For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత్ లో పెట్టుబడుల విషయంలో అలీబాబా గ్రూప్ వేచి చూసే ధోరణి ... ఇండియా.. చైనా టెన్షన్స్ ఎఫెక్ట్

|

చైనా-ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ భారతదేశంలో పెట్టుబడుల విషయంలో మరికొంత కాలం వేచి చూడాలని భావిస్తుంది . భారతదేశం-చైనా ఉద్రిక్తత కారణంగా కొంతకాలంగా భారతదేశంలో పెట్టుబడులు పెట్టడం పై పునరాలోచనలో ఉన్నట్టు సమాచారం. భారతదేశంలో చైనా పెట్టుబడులపై ఆంక్షలు , భద్రతా ఆరోపణల కారణంగా అలీబాబా గ్రూప్ రాబోయే ఆరు నెలల వరకు భారతీయ కంపెనీలలో పెట్టుబడులు పెట్టడానికి కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం లేదని తెలుస్తుంది.

వర్క్ ఫ్రమ్ హోం చేసింది చాలు ... ఆఫీసులకు రండి ... ఎక్కడంటే !!వర్క్ ఫ్రమ్ హోం చేసింది చాలు ... ఆఫీసులకు రండి ... ఎక్కడంటే !!

 ఇండియాలో పెట్టుబడుల విషయంలో అలీబాబా వెనకడుగు

ఇండియాలో పెట్టుబడుల విషయంలో అలీబాబా వెనకడుగు

ఈ విషయంలో అలీబాబా గ్రూప్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. చైనా సంస్థలపై, చైనా పెట్టుబడులపై భారత ప్రభుత్వం ఇండియా చైనా ఘ్రషణల నేపధ్యంలో కఠిన ఆంక్షలను విధిస్తోంది . బహుశా ఈ దృష్ట్యా, చైనా యొక్క ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అలీబాబా ప్రస్తుతానికి భారతదేశంలో తన పెట్టుబడి ప్రణాళికను నిలిపివేసింది. అలీబాబా గ్రూప్ యొక్క నిర్ణయం భారతదేశంలోని అలీబాబా పెట్టుబడులు పెట్టబోయే సంస్థలతో పాటు అనేక భారతీయ స్టార్టప్‌లను దిగ్భ్రాంతికి గురిచేస్తుంది .

ఇప్పటికే ఇండియాలో పెట్టుబడులు పెట్టిన అలీబాబా

ఇప్పటికే ఇండియాలో పెట్టుబడులు పెట్టిన అలీబాబా

ఇప్పటికే పేటీఎం, రెస్టారెంట్ అగ్రిగేటర్ మరియు ఫుడ్ డెలివరీ సర్వీస్ జోమాటో మరియు ఈ కిరాణా బిగ్ బాస్కెట్ లలో అలీబాబా పెట్టుబడులు ఉన్నాయి . అయితే, ఆ పెట్టుబడుల నుండి నిష్క్రమించే ఆలోచన లేదు కానీ కొత్త పెట్టుబడులు పెట్టటానికి మాత్రం పునరాలోచిస్తుంది . చైనా సంస్థ అలీబాబా మరియు దాని అనుబంధ సంస్థలైన అలీబాబా క్యాపిటల్ పార్ట్‌నర్స్ మరియు యాంట్ గ్రూప్ 2015 నుండి 2 బిలియన్ డాలర్లకు పైగా (సుమారు రూ .15,000 కోట్లు) భారతీయ కంపెనీలలో పెట్టుబడులు పెట్టాయి.

ఇండియాలో సుమారు రూ. 14,000 కోట్లు పెట్టుబడి పెట్టిన అలీబాబా

ఇండియాలో సుమారు రూ. 14,000 కోట్లు పెట్టుబడి పెట్టిన అలీబాబా

మార్కెట్ ఫైనాన్సింగ్‌ను పర్యవేక్షించే సంస్థ పిచ్‌బుక్ ప్రకారం, అలీబాబా గ్రూప్ భారతదేశంలో 81.8 బిలియన్ (సుమారు రూ. 14,000 కోట్లు) పెట్టుబడి పెట్టింది. ఇప్పుడు చైనా నుండి వస్తున్న పెట్టుబడులను ప్రభుత్వం కఠినతరం చేస్తున్న నేపధ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం .దేశంలోస్టార్టప్‌ పరిశ్రమలను స్థాపించాలని అలీబాబా కంపెనీ గతంలో భావించింది. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఆరు నెలల వరకు వేచిచూడాలని అలీబాబా సంస్థ భావిస్తోందని సమాచారం.

 ఇండియా చైనా సరిహద్దుల ఘర్షణ కారణంగా పునరాలోచన

ఇండియా చైనా సరిహద్దుల ఘర్షణ కారణంగా పునరాలోచన

ఇటీవల, ఇండియా చైనా దేశాల మధ్య లద్దాఖ్ లో సరిహద్దు వివాదంలో 20 మంది భారతీయ సైనికులు అమరవీరులయ్యారు. అప్పటి నుండి, చైనాపై వ్యతిరేకత మరియు చైనా వస్తువుల బహిష్కరణ ప్రచారం భారతదేశంలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. అందుకు తగ్గట్టే భారత ప్రభుత్వం కూడా చైనా విషయంలో సీరియస్ గా ఉంది. ఇంకా సరిహద్దు ఘర్షణ కొనసాగుతూ ఉండటం , ఎప్పుడు ఎలా ఉంటుందో అర్ధం కాని పరిస్థితుల్లో అలీబాబా కొత్త పెట్టుబడుల విషయంలో మరో ఆర్నెల్ల కాలం వేచి చూడాలని నిర్ణయం తీసుకుంది.

English summary

భారత్ లో పెట్టుబడుల విషయంలో అలీబాబా గ్రూప్ వేచి చూసే ధోరణి ... ఇండియా.. చైనా టెన్షన్స్ ఎఫెక్ట్ | Alibaba to Put Hold on Investments in India due to Amid India-China Tensions

China’s leading e-commerce company Alibaba Group has stopped investing in India for some time due to the India-China tension. According to a report in Reuters, due to the high-security investigation on Chinese investment in India, the Alibaba Group is unlikely to enter new deals for investment in Indian companies for the next six months. That is, the company will not make any new investment in India.
Story first published: Thursday, August 27, 2020, 21:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X