For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పండుగ సమయంలో ఉద్యోగులకు అమెజాన్ ప్రత్యేక గుర్తింపు బోనస్

|

భారత్‌లోని తమ ఉద్యోగులకు అమెజాన్ ఇండియా బంపరాఫర్ ఇచ్చింది. ప్రత్యేక గుర్తింపు బోనస్‌ను ఇవ్వనున్నట్లు సోమవారం ప్రకటించింది. ఈ బోనస్ రూ.6,300 వరకు అందించనుంది. ఇతర దేశాల్లోని ఉద్యోగులకు కూడా ఇదే విధంగా బోనస్‌లు ఇస్తోంది. అక్టోబర్ 16వ తేదీ నుండి నవంబర్ 13వ తేదీ మధ్య ఉద్యోగంలో చేరినవారిలో ఫుల్‌టైమ్ ఉద్యోగులకు రూ.6,300 బోనస్, పార్ట్‌టైమ్ ఉద్యోగులకు రూ.3,150 బోనస్ ఇస్తున్నట్లు తెలిపింది.

FY20 ITR forms: ఐటీఆర్ ఫామ్‌లో ఈ ఏడాది కీలక మార్పులు.. ఇవీFY20 ITR forms: ఐటీఆర్ ఫామ్‌లో ఈ ఏడాది కీలక మార్పులు.. ఇవీ

పండుగ సమయంలో గుర్తింపు బోనస్

పండుగ సమయంలో గుర్తింపు బోనస్

అమెజాన్ వరల్డ్ వైడ్ ఆపరేషన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దేవ్ క్లార్క్ మాట్లాడుతూ.. అక్టోబర్ 16-నవంబర్ 13 మధ్య చేరిన భారత ఉద్యోగులకు పై బోనస్ ఇస్తున్నట్లు తెలిపారు. తమ ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారని, అందుకు వారికి కృతజ్ఞతలు చెబుతున్నామని, భారత్‌లో పండుగ సీజన్ సమయంలో ఉద్యోగులకు ప్రత్యేక గుర్తింపు బోనస్ ద్వారా ప్రశంసలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఇది500 మిలియన్ డాలర్లు అవుతుందని చెప్పారు.

బోనస్ కోసం ఎంతంటే

బోనస్ కోసం ఎంతంటే

హాలీడే పే ఇంటెన్సివ్స్‌తో కలిసి ఈ త్రైమాసికంలోనే తమ ఫ్రంట్-లైన్ ఉద్యోగులకు 750 మిలియన్ డాలర్ల అదనపు మొత్తాన్ని ఖర్చు చేస్తోందని క్లార్క్ తెలిపారు. తద్వారా 2020లో స్పెషల్ బోనస్, ఇన్సెంటివ్స్ కోసం ప్రపంచవ్యాప్తంగా 2.5 బిలియన్ డాలర్లు అవుతుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో 500 మిలియన్ డాలర్ల థ్యాంక్యూ బోనస్ కూడా ఇచ్చింది. కస్టమర్ల అవసరాన్ని గుర్తించడంలో మా ఉద్యోగులు అద్భుతమైన పనితీరును కనబరుస్తున్నారన్నారు.

మేక్ అమెజాన్ పే..

మేక్ అమెజాన్ పే..

కాగా, మేక్ అమెజాన్ పే నిరసనల నేపథ్యంలో అమెజాన్ ఈ బోనస్‌లను ప్రకటించడం గమనార్హం. కరోనా సమయంలో ఈ-కామర్స్ దిగ్గజం భారీ లాభాలను ఆర్జించిందని చెబుతున్నారు. అమెజాన్ గత ఏడాది కాలంలో 960 బిలియన్ డాలర్ల మేర ఆర్జించిందని, కానీ ట్యాక్సుల రూపంలో 3.4 బిలియన్ డాలర్లు మాత్రమే చెల్లించిందని అంటారు. ఇదే సమయంలో వేర్ హౌస్ కార్మికులు పని-వేతనాల పట్ల అసంతృప్తితో ఉన్నారు.

English summary

పండుగ సమయంలో ఉద్యోగులకు అమెజాన్ ప్రత్యేక గుర్తింపు బోనస్ | Amazon India offers special recognition bonus to employees

Amazon India on Monday said it will offer a "special recognition bonus" to its employees in the country. The decision comes in line with similar payouts being made to staff in other countries.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X