For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పబ్‌జీ, అలీ ఎక్ష్ప్రెస్స్ సహా మరో 275 చైనా అప్స్ పై నిషేధం?

|

ఇండియా ఇప్పటికైనా కళ్ళు తెరిచింది. మన వారు ఎవరో, పగ వారు ఎవరో గుర్తించింది. ఒకవైపు స్నేహ హస్తం అందిస్తూనే... మరో వైపు మన భూభాగాన్ని ఆక్రమించాలని చూస్తున్న చైనా కు ఎట్టకేలకు బుద్ధి చెప్పేందుకు సమాయత్తమవుతోంది. గత పదేళ్లలో ఇంటర్నెట్ వినియోగం పెరగటంతో ఇండియా లో టెక్నాలజీ యూసేజ్ ఊపందుకుంది. స్మార్ట్ ఫోన్ల కొనుగోళ్లు పెరిగాయి. డేటా వినియోగం అమాంతం పెరిగింది. ఇదే అదునుగా చైనా తన మొబైల్ ఆప్స్ ను ఒక్కక్కటిగా ఇండియా లో కి ప్రవేశపెట్టడం మొదలు పెట్టింది. ఒక వైపు స్మార్ట్ ఫోన్ల లో తన సొంత బ్రౌజర్ల ను ఇన్ - బిల్ట్ గా అందిస్తూ అదేదో ఉచిత సేవ చేస్తున్నట్లు బిల్డ్ అప్ ఇచ్చింది.

కానీ మొబైల్ ఆప్ ల రూపంలో, స్మార్ట్ ఫోన్ల రూపంలో మన పొరుగు దేశం చైనా ... ఇండియన్ కన్స్యూమర్ల సున్నితమైన డేటా ను తస్కరించింది. భారత్ లో విక్రయించే ప్రతి నాలుగు ఫోన్లలో మూడు చైనా వే కావటం ఆ దేశం ఎంతలా ఇండియా లో పాగా వేసిందో తెలియజేస్తుంది. వార్తా ప్రసారాలు, కంటెంట్ వంటి ఆప్ లను కూడా ఇండియా లో మొదలు పెట్టింది. ఇది ఎంత పెద్ద ప్రమాదమో గుర్తించే లోపే ఇండియా లో గూఢచర్యం తారా స్థాయికి చేరుకుంది.

అసత్యవార్తలు, చైనా వ్యతిరేక వార్తలపై సెన్సార్: చైనీస్ అలీబాబా, జాక్‌మాకు భారత్ కోర్టు సమన్లుఅసత్యవార్తలు, చైనా వ్యతిరేక వార్తలపై సెన్సార్: చైనీస్ అలీబాబా, జాక్‌మాకు భారత్ కోర్టు సమన్లు

వాటి పై వేటు...

వాటి పై వేటు...

లడఖ్ లో ని గాల్వాన్ లోయ లో జరిగిన దుర్ఘట వరకు భారత్.. చైనా పై సాఫ్ట్ కార్నర్ ప్రదర్శించింది. పోనీలే పొరుగు దేశం మనకు ఎలక్ట్రానిక్స్ వస్తువులు, స్మార్ట్ ఫోన్లు అందిస్తూ మన సేవ చేస్తోందిగా అనుకుంది. మరోవైపు మన స్టార్టుప్ కంపెనీల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ప్రోత్సహిస్తోంది కదా అనుకుంది. కానీ దాని వక్ర బుద్ధి ఎంత మాత్రం మారలేదని, హగ్గింగ్ లతో ఒరిగిందేమీ లేదని గుర్తించింది. అందుకే 59 చైనా ఆప్ లపై యుద్ధం ప్రకటించి వాటిని ఇండియా లో పూర్తిగా నిషేధించింది. అందులో కోట్ల కొద్దీ ఇండియన్ల మనసు దోచిన టిక్ టాక్ వంటి మొబైల్ ఆప్స్ కూడా ఉన్నాయి. ఐనా సరే భారత్ వెనకడుగు వేయలేదు. వాటిపై కఠిన నిర్ణయాన్ని అమలు చేస్తోంది. చేయాలి కూడా.

నెక్స్ట్ పబ్ జీ... అలీ ఎక్ష్ప్రెస్స్ ...

నెక్స్ట్ పబ్ జీ... అలీ ఎక్ష్ప్రెస్స్ ...

గూఢచర్య కార్యక్రమాలకు అవకాశం ఉందని భావిస్తున్న మరో 275 చైనా కు చెందిన మొబైల్ ఆప్స్ పై ప్రస్తుతం భారత ప్రభుత్వం ఒక కన్నేసింది. వాటిలో గేమింగ్ ఆప్ పబ్ జీ, అలీబాబా గ్రూప్ నకు చెందిన అలీ ఎక్ష్ప్రెస్స్ కూడా ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ది ఎకనామిక్ టైమ్స్ ఒక ప్రత్యేక కథనం ప్రచురించింది. గతంలో 59 మొబైల్ ఆప్స్ ను నిషేధించినట్లే... తాజాగా మరో 275 మొబైల్ ఆప్స్ పై వేటు పడే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఐతే వీటన్నిటపై ఒకసారి నిషేధం విధిస్తారా, లేదంటే కొన్నిటిపైనేనా అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇందులో పబ్ జీ మొబైల్ ఆప్ చైనా లో అత్యంత విలువైన ఇంటర్నెట్ కంపెనీ టెన్సన్ట్ కు చిందినది కావటం విశేషం. మరో వైపు అలీ ఎక్ష్ప్రెస్స్ డ్రాగన్ దేశానికి చెందిన అలీ బాబా గ్రూప్ నకు చెందిన విషయం తెలిసిందే. ఈ రెండు కంపెనీలు ఇండియా లో అనేక స్టార్టుప్ కంపెనీల్లో ప్రత్యక్షంగా పెట్టుబడి కూడా పెట్టాయి. దీంతో ఇదొక సున్నితమైన అంశంగా మారిపోయింది.

నిరంతర నిఘా...

నిరంతర నిఘా...

బాగా ప్రాచుర్యం పొందిన మొబైల్ ఆప్స్ నుంచి అంతగా తెలియని మొబైల్ ఆప్స్ వరకు ఇండియా లో చైనా అప్స్ భారీ మార్కెట్ ను కొల్లగొట్టాయి. వీటి ధాటికి మన సొంత ఆప్స్ కానీ అభివృద్ధి చెందిన దేశాలకు చెందిన ఆప్స్ కానీ నిలదొక్కుకోవడం లేదు. వినియోగానికి అత్యంత సులభంగా ఉండటం, ప్రతిదీ ఉచితంగా అందించటమే చైనా ఆప్స్ విజయ రహస్యంగా ఉంది. దీంతో వినియోగదారులు పెద్ద ఎత్తున వాటిని డౌన్ లోడ్ చేసుకుని వాడుతున్నారు. టిక్ టాక్ పై నిషేధం విధించిన తర్వాత చైనా కు చెందిన జిలి, స్నాక్ వీడియో అనే రెండు మొబైల్ ఆప్స్ ప్రత్యామ్నాయంగా నిలిచాయి. అంటే ఒక చైనా ఆప్ కు మరో చైనా ఆప్ ఆల్టర్నేట్ గా ఇప్పటికే అందుబాటులో ఉండటం గమనార్హం. ఇదే అంశం ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. అందుకే, అన్ని రకాల చైనా ఆప్స్, వాటి డేటా, ప్రైవసీ పాలసీ లను నిశితంగా పరిశీలిస్తూ వాటిపై నిరంతర నిఘా పెట్టాలని కేంద్రం భావిస్తోంది. లేదంటే నిషేధం ఉన్నప్పటికీ మారు పేర్లతో ఇండియా లో చైనా ఆప్స్ ఎప్పటికీ కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదే జరిగితే దేశ భద్రతకు పెను ముప్పు పొంచి ఉన్నట్లే నని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

English summary

పబ్‌జీ, అలీ ఎక్ష్ప్రెస్స్ సహా మరో 275 చైనా అప్స్ పై నిషేధం? | After ban on 59 Chinese apps, 275 more on radar

India has drawn up a list of 275 Chinese apps that it will examine for any violation of national security and user privacy, signalling heightened scrutiny and the possibility of more Chinese internet companies being banned in the country, according to people aware of the developments.
Story first published: Monday, July 27, 2020, 11:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X