For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.1200తో ఫేక్ రివ్యూస్.. ఎలాగంటే: అమెజాన్‌కు, కస్టమర్లకు భలే బురిడీ!

|

లండన్: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సహా వివిధ ఆన్‌లైన్ సంస్థల నుంచి ఎవరైనా ఏమైనా వస్తువు కొనుగోలు చేయాలంటే మొదట చూసేది రివ్యూ. ఎక్కువ మంది రివ్యూ ఆధారంగా కొనుగోలు చేస్తారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సంస్థల్లోను ఎక్కువ మంది వీటికి ఎంతో ప్రాధాన్యత ఉంది. రివ్యూ ఆధారంగా ఓ వస్తువును లేదా ఓ బ్రాండు ఐటంను కొనాలో వద్దో నిర్ణయించుకుంటారు. అయితే అమెజాన్‌లో కొంతమంది బయ్యర్స్ రివ్యూల కోసం తప్పుడు మార్గాలు అనుసరిస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.

జియో హ్యాపీ న్యూఇయర్ ఆఫర్: రూ.2,020తోనే ఏడాది పాటు బెనిఫిట్స్జియో హ్యాపీ న్యూఇయర్ ఆఫర్: రూ.2,020తోనే ఏడాది పాటు బెనిఫిట్స్

నకిలీ రివ్యూలకు రూ.1200

నకిలీ రివ్యూలకు రూ.1200

కొంతమంది బయ్యర్స్ తప్పుడు మార్గాలు అనుసరిస్తున్న విషయం గుర్తించిన అమెజాన్ దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. అయినప్పటికీ ఇది కొనసాగుతోంది. నకిలీ రివ్యూల కోసం కొందరు బయ్యర్స్ దాదాపు 15 యూరోలు అంటే మన కరెన్సీలో రూ.1200 వరకు చెల్లిస్తున్నారని ఇంగ్లీష్ పత్రిక డెయిలీ మెయిల్ విచారణలో తేలింది.

అమెజాన్‌ను ఇలా తెలివిగా బురిడీ కొట్టిస్తున్నారు

అమెజాన్‌ను ఇలా తెలివిగా బురిడీ కొట్టిస్తున్నారు

రివ్యూల ఆధారంగా సేల్స్ పెరుగుతుండటంతో బయ్యర్స్ ఈ వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ఇందుకోసం కొన్ని సంస్థలు టెస్టర్స్‌ను లేదా పరిశీలకులను కూడా ఏర్పాటు చేసుకున్నాయి. వారు అమెజాన్ ద్వారా ఆయా సంస్థల వస్తువులు కొనుగోలు చేసి వాటికి 4 స్టార్, 5 స్టార్ రేటింగ్ ఇస్తారు. ఇలా చేసినందుకు గాను ఆ సంస్థలు వారికి ఆ వస్తువును కొనుగోలు చేసిన ధరను చెల్లించడంతో పాటు చిన్న మొత్తంలో ఫీజు కూడా ఇస్తాయి. అయితే టెస్టర్స్ కొనుగోలు చేసి మరీ రివ్యూలో ఇవ్వడంతో అమెజాన్ వాటిని వెరిఫైడ్ పర్చేజెస్ కేటగిరీలోనే చూపిస్తోంది.

అమెజాన్ ఏం చెప్పిందంటే

అమెజాన్ ఏం చెప్పిందంటే

జర్మనీకి చెందిన ఓ కంపెనీకి ఒక్క యూకేలోనే 3000 మంది పరిశీలకులు ఉన్నారట. యూరోప్ వ్యాప్తంగా 60వేల మంది వరకు ఉండొచ్చునని అంచనా.

దీనిపై అమెజాన్ కూడా స్పందించింది. రివ్యూలపై కస్టమర్లకు ఉన్న విశ్వసనీయతను కాపాడేందుకు తాము కట్టుబడి ఉన్నామని, ఇందుకు గత ఏడాది 300 మిలియన్ ఫౌండ్లు వెచ్చించినట్లు తెలిపింది.

English summary

రూ.1200తో ఫేక్ రివ్యూస్.. ఎలాగంటే: అమెజాన్‌కు, కస్టమర్లకు భలే బురిడీ! | Amazon sellers are buying fake reviews for ₹1,200 each

Despite a crackdown by Amazon, sellers on the platform are continuing to purchase fake reviews for around 15 euro each (about Rs 1,200), according to a Daily Mail investigation.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X