For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్రంప్ మద్దతుదారులకు అమెజాన్, ఆపిల్, గూగుల్ భారీ షాక్: ఎందుకంటే..

|

పార్లెర్ యాప్‌కు టెక్ దిగ్గజాలు అమెజాన్, గూగుల్, ఆపిల్ షాకిచ్చాయి. దీనిని యాప్ స్టోర్ నుండి తొలగించాయి. పార్లెర్ ఆల్టర్నేటివ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం. ఈ మూడు సంస్థలు కూడా కేవలం 24 గంటల వ్యవధిలోనే పార్లెర్‌ను తొలగించాయి. ట్విట్టర్, ఫేస్‌బుక్‌లకు ప్రత్యామ్నాయంగా స్వేచ్ఛా ప్రసంగం (ఫ్రీ-స్పీచ్) కలిగిన పార్లెర్ ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

వింతగా ఉంది: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆశ్చర్యం! నెటిజన్ల చురకలు ఇలా..వింతగా ఉంది: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆశ్చర్యం! నెటిజన్ల చురకలు ఇలా..

హింసను ప్రేరేపించేలా.. అమెజాన్ లేఖ

హింసను ప్రేరేపించేలా.. అమెజాన్ లేఖ

అమెజాన్ తమ క్లౌండ్ హోస్టింగ్ సర్వీసెస్, అమెజాన్ వెబ్ సిరీస్ పార్లెర్‌ను ఆదివారం సాయంత్రం నుండి తొలగిస్తోంది. ప్రజల నుండి, అమెజాన్ ఉద్యోగుల నుండి తీవ్ర ఒత్తిడి రావడంతో దీనిని పక్కన పెట్టింది. ఆదివారం రాత్రి గం.11.59(పీఎం, పసిఫిక్ టైమ్) నుండి పార్లెర్ వెబ్ సైట్, యాప్‌ను తొలగించాలని నిర్ణయించామని అమెజాన్ తెలిపింది.

పార్లెర్ చీఫ్ పాలసీ ఆఫీసర్ అమీ పీకోఫ్‌కు శనివారం అమెజాన్ వెబ్ సర్వీసెస్ లేఖలు రాసింది. హింసను ప్రోత్సహించేలా పలు పోస్టులు గుర్తించినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి స్క్రీన్ షాట్స్ ఉదాహరణగా పంపించారు.

అంతలోనే పార్లెర్‌కు షాక్

అంతలోనే పార్లెర్‌కు షాక్

పార్లెర్ ప్రత్యామ్నాయ సోషల్ నెట్ వర్కింగ్ యాప్‌గా పేరుగాంచింది. దీనిని ఎక్కువగా అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు వినియోగిస్తారని అంటారు. అమెరికా కాపిటోల్ అశాంతిలో పాల్గొన్నవారితో సహా దీనిని చాలామంది ఉపయోగిస్తారు.

గత కొద్ది నెలలుగా వేగంగా యూజర్లను ఆకట్టుకుంటున్న యాప్‌లలో పార్లెర్ ఉంది. లక్షలాదిమంది ట్రంప్ మద్దతుదారులు పార్లెర్ వైపు మరలారు.

శనివారం వరకు ఆపిల్ తన ఐఫోన్ వినియోగదారుల కోసం పార్లెర్‌ను నెంబర్ వన్ ఫఅరీ యాప్ జాబితాలో ఉంచింది. ఇప్పుడు తొలగిస్తోంది. కానీ ఇప్పుడు శనివారం రాత్రికి పార్లెర్‌కు షాకిచ్చారు.

పోటీదారులను చంపేయాలని

పోటీదారులను చంపేయాలని

తొలుత ఆపిల్, గూగుల్ దీనిని తమ యాప్ స్టోర్స్ నుండి తొలగించాయి. అమెజాన్ కూడా అదే బాటలో నడుస్తోంది. తమ యాప్ తొలగింపు అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌ను పూర్తిగా అడ్డుకున్నట్లే అని పార్లెర్ సీఈవో అన్నారు. బిగ్ టెక్ కంపెనీలు తమ పోటీదారులను చంపాలని చూస్తున్నాయని వ్యాఖ్యానించారు.

English summary

ట్రంప్ మద్దతుదారులకు అమెజాన్, ఆపిల్, గూగుల్ భారీ షాక్: ఎందుకంటే.. | Amazon suspends hosting Parler on its servers over violent content

Apple suspended Parler from its App Store Saturday after the "unbiased social media" app surged to the No. 1 spot in the free apps section earlier in the day.
Story first published: Sunday, January 10, 2021, 12:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X