తదుపరి నోటీసులు అందే వరకు తమ కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేస్తున్నట్లు రీజినల్ ఎయిర్‌లైనర్ ఎయిర్ డెక్కన్ ఆదివారం ప్రకటించింది. ఉద్యోగులు అప్పటి వరకు సెలవులు ఉపయోగించుకోవాలని సూచించింది. ఈ కాలంలో వేతనాలు చెల్లించలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు సంస్థ సీఈవో అరుణ్ కుమార్ సింగ్ ఉద్యోగులకు మెయిల్ ద్వారా సందేశం పంపించారు. ఇప్పటికే ఎయిరిండియా, గోఎయిర్ తదితర విమానయాన సంస్థలు వేతనాల్లో కోత విధిస్తున్నట్లు ప్రకటించాయి.

ఆపరేషన్స్ నిలిపివేత
తదుపరి నోటీసుల వరకు ఆపరేషన్స్‌ను నిలిపివేస్తున్నట్లు ఎయిర్ డెక్కన్ తెలిపింది. ఉద్యోగులకు వేతనాలు లేని సెలవులు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. కరోనా కారణంగా ఇటీవల ప్రపంచ, దేశ పరిస్థితుల దృష్ట్యా, ఇండియన్ రెగ్యులేటర్ ఆదేశాల మేరకు ఏప్రిల్ 14వ తేదీ వరకు అన్ని వాణిజ్య ప్రయాణీకుల విమానాలను నిలిపివేయాలని నిర్ణయించినట్లు తెలిపింది.

బరువెక్కిన హృదయంతో.. వేతనాల్లేని సెలవులు
ప్రస్తుత పరిస్థితుల్లో విమాన సర్వీసులు నిలిపివేయడం మినహా మరో మార్గం లేదని స్పష్టం చేసింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బాధాకర, బరువెక్కిన హృదయంతో తప్పనిసరిగా పర్మినెంట్, తాత్కాలిక ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేని సెలవులు వెంటనే అమలులోకి తీసుకు వచ్చినట్లు తెలిపారు.

18 సీటర్ ఎయిర్ క్రాఫ్టర్
గుజరాత్‌పై ఫోకస్‌గా పశ్చిమ భారతంలో 18 సీటర్ బీచ్ క్రాఫ్ట్ విమానాలను నాలుగింటిని ఎయిర్ డెక్కన్ కలిగి ఉంది. వచ్చే వారం ఆదేశాలు వచ్చాక విమానయాన సంస్థను పునరుద్ధరిస్తామని తెలిపింది. ఇందుకు వివిధ డిపార్టుమెంట్స్ హెడ్స్‌ను సంప్రదించనున్నట్లు తెలిపింది. తిరిగి ప్రారంభమయ్యాక తీసుకుంటామని తెలిపింది.

అన్ని విమాన సంస్ధలదీ అదే దారి
కాగా, ఏప్రిల్ 14వ తేదీ తర్వాత నుండి ఎయిరిండియా మినహా మిగతా విమానయాన సంస్థలు టిక్కెట్ బుకింగ్స్ ప్రారంభించాయి. ఇక లాక్ డౌన్ ఈ సమయంలో వివిధ విమానయాన సంస్థలు వేతనాల్లో కోత విధించాయి. ఇండిగో సీనియర్ ఉద్యోగులకు 25 శాతం కోత, స్పైస్ జెట్ 10 శాతం నుండి 30 శాతం వతన కోత, ఎయిరిండియా 10 శాతం కోత విధించాయి. విస్తారా వేతనం లేని సెలవులను ప్రకటించింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications