది బంగారానికి ఊతమిచ్చే అవకాశముంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు రిస్క్ అసెట్స్ విషయంలో జాగ్రత్తగా ఉంటారు.

బంగారంపై పెట్టుబడులు పెట్టవచ్చు

బంగారంపై పెట్టుబడులు పెట్టవచ్చు

ఓ వైపు కరోనా మహమ్మారి భయాలు కొనసాగుతుండగా, మరోవైపు అంతర్జాతీయ భౌగోళిక పరిస్థితులు ఉద్రిక్తతకు దారి తీస్తుండగా, మరోవైపు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికాలో జాతి వివక్ష ఆందోళనలు చెలరేగుతున్నాయి. బంగారం వంటి లోహాలపై మార్చి నుండి 20 రిటర్న్స్ వచ్చాయి. మరికొంతకాలం బంగారానికి డిమాండ్ ఉండవచ్చు. ఇన్వెస్టర్లు తమ మిగతా పెట్టుబడులు కూడా బంగారంపై పెట్టవచ్చునని చెబుతున్నారు.

English summary

మరింతకాలం ఇంతే.. కొనుగోలు చేయవచ్చా: ముందుగానే రూ.50,000 బంగారం ధరలు! | Analysis: Gold Prices To Scale To Rs.50,000/10 Gm Sooner Than Expected

At a time when gold as a safe haven has gained traction owing to a geo-political and financial crisis, the appeal of the safe haven is likely to remain up for sometime even as the economies are opening up and risk-on sentiment improves.
Story first published: Tuesday, June 2, 2020, 11:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X