For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గూగుల్ నుండి ఆ కీలక ఉద్యోగిని ఔట్, దుమారం

|

ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) స్కాలర్ టిమ్నిట్ గెబ్రూ సెర్చింజన్ గూగుల్ పబ్లిక్ ఇమేజ్‌ను మెరుగుకావడానికి దోహదపడ్డారు. అదే సమయంలో AI టెక్నాలజీలోని సమస్యలను ప్రశ్నించాడు. ఇదే సమయంలో టిమ్నిట్ గెబ్రూ ఆ సంస్థ నుండి నిష్క్రమించారు. ఇది చర్చనీయాంశంగా మారింది. పరిశోధన పత్రం విషయంలో సంస్థ మేనేజ్‌మెంట్‌కు, టిమ్నిట్‌కు మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయని, అందుకే బయటకు వెళ్లారని భావిస్తున్నారు.

<strong>అది ఆర్బీఐ నిర్ణయం కాదు: ఆ కీలక ప్రతిపాదన నుండి శక్తికాంతదాస్ దూరం!</strong>అది ఆర్బీఐ నిర్ణయం కాదు: ఆ కీలక ప్రతిపాదన నుండి శక్తికాంతదాస్ దూరం!

తొలగించారు...

తొలగించారు...

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)లో రూపుదిద్దుకుంటున్న ఓ కొత్త విభాగం సామాజిక సమస్యలకు దారితీసే అవకాశం ఉందని టిమ్నిట్ లేవనెత్తారని, ఇదే వివాదానికి కారణమైందని చెబుతున్నారు. దీంతో ఆమె సంస్థ నుండి బయటకు రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని అంటున్నారు. తనను తొలగించినట్లు ట్విట్టర్ వేదిక ద్వారా గెబ్రూ ప్రకటించారు. గెబ్రూ రాజీనామా చేసినట్లు ఉద్యోగులకు కూడా గూగుల్ తెలిపింది. దీంతో వివాదం చెలరేగింది.

1200 మంది ఉద్యోగుల మద్దతు

1200 మంది ఉద్యోగుల మద్దతు

గెబ్రూకు ఉద్యోగుల నుండి మద్దతు లభించింది. దాదాపు 1200 మంది ఉద్యోగులు ఆమెకు మద్దతుగా ఓపెన్ లెట్టర్ రాశారు. ఇది జాత్యాహంకార, రక్షణాత్మక చర్యగా కంపెనీని తప్పుబట్టారు. గెబ్రూ తొలగింపు అనూహ్యమని పేర్కొన్నారు. కంపెనీ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏమంటున్నారంటే..

ఏమంటున్నారంటే..

కంపెనీ నుండి గెబ్రూ ఆకస్మిక నిష్క్రమణ ఇప్పుడు గూగుల్ సంస్థ విశ్వసనీయతపై ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతున్నట్లు కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డోంట్ బి ఇవిల్ అన్న లక్ష్యానికి సంస్థ ఇప్పుడు చాలా దూరంగా వెళ్లిపోయిందని అంటున్నారు. మేనేజ్‌మెంట్‌ను సవాల్ చేసిన ఉద్యోగులను తొలగించడం సాధారణంగా మారిపోయిందంటున్నారు.

English summary

గూగుల్ నుండి ఆ కీలక ఉద్యోగిని ఔట్, దుమారం | AI Scholar Timnit Gebru's Exit From Google Raises Ethics, Bias Concerns

Gebru was instrumental in improving Google's public image as a company that elevates Black computer scientists and questions harmful uses of AI technology.
Story first published: Saturday, December 5, 2020, 20:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X