For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IPOకు ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్

|

ఆదిత్య బిర్లా క్యాపిటల్ అనుబంధ సంస్థ అయిన ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ లిమిటెడ్ (ABSLAMC) పబ్లిక్ ఇష్యూకు రానుంది. ఈ మేరకు సోమవారం సెబీకి దరఖాస్తు చేసుకుంది. ABSLAMCలో ఆదిత్య బిర్లా గ్రూప్‌కు ఉన్న వాటాల్లో 2.9 మిలియన్ షేర్లు, సన్ లైఫ్ ఏఎంసీ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఉన్న వాటాల్లో 36 మిలియన్ షేర్లను ఆఫర్ సేల్ కింద విక్రయించనుంది.

ఈ రెండింటి వాటాలు కలిపితే ABSLAMCలో 13.50 శాతం పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ అవుతుంది. ఆదిత్య బిర్లా గ్రూప్, సన్ లైఫ్ ఫినాన్షియల్, కెనడా మధ్య ఏర్పడిన జాయింట్ వెంచర్ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ AMC. ఈ సంస్థలో ఆదిత్య బిర్లాకు 51 శాతం వాటాలు ఉండగా, మిగతా 49 శాతం వాటాలు సన్ లైఫ్ చేతిలో ఉన్నాయి.

Aditya Birla Sun Life AMC files draft papers with SEBI for IPO

షేర్ల ధరల శ్రేణి, సబ్‌స్క్రిప్షన్ తేదీ, లిస్టింగ్ తేదీ, IPO ద్వారా ఎంత మొత్తం సమీకరించనున్నారనే విషయం వెల్లడి కావాల్సి ఉంది. దీంతో మంగళవారం ఆదిత్య బిర్లా క్యాపిటల్ నేడు మూడు శాతానికి పైగా లాభపడి రూ.119 వద్ద ఉంది. మధ్యాహ్నం సమయానికి 1.56 శాతం లాభంతో రూ.117 వద్ద ఉంది.

English summary

IPOకు ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ | Aditya Birla Sun Life AMC files draft papers with SEBI for IPO

Aditya Birla Sun Life AMC Limited (ABSLAMC), a material subsidiary of Aditya Birla Capital has filed a draft red herring prospectus (‘DRHP’) dated April 19, 2021 with the Securities and Exchange Board of India for an initial public offering by way of an offer for sale.
Story first published: Tuesday, April 20, 2021, 17:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X