For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మరో పేమెంట్ బ్యాంకు మూసివేత. అసలు ఏం జరుగుతోంది!

|

పేమెంట్ బ్యాంకులు.... రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) అనుమతుల కోసం ఒకప్పుడు క్యూ కట్టాయి. ఇప్పుడేమో అంతే స్పీడ్ గా వాటిని మూసివేసేందుకు క్యూ కడుతున్నాయి. భారత్ లో ఈ రంగంలో అసలు ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కానీ పరిస్థితి. ఇప్పటికే దేశంలో 4 ప్రధాన పేమెంట్ బ్యాంకులు మూత పడగా ... తాజాగా మరో పేమెంట్ బ్యాంకు ఈ దిశగా అడుగులు వేస్తోంది. దీంతో అసలు ఈ మోడల్ వయబిలిటీ పైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పేమెంట్ బ్యాంకులు అంటే చిన్న తరహా బ్యాంకులు అన్నమాట.

బ్యాంకులు అందించే దాదాపు అన్ని రకాల సేవలు ఇవి కూడా అందించగలవు. కానీ ఇవి కేవెలం చిన్న మొత్తాల చెల్లింపులకు మాత్రమే పరిమితం అవుతాయి. అలాగే రుణాలు ఇవ్వటం లేదా క్రెడిట్ కార్డులు వంటివి జారీ చేయటం కుదరదు. ఇండియాలో పేమెంట్ బ్యాంకుల ఏర్పాటు ప్రతిపాదనలు వచ్చిన తర్వాత రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా 11 పేమెంట్ బ్యాంకులకు లైసెన్సులు జారీ చేసింది. కానీ ప్రస్తుతం ఐదారు మాత్రమే తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. తాజాగా మరో బ్యాంకు మూత పడనుండటంతో వీటి సంఖ్య మరింత తగ్గే అవకాశం కనిపిస్తోంది.

వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్‌లకు మోడీ ప్రభుత్వం భారీ ఊరటవొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్‌లకు మోడీ ప్రభుత్వం భారీ ఊరట

ఆదిత్య బిర్లా పేమెంట్ బ్యాంకు క్లోజ్...

ఆదిత్య బిర్లా పేమెంట్ బ్యాంకు క్లోజ్...

రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా లైసెన్స్ లు జారీ చేసిన కొన్ని పేమెంట్ బ్యాంకుల్లో ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్ బ్యాంకు కూడా ఒకటి. అయితే, ఇప్పుడు అది మూసివేత దిశగా పయనిస్తోంది. స్వతహాగా పేమెంట్ బ్యాంకు కార్యకలాపాలను మూసివేయాలని ఆదిత్య బిర్లా నిర్ణయించింది. ఇందుకోసం బొంబాయి హై కోర్ట్ ను ఆశ్రయించింది. ఇందుకు కోర్టు అనుమతించడంతో ఇక ఈ పేమెంట్ బ్యాంకు మూసివేత ఖాయమైంది. 2019 సెప్టెంబర్ 18న లిక్విడేషన్ కు బొంబాయి హై కోర్ట్ అనుమతి మంజూరు చేసిందని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఒక నోటిఫికేషన్ లో తెలిపింది. ఈ ప్రక్రియకు లిక్విడేటర్ గా డెలాయిట్ సీనియర్ డైరెక్టర్ విజయ్ కుమార్ వి అయ్యర్ ని హై కోర్ట్ నియమించిందని ఆర్ బి ఐ తెలిపింది.

సాధ్యం కాదు...

సాధ్యం కాదు...

ఇదిలా ఉండగా... పేమెంట్స్ బ్యాంకు ను నిర్వహించటం ఆర్థిక పరంగా సాధ్యం కాదని ఆదిత్య బిర్లా గుర్తించింది. అనుకోని కొన్ని సంఘటనలు కూడా పరిస్థితిని మరింత జఠిలం చేశాయి. దీంతో ఇక పేమెంట్ బ్యాంకు ను మూసివేయాలని ఆదిత్య బిర్లా నిర్ణయించింది. ఈ దిశగా ఈ ఏడాది జులై లోనే ప్రక్రియను ప్రారంభించింది. అయితే, ఇది కేవలం ఆదిత్య బిర్లా సంస్థకు ఎదురైన అనుభవం మాత్రమే కాదు. దాదాపు అన్ని పేమెంట్ బ్యాంకులది ఇదే దారి. అయితే కొన్ని ఇతరత్రా సేవల అందింపునకు ఈ బ్యాంకు అనుసంధాన కర్తగా పనికొస్తుందని కొనసాగిస్తున్నాయి తప్ప ఆర్థికంగా అవి లాభాలు గడిస్తాయని కాదు. ఐడియా బిర్లా వాలంటీర్ గానే పేమెంట్ బ్యాంకు లిక్విడేషన్ కు దరఖాస్తు చేసింది. దీనిని పరిశీలించిన బొంబాయి హై కోర్ట్ అందుకు అనుమతి మంజూరు చేసింది.

ఇప్పటికే 4 మూత...

ఇప్పటికే 4 మూత...

భారత్ లో పేమెంట్ బ్యాంకుల మూసివేత ఇప్పుడే మొదలు కాలేదు. మొత్తం ఇండియాలో 11 పేమెంట్ బ్యాంకులు లైసెన్స్ లు పొందగా... అందులో ఇప్పటికే 4 పేమెంట్ బ్యాంకులు మూతపడ్డాయి. అందులో టెక్ మహీంద్రా, చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ, సన్ ఫార్మా అధిపతి దిలీప్ షాంగ్వి తో కూడిన ఐడిఎఫ్ సి కార్సోర్టియం, టెలినార్ ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థలు ఉన్నాయి. అవన్నీ తమ పేమెంట్ బ్యాంకు కార్యకలాపాలకు పూర్తిగా స్వస్థి పలికాయి. వీటన్నిటి కారణాలు దాదాపు ఒకేలా ఉన్నాయి. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా పేమెంట్ బ్యాంకులను ప్రతిపాదించినపుడు అవి చాలా ఆకర్షణీయంగా కనిపించాయి. కానీ అమలు లో మాత్రం ఆర్థికంగా నిలబడలేవని రుజువవుతోంది.

మిగిలినవి కొన్నే...

మిగిలినవి కొన్నే...

తాజాగా ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్ మూసివేత తర్వాత దేశంలో మిగిలే పేమెంట్ బ్యాంకులు కొన్నే ఉండనున్నాయి. ఐడియా బిర్లా తో కలుపుకొంటే మొత్తం ఐదు పేమెంట్ బ్యాంకులు మూతపడ్డట్టు అవుతుంది. ఇక మిగిలేది కేవలం ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకు, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు, పేటీఎం పేమెంట్ బ్యాంకు, జియో పేమెంట్ బ్యాంకు, ఫినో పేమెంట్ బ్యాంకు, ఎంఎస్డీఎల్ పేమెంట్ బ్యాంకు మాత్రమే తమ కార్యకలాపాలు కొనసాగించనున్నాయి. అయితే, అందులో కూడా ఎన్ని బ్యాంకులు తమ సొంత కాళ్లపై ఆర్థికంగా నిలబడగలవో చెప్పటం కష్టమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. సరైన రాబడి మార్గాలు లేని పేమెంట్ బ్యాంకులు ఎక్కువ కాలం మనుగడ సాగించలేవని వారు అభిప్రాయపడుతున్నారు.

English summary

మరో పేమెంట్ బ్యాంకు మూసివేత. అసలు ఏం జరుగుతోంది! | Aditya Birla Idea Payments Bank files for voluntary liquidation

The Reserve Bank on Monday said Aditya Birla Idea Payments Bank is headed for liquidation post application by the company for voluntarily winding up. "We advise that on a voluntarily winding up application by Aditya Birla Idea Payments Bank Limited, the Bombay High Court has passed an order on September 18, 2019," RBI said in a notification.
Story first published: Thursday, November 21, 2019, 19:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X