For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Amazon: భారతీయ ఉద్యోగులను టార్గెట్ చేసిన అమెజాన్.. మరీ ఇంత నిర్దాక్షిణ్యమా..

|

Amazon: మాంద్యం వచ్చింది అమెరికాలో అయితే ఉద్యోగాలు మాత్రం ఇండియాలో పోతున్నాయి. ఇదెక్కడి మాయ అని ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నారు. అవును అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం అమెజాన్ ఇప్పుడు ఇదే గేమ్ ఆడుతోంది. భారత చట్టాల కారణంగా సరికొత్త వ్యూహాన్ని అవలంభిస్తూ ఉద్యోగులను తొలగించేందుకు ప్లాన్ రెడీ చేసుకుంది.

భారతదేశంలో ఇలా..

భారతదేశంలో ఇలా..

ప్రపంచ ప్రఖ్యాత టెక్, ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఖర్చుల మదింపు చర్యల్లో భాగంగా మన దేశంలోనూ లేఆఫ్ డ్రైవ్‌ను ప్రారంభించింది. మాంద్యం సీజన్ కారణంగా టెక్ కంపెనీలు ఇష్టమెుచ్చినట్లు ఉద్యోగులను పీకేస్తున్న తరుణంలో అమెజాన్ మాత్రం తన ఉద్యోగులను గౌరవంగా తొలగించాలని నిర్ణయించింది.

సరికొత్త ప్రపోజల్..

సరికొత్త ప్రపోజల్..

తొలగింపులు అనివార్యమైన ప్రస్తుత తరుణంలో భారతీయ ఉద్యోగులకు వాలంటరీ సెపరేషన్ ప్రోగ్రామ్ (VSP)ని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయితే దీనిని ఎవరు ఎంచుకోవాలనే విషయంలో ఉద్యోగులకు వ్యక్తిగతంగా ఈ-మెయిల్ పంపింది. L1 నుంచి L7 స్థాయిలోని భారతీయ అమెజాన్ ఉద్యోగులకు ఈ స్కీమ్ వర్తిస్తోంది.

చివరి గడువు..

చివరి గడువు..

అమెజాన్ ఇండియా ప్రవేశపెట్టిన వీఆర్ఎస్ కింద ఉద్యోగులు తమ రాజీనామాలను నవంబర్ 30 ఉదయం 6.30 గంటలలోపు అందించాల్సి ఉంది. అలాంటి వారికి కొన్ని ప్రయోజనాలను సైతం కంపెనీ అందిస్తోంది. అయితే ఈ స్కీమ్ పీఐపీ కింద ఉద్యోగులకు మాత్రం వర్తించదని కంపెనీ స్పష్టం చేసింది. వారిని కంపెనీ నేరుగా తొలగిస్తుంది.

ప్రయోజనాలు ఇవే..

ప్రయోజనాలు ఇవే..

వాలెంటరీ సెపరేషన్ స్కీమ్ ఎంచుకున్న వారికి 22 వారాల బేసిక్ జీతం + ప్రతి 6 నెలల సర్వీస్‌కి 1 వారం బేసిక్ జీతాన్ని కంపెనీ చెల్లిస్తోంది. దీనికి తోడు 6 నెలల మెడికల్ ఇన్సూరెన్స్ కవరేజ్ అందిస్తోంది. అయితే ఈ స్కీమ్ కింద తొగించబడ్డవారు చట్టపరంగా కోర్టులో సవాలు చేయటం కుదరదు. అందుకే అమెజాన్ ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

English summary

Amazon: భారతీయ ఉద్యోగులను టార్గెట్ చేసిన అమెజాన్.. మరీ ఇంత నిర్దాక్షిణ్యమా.. | amazon implementing voluntary separation program to cut indian employees

amazon implementing voluntary separation program to cut indian employees..
Story first published: Thursday, November 24, 2022, 9:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X