For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

110 గంటల్లో 75 కి.మీ అమరావతి రోడ్డు నిర్మాణం: గిన్నిస్ బుక్‌లో చోటు

|

ముంబై: జాతీయ రహదారుల సంస్థ సరికొత్తగా ఓ ప్రపంచ రికార్డును నెలకొల్పింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. 75 కిలోమీటర్ల పొడవు ఉన్న జాతీయ రహదారి స్ట్రెచ్‌ను అతి తక్కువ సమయంలో నిర్మించినందుకు- ఈ ఘనతను సాధించింది నేషనల్ హైవే అథారిటీ. గిన్నిస్ బుక్‌లో చోటు లభించడం పట్ల జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హర్షం వ్యక్తం చేశారు. అధికారులను అభినందించారు.

మహారాష్ట్రలోని అమరావతి నుంచి అకోలా వరకు 75 కిలోమీటర్ల దూరం ఉన్న జాతీయ రహదారి స్ట్రెచ్‌ను అధికారులు 110 గంటల్లో నిర్మించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డును అందుకోవాలనే లక్ష్యాన్ని పెట్టుకుని మరీ.. దీన్ని సాధించారు. దీనికోసం అధికారులు, ఉద్యోగులు, కార్మికులు, నిరంతరాయంగా శ్రమించారు. ఈ రోడ్డు నిర్మాణ ఈ నెల 3వ తేదీన ఉదయం 7 గంటలకు ఆరంభమయ్యాయి. 110 గంటల్లో పూర్తయ్యాయి.

Amaravati to Akola road: NHAI builds 75km road stretch of in record time, enters Guinness book

ఒక్కో భాగాన్ని స్ట్రెచ్‌ను రికార్డు సమయంలో నిర్మించడానికి హైవే అథారిటీ అధికారులు ప్రత్యేకంగా ఎక్స్‌పర్ట్ టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. ప్రాజెక్ట్​ మేనేజర్​, హైవే ఇంజినీర్​, క్వాలిటీ ఇంజినీర్​, సర్వేయర్​, సెఫ్టీ ఇంజినీర్​ మొదలుకుని గ్రౌండ్ స్టాఫ్, కార్మికుల వరకు 800 మందిని ఇందులో భాగస్వామ్యులను చేసింది. పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా వార్​ రూమ్​ను కూడా ఏర్పాటు చేశారు.

Amaravati to Akola road: NHAI builds 75km road stretch of in record time, enters Guinness book

హాట్​ మిక్సర్లు-4, బౌల్డర్స్-4​, ఒక మొబైల్​ ఫీడర్​, రోలర్​ వంటి రోడ్డు నిర్మాణ వాహనాలు, సామాన్లను అందుబాటులో ఉంచుకున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రోడ్డు నిర్మించారు. బిటుమినస్‌తో రోడ్డు నిర్మాణం పూర్తయింది. రాజ్​పథ్​ ఇన్​ఫ్రాకాన్​ ప్రైవేట్ లిమిటెడ్​ సంస్థ ఈ రోడ్డును నిర్మించింది. కాగా ఇదివరకు అతివేగంగా రోడ్డును నిర్మించిన రికార్డు ఖతర్ పేరు మీద ఉండేది.

Amaravati to Akola road: NHAI builds 75km road stretch of in record time, enters Guinness book

ఇప్పుడది తెరమరుగైంది. ఇదివరకు ఖతార్​లో 22 కిలోమీటర్ల రోడ్డును అత్యంత వేగంగా నిర్మించారు. ఆ రికార్డును అమరావతి-అకోలా రోడ్డు నిర్మాణం తుడిచి పెట్టేసింది. కాగా ఈ ఘనతను సాధించిన హైవే అధికారులకు నితిన్ గడ్కరీ అభినందనలు తెలిపారు. గిన్నిస్ బుక్ సర్టిఫికెట్, కొన్ని ఫొటోలను ఆయన తన అధికారిక మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

English summary

110 గంటల్లో 75 కి.మీ అమరావతి రోడ్డు నిర్మాణం: గిన్నిస్ బుక్‌లో చోటు | Amaravati to Akola road: NHAI builds 75km road stretch of in record time, enters Guinness book

NHAI get to Guinness World Record by building the longest highway length between Amravati and Akola in the shortest amount of time.
Story first published: Wednesday, June 8, 2022, 15:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X