For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Adani Vs Ambani: టెలికాం తరువాత ఈ వ్యాపారంపై గురి.. అంబానీ, అదానీ మధ్య పోరు.. గెలిచేదెవరంటే..

|

కరోనా తరువాతి నుంచి నువ్వా నేనా అన్నట్లుగా అంబానీ, అాదానీల మధ్య వ్యాపార పోటీ కొనసాగుతోంది. అవకాశం ఏదైనా నా తరువాతే అన్నట్లు గౌతమ్ అదానీ దూకుడు చెబుతోంది. తాజాగా టెలికాం రంగంలోని స్పెక్ట్రమ్ వేలంలో పాల్లొని అదానీ గ్రూప్ అందరనీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఈ ఇద్దరు సంపన్నులు ఇప్పుడు మరో రంగంలో పోటీకి దిగుతున్నారు.

టెలికాం తరువాత..

టెలికాం తరువాత..

టెలికాం తర్వాత భారత్‌, ఆసియాలో అతిపెద్ద సంపన్నులు ముఖేష్‌ అంబానీ, గౌతమ్‌ అదానీల మధ్య మరో రంగంలో ప్రత్యక్ష పోటీ ఏర్పడనుంది. అదానీని చెందిన.. అదానీ న్యూ ఇండస్ట్రీస్ (ANIL), అంబానీకి చెందిన.. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక్కొక్కటి రెండు కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG) ప్లాంట్లను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నాయి. అదానీ వీటిని గుజరాత్, ఉత్తరప్రదేశ్ లో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. అంబానీలు ఎక్కడ ప్లాంట్ పెడుతున్నారో ఇంకా తెలియదు. ఇందుకోసం ఈ రెండు కంపెనీలు రూ.500 నుంచి రూ.600 కోట్ల వరకు పెట్టుబడి పెట్టవచ్చని అంచనా.

వ్యర్థాల నుంచి సంపద..

వ్యర్థాల నుంచి సంపద..

దేశంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభాన్ని అదానీకి చెందిన కంపెనీలు ఇప్పటికే వినియోగించుకుంటూ భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి. అయితే.. అనేక కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు కుబేరులు పోటీ పడుతున్నట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలిపారు. వ్యవసాయ వ్యర్థాలు, చెరకు ప్రెస్, మున్సిపల్ వ్యర్థాలతో వీటిని నడపనున్నట్లు సమాచారం. గ్రీన్ హైడ్రోజన్‌ను తయారు చేయడానికి CBGని ఉపయోగించడం కూడా పరిశీలిస్తున్నారు. వీటని రిటైల్ గా విక్రయింటమే కాక, ఇళ్లలోని పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG)ని భర్తీ చేయగలదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

ఆకర్షనీయమైన ధరల వల్ల..

ఆకర్షనీయమైన ధరల వల్ల..

రిలయన్స్ బిపి, రిలయన్స్ బిపి మొబిలిటీతో జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసుకుంది. ఈ కంపెనీ జియో-బిపి బ్రాండ్ కింద దేశవ్యాప్తంగా 1400 కంటే ఎక్కువ పెట్రోల్ పంపులను కలిగి ఉంది. అదేవిధంగా.. అదానీ గ్రూప్‌కు చెందిన అనుబంధ సంస్థ అయిన అదానీ టోటల్ గ్యాస్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్‌లో యాక్టివ్‌గా ఉంది. కంప్రెస్డ్ బయోగ్యాస్ ఆకర్షణీయమైన ధరల కారణంగా ప్రైవేట్ ప్లేయర్‌లు దీని వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని మరో ఎగ్జిక్యూటివ్ పేర్కొన్నారు.

ధరలు విపరీతంగా పెరిగిపోవటంతో..

ధరలు విపరీతంగా పెరిగిపోవటంతో..

2018లో దీని ధర కిలో రూ.46 నుంచి 56 ఉండగా.. ఇప్పుడు కిలో రూ.70 నుంచి 76కు పెరిగిందని వ్యాపార వర్గాలు తెలిపాయి. కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తి తర్వాత మిగిలిపోయిన వాటిని ఎరువుగా ఉపయోగించవచ్చు. CBG ఉత్పత్తి, లభ్యతను పెంచడానికి ప్రభుత్వం అక్టోబర్ 2018లో ఒక పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్ కింద.. 2023-24 ఆర్థిక సంవత్సరం నాటికి 5,000 CBG ప్లాంట్‌లను ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం. బయోగ్యాస్‌లో 60 శాతం మీథేన్, 40-45% కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్ ఉంటాయి. ఏదైమైనా ప్రభుత్వం ప్రకటించిన ప్రయోజనాలను క్యాష్ చేసుకునేందుకు అదానీ, అంబానీలు పోటీ పడుతున్నారు.

Read more about: adani telecom అదానీ
English summary

Adani Vs Ambani: టెలికాం తరువాత ఈ వ్యాపారంపై గురి.. అంబానీ, అదానీ మధ్య పోరు.. గెలిచేదెవరంటే.. | after 5g spectrum billionaire business men adani and ambani targeted compressed bio gas business in india know full details

after 5g spectrum billionaire business men adani and ambani targeted this business in india
Story first published: Thursday, August 4, 2022, 9:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X