For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Adani: కొత్త కంపెనీ స్టార్ట్ చేసిన అదానీ.. కేంద్రం నిర్ణయంతో ప్లాన్.. అదానీ ఓపెన్ టాక్..!

|

Adani: మారుతున్న టెక్నాలజీని నిత్య జీవితంలో అమలుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉంది. ఇందులో భాగంగా ఇళ్లకు, పరిశ్రమలకు స్మార్ట్ మీటర్లను అమర్చాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రయోగాత్మక అమలు కొన్ని చోట్ల దేశంలో కొనసాగుతోంది. ఈ వ్యాపార అవకాశాన్ని అదానీ గ్రూప్ అందిపుచ్చుకుంటోంది.

అదానీ ట్రాన్స్‌మిషన్..

అదానీ ట్రాన్స్‌మిషన్..

దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీల్లో అదానీ గ్రూప్ ఒకటి. అదానీ గ్రూప్ కంపెనీలు వివిధ రంగాల్లో తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి. అదానీ ట్రాన్స్‌మిషన్ తన స్మార్ట్ మీటరింగ్ వ్యాపారానికి అనుబంధ సంస్థగా బెస్ట్ స్మార్ట్ మీటరింగ్‌ను ప్రారంభించినట్లు చెప్పిన తర్వాత సీడ్ క్యాపిటల్‌ను కూడా ఆమోదించింది. కంపెనీ గత మంగళవారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈరోజు నమోదు చేయబడింది. అయితే ఇది ఇంకా తన ట్రేడింగ్ కార్యకలాపాలను ప్రారంభించలేదని స్టాక్ ఎక్స్ఛేంజ్‌ ఫైలింగ్‌లో స్పష్టం చేసింది.

సులభ చెల్లింపులు..

సులభ చెల్లింపులు..

స్మార్ట్ మీటర్లు తమ నగదు ప్రవాహాన్ని మెరుగ్గా నిర్వహించడంలో సహాయపడే సాంకేతికతగా పరిగణించబడుతున్నాయి. ఇది చెల్లింపులను క్రమబద్ధీకరించటంతో పాటు డిస్కంలకు నగదు ప్రవాహ నిర్వహణకు దోహదపడుతుంది. పైగా బిల్లింగ్ ఖర్చులను తగ్గించటంలో దోహదపడుతుంది. డిజిటల్ విద్యుత్ మీటర్లు, స్మార్ట్ విద్యుత్ మీటర్ల మధ్య చాలా తేడాలు ఉన్నందున.. విద్యుత్ బిల్లింగ్ కూడా చాలా సులభం అవుతుంది.

కేంద్ర ప్రభుత్వం..

కేంద్ర ప్రభుత్వం..

డిస్కమ్‌ల సామర్థ్య పెంపు, ఆర్థిక మెరుగుదల లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం విద్యుత్ మీటర్ల స్థానంలో స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయాలని పంపిణీ సంస్థలకు సూచించింది. ఇందులో భాగంగా 2025-26 నాటికి దేశంలో 25 కోట్ల ప్రీపెయిడ్ స్మార్ట్‌మీటర్లు అమర్చాలని నిర్ణయించింది. పైగా దీని కోసం ఏకంగా రూ.1.5 లక్షల కోట్లను కేటాయించాలనుకుంటోంది. ఈ నిర్ణయం అదానీ ట్రాన్స్‌మిషన్ అనుబంధంగా బెస్ట్ స్మార్ట్‌మీటరింగ్ కు పెద్ద వ్యాపార అవకాశంగా మారిందని చెప్పుకోవాలి.

నోరు విప్పిన అదానీ..

నోరు విప్పిన అదానీ..

ప్రధాని మోదీ హయాంలో గౌతమ్ అదానీ వ్యాపారాలు లాభపడుతున్నాయని చాలా విమర్శలు ఉన్నాయి. అయితే దీనిపై అదానీ వివరణ ఇస్తూ తన ప్రయాణం ఇప్పుడు ప్రారంభం కాలేదని అన్నారు. రాజీవ్ గాంధీ హయాంలో ప్రవేశపెట్టిన పారిశ్రామిక విధానాలతో తొలి అడుగు వేశానని చెప్పారు. ఆ తర్వాత 1991లో ప్రధాని నరసింహారావు, మన్మోహన్ సింగ్ తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలతో వ్యాపారిగా తన ప్రయాణం లాభదాయకంగా ముందుకు సాగిందన్నారు. మోదీ, తాను ఒకే రాష్ట్రానికి చెందిన వారు కాబట్టి ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయని స్పష్టం చేశారు.

English summary

Adani: కొత్త కంపెనీ స్టార్ట్ చేసిన అదానీ.. కేంద్రం నిర్ణయంతో ప్లాన్.. అదానీ ఓపెన్ టాక్..! | Adani Transmission started Smart metering Company, with centers decision

Adani Transmission started Smart metering Company, with centers decision
Story first published: Thursday, December 29, 2022, 10:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X