For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గంగూలీకు గుండెపోటు, అదానీ 'ఫార్చ్యూన్' యాడ్ నిలిపివేత

|

బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీకి గుండెపోటు వచ్చిన అనంతరం అదానీ విల్మార్.. ఫార్చ్యూన్ రైస్ బ్రాన్ ఆయిల్ ప్రకటనను నిలిపివేసింది. అదానీ గ్రూప్‌కు చెందిన ఈ ఆయిల్‌కు గంగూలీ బ్రాండ్ అంబాసిడర్. కంపెనీ యాడ్‌లో ఆరోగ్యకరమైన గుండె కోసం, రోగనిరోధకశక్తిని పెంచేందుకు ఈ నూనెను ఉపయోగించాలని గంగూలీ చెబుతారు. అలాంటి దాదా గుండెపోటుకు గురవడంతో యాడ్ పైన విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ప్రస్తుతానికి ఆ కంపెనీ ప్రకటనను నిలిపివేసింది. ఫార్చ్యూన్ ఆయిల్ తింటే గుండె జబ్బు వస్తుందని, బ్రాండ్ అంబాసిడర్‌కే వచ్చిందని కామెంట్లు వచ్చాయి. దాంతో ఆదానీ విల్మార్ కంపెనీ ఈ ప్రకటనను నిలిపివేసింది.

ప్రకటన నిలిపివేసిన అనంతరం దాదా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో చురకలు అంటించారు. దీనిపై కంపెనీ స్పందించింది. యాడ్ నిలిపివేత తాత్కలిక విరామమేనని ఆదానీ విల్మార్ డిప్యూటీ సీఈవో తెలిపారు.

Adani Wilmar halts Fortune healthy oil ads after Sourav Ganguly suffers heart attack

ఫార్చ్యూన్‌ రైస్‌బ్రాన్‌ ఆయిల్‌ ప్రచారకర్తగా గంగూలీయే ఉంటారని, రైస్‌బ్రాన్‌ ఆయిల్‌ ఔషధం కాదు వంట నూనె మాత్రమేనని, ఆహార, వంశపారంపర్య సమస్యలతో సహా అనేక అంశాలు గుండె జబ్బులకు కారణమవుతాయని, తాము గంగూలీతో కలిసి పని చేస్తామని, అతనితో చర్చించి నిర్ణయం తీసుకునే వరకు తమ టీవీ యాడ్‌కు తాత్కాలిక విరామం ఇస్తున్నట్లు తెలిపారు.

ట్రంప్‌కు న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ షాక్, ఆ 3 చైనా కంపెనీలకు భారీ ఊరటట్రంప్‌కు న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ షాక్, ఆ 3 చైనా కంపెనీలకు భారీ ఊరట

English summary

గంగూలీకు గుండెపోటు, అదానీ 'ఫార్చ్యూన్' యాడ్ నిలిపివేత | Adani Wilmar halts Fortune healthy oil ads after Sourav Ganguly suffers heart attack

Fortune brand faced many trolls on social media after former Indian cricket captain Sourav Ganguly, who featured in the oil's ad campaigns, underwent a coronary angioplasty Saturday.
Story first published: Wednesday, January 6, 2021, 19:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X