For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అక్షయ తృతీయకు అదిరిపోయే ఆఫర్లు: ఎస్బీఐ కార్డుపై క్యాష్‌బ్యాక్

|

ఈ నెల 26వ తేదీన అక్షయ తృతీయ సందర్భంగా బంగారం దుకాణదారులు అందరు కూడా ఆన్‌లైన్ అమ్మకానికి తెరలేపారు. కళ్యాణ్ జ్యువెల్లర్స్, తనిష్క్ జ్యువెల్లర్స్ ఇప్పటికే ఈ ప్రకటన చేశారు. జోయ్ అలుక్కాస్, మలబార్ గోల్డ్ కూడా ఆన్‌లైన్ అమ్మకాలను ప్రారంభించాయి. దేశవ్యాప్త లాక్ డౌన్ నేపథ్యంలో దుకాణాలు క్లోజ్ అయ్యాయి. అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలుకు చాలామంది ఆసక్తి చూపిస్తారు. ఈ నేపథ్యంలో బంగారం దుకాణదారులు ఆన్ లైన్ మార్గాన్ని ఎంచుకున్నారు.

అక్షయ తృతీయ: తనిష్క్, కళ్యాణ్ జ్యువెల్లర్స్ ఆన్‌లైన్ సేల్స్, డెలివరీ మాత్రం ఆ తర్వాతే!అక్షయ తృతీయ: తనిష్క్, కళ్యాణ్ జ్యువెల్లర్స్ ఆన్‌లైన్ సేల్స్, డెలివరీ మాత్రం ఆ తర్వాతే!

జోయ్ అలుక్కాస్ అదిరిపోయే ఆఫర్లు

జోయ్ అలుక్కాస్ అదిరిపోయే ఆఫర్లు

లాక్‌డౌన్‌ నేపథ్యంలో అక్షయ తృతీయను పురస్కరించుకుని తమ కస్టమర్ల కోసం ఆన్‌లైన్ విక్రయాలను అందుబాటులోకి తెచ్చినట్లు జోయ్ అలుక్కాస్ ప్రకటించింది. శనివారం, ఆదివారాలలో తమ వెబ్‌సైట్‌ ద్వారా ఇంటి నుంచే బంగారాన్ని కొనుగోలు, నచ్చిన నగను కొనుగోలు చేయవచ్చునని తెలిపింది. బంగారు ఆభరణాలపై ప్రతి గ్రాముకు రూ.50, వజ్రాభరణాలపై డైమండ్ వ్యాల్యూలో 20% డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. SBI క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా 15% క్యాష్ బ్యాక్ ఉంది. అమెజాన్, వూహూ డాట్ ఇన్ వంటి వెబ్ సైట్స్ ద్వారా కొనుగోళ్లు చేస్తే ప్రత్యేక బహుమతి వోచర్లు, ఈ-వోచర్లు ఉన్నాయి.

మలబార్ గోల్డ్ ఆఫర్

మలబార్ గోల్డ్ ఆఫర్

మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అక్షయ తృతీయ సందర్భంగా ఆన్ లైన్ అమ్మకాలు ప్రారంభించింది. ప్రామిస్ టు ప్రొటెక్ట్ పేరుతో ఆఫర్లు అందుబాటులోకి తెచ్చింది. బంగారు ఆభరణాల తరుగులో 30% తగ్గింపు, వజ్రాల వ్యాల్యూపై 20% వరకు తగ్గింపు ఇస్తోంది. SBI క్రెడిట్ కార్డులపై రూ.15,000కు మించి కొనుగోళ్లపై 5% క్యాష్ బ్యాక్ ఉంది. ఆదివారం వరకు ఈ ఆఫర్లు వర్తిస్తాయి.

అన్ని షాప్స్ భారీ డిస్కౌంట్లతో..

అన్ని షాప్స్ భారీ డిస్కౌంట్లతో..

అక్షయ తృతీయ రోజు ఆభరణాలు, ముడి బంగారాన్ని అమ్మడానికి జ్యువెల్లరీ సంస్థలు, పేమెంట్ యాప్స్ సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఆన్‌లైన్ విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఆన్ లైన్ అమ్మకం ద్వారా కొంతలో కొంత వీరికి ఊరట. కళ్యాణ్‌ జువెల్లర్స్, లలితా జువెల్లర్స్, జోయ్ అలుక్కాస్, జోస్ అలుక్కాస్, మలబార్ గోల్డ్, ఖజానా, తనిష్క్ తదితర కంపెనీలు భారీ ఆఫర్ల ఇస్తున్నాయి.

ఇలా బుక్ చేసుకోవచ్చు

ఇలా బుక్ చేసుకోవచ్చు

కస్టమర్లు వెబ్ సైట్స్‌లోకి వెళ్లి కొనుగోలు చేయవచ్చు. ఆన్‌లైన్ ద్వారా డబ్బులు చెల్లించి బుక్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. లాక్‌డౌన్ ముగిశాక నిర్దేశిత రోజుల్లో సమీపంలోని దుకాణానికి వెళ్లి కొనుగోలు చేసిన వస్తువును తెచ్చుకోవచ్చు. లేదంటే డెలివరీ చేస్తారు. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి పేమెంట్ యాప్స్‌ ద్వారా కూడా బంగారాన్ని బుక్‌ చేసుకోవచ్చు.

English summary

అక్షయ తృతీయకు అదిరిపోయే ఆఫర్లు: ఎస్బీఐ కార్డుపై క్యాష్‌బ్యాక్ | Akshaya Tritiya offers: Joy Alukkas online sales

If you are planning to buy gold this Akshaya Tritiya amid coronavirus lockdown and despite the looming recession, you will have to buy it online as physical gold shops would be closed.
Story first published: Friday, April 24, 2020, 7:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X