For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రిలయన్స్-ఫ్యూచర్ గ్రూప్ డీల్: అమెజాన్‌కు తాత్కాలిక ఊరట

|

ఫ్యూచర్ గ్రూప్-రిలయన్స్ డీల్‌లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ బిజినెస్ వ్యాపారాన్ని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్(RRVL)కు రూ.24,713 కోట్లకు విక్రయించడంపై అమెజాన్ ఆర్బిట్రేషన్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఇక్కడ అమెజాన్‌కు ఊరట లభించింది. సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ సానుకూలంగా స్పందించింది. ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అమెజాన్‌కు తాత్కాలిక ఊరట లభించింది. ఆర్బిట్రేషన్ మధ్యంతర ఉత్తర్వులను స్వాగతిస్తున్నామని అమెజాన్ ప్రతినిధి అన్నారు.

రిలయన్స్‌తో వద్దు.. మేం తీసుకు వస్తాం: 'ఫ్యూచర్'కు అమెజాన్ బంపరాఫర్!రిలయన్స్‌తో వద్దు.. మేం తీసుకు వస్తాం: 'ఫ్యూచర్'కు అమెజాన్ బంపరాఫర్!

న్యాయ సలహా ప్రకారం..

న్యాయ సలహా ప్రకారం..

సరైన న్యాయసలహా ప్రకారం ఫ్యూచర్ రిటైల్‌కు చెందిన వ్యాపారాలను

RRVL సొంతం చేసుకునే దిశగా ముందుకు సాగిందని, భారతీయ చట్టాల ప్రకారం అమలు జరుగుతుందని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ ఓ ప్రకటనలో తెలిపింది. RRVL ఒప్పందం మేరకు నడుచుకుంటుందని, ఈ డీల్‌కు సంబంధించి పూర్తి ట్రాన్సాక్షన్స్ పూర్తి చేయాలని భావిస్తోందని, ఫ్యూచర్ గ్రూప్‌తో ఒప్పందం ఆలస్యం చేయకుండా పూర్తి చేసుకుంటామని RRVL తెలిపింది.

అందుకే ఆఫర్

అందుకే ఆఫర్

RRVLతో రూ.24,700 కోట్ల ఒప్పందాన్ని విరమించుకుంటే మరో బలమైన,స్థిరమైన పెట్టుబడిదారుని తీసుకురావడంలో ఫ్యూచర్ గ్రూప్‌కు సహకరిస్తామని అమెజాన్ ఇండియా ఇటీవల తెలిపిన విషయం తెలిసిందే. రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌తో రూ.24,700 కోట్ల ఒప్పందాన్ని రద్దుచేసుకుంటే కొత్త భాగస్వామిని తీసుకువస్తామని లేదా పెట్టుబడి సంస్థలను తీసుకువస్తామని ఫ్యూచర్ గ్రూప్‌కు అమెజాన్ ఆఫర్ చేసింది. ఫ్యూచర్ కూపన్స్ ప్రయివేట్ లిమిటెడ‌లో అమెజాన్‌కు 49 శాతం వాటా ఉంది. 2019లో దాదాపు రూ.1430 కోట్లను దీనిని కొనుగోలు చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్-ఫ్యూచర్ గ్రూప్ మధ్య కుదిరిన ఒప్పందం వల్ల భారత్‌లో తమకు పోటీ మరింత ఎక్కువ అవుతుందనే భావన అమెజాన్‌లో ఉందని భావిస్తున్నారు. అందుకే ఫ్యూచర్ గ్రూప్‌ను ఆదుకునేందుకు అమెజాన్ ఆసక్తి చూపిస్తోందని అభిప్రాయపడుతున్నారు.

ఆర్బిట్రేషన్.. తాత్కాలిక ఊరట

ఆర్బిట్రేషన్.. తాత్కాలిక ఊరట

కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్ రుణ సంక్షోభంలో చిక్కుకోవడంతో రిలయన్స్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. కానీ రిలయన్స్-ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందానికి అమెజాన్ ద్వారా చిక్కులు వచ్చాయి.

రిలయన్స్ ఇండస్ట్రీస్-ఫ్యూచర్ గ్రూప్ డీల్‌ను ఆర్బిట్రేషన్‌కు లాగింది అమెజాన్. ఫ్యూచర్ గ్రూప్‌తో తమతో కుదుర్చుకున్న ఒప్పందానికి రిలయన్స్-ఫ్యూచర్ గ్రూప్ డీల్ విరుద్ధమని సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్‌ను(SIAC) ఆశ్రయించింది. నిబంధనల ఉల్లంఘనకుగాను ఫ్యూచర్ గ్రూప్‌లో భాగమైన ఫ్యూచర్ కూపన్స్‌కు లీగల్ నోటీసులు పంపించింది. ఈ డీల్‌ను నిలుపుదల చేయాలని కోరింది. దీంతో అమెజాన్‌కు తాత్కాలిక ఊరట లభించింది.

English summary

రిలయన్స్-ఫ్యూచర్ గ్రూప్ డీల్: అమెజాన్‌కు తాత్కాలిక ఊరట | Amazon wins interim relief, Future-Reliance deal put on hold

Amazon.com has won an interim order against partner Future Group selling its retail business to Reliance Industries (RIL) for Rs 24,713. The order, passed in a Singapore-based arbitration panel on October 25, effectively puts a pause to the Future-RIL deal.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X