For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Adani: అదానీ భారీ ప్లాన్.. ఇండియా వయా ఆఫ్రికా టూ యూరప్.. మాస్టర్ స్కెచ్ సూపర్..

|

Adani: గౌతమ్ అదానీ ఈ పేరు మనందరం రోజూ ఏదో ఒక వార్తలో వింటూనే ఉన్నాయి. ఇప్పటి వరకు దేశంలో తన వ్యాపారాలను విస్తరిస్తూ.. కొన్ని పొరుగు స్నేహపూర్వక దేశాలకు విస్తరించారు. అయితే ఇప్పుడు ఈ గుజరాతీ ఒక మెగా వ్యాపార వ్యూహాన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఎనర్జీ వ్యాపారం..

ఎనర్జీ వ్యాపారం..

రానున్న కాలంలో విద్యుత్ చాలా కీలకమైన ఆర్ఖిక చోదకంగా మారనుంది. శిలాజ ఇంధనాలకు కాలం చెల్లే సమయం దగ్గర పడింది. దీనిని ముందుగానే గ్రహించిన అదానీ గ్రూప్ రెన్యూవబుల్ ఎనర్జీ, ట్రాన్స్ మిషన్ రంగాల్లో కీ ప్రేయర్ గా మారింది. అయితే ఇదే ప్లాన్ ను ప్రపంచ వ్యాప్తంగా విస్తరించేందుకు సైతం ఉపయోగించాలని నిర్ణయించుకుంది.

ఆసియా టూ ఆఫ్రికా..

ఆసియా టూ ఆఫ్రికా..

ఆసియాలో అత్యంత ధనవంతుడు ఇప్పుడు తన పెట్టుబడులను ఆఫ్రికాకు విస్తరించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం గౌతమ్ అదానీ ఆఫ్రికాలోని మొరాకోలో ఒక భారీ పునరుత్పాదక ప్రాజెక్ట్ ఏర్పాటు కోసం చర్చలు జరుపుతున్నారు. ఉత్తర ఆఫ్రికా దేశంలో విండ్, సౌర ఉత్పత్తి ప్లాంట్‌లను నిర్మించాలని, ఎగుమతి కోసం గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసే సౌకర్యాలను నిర్మించాలని పరిశీలిస్తోంది. దీని ద్వారా సులువుగా యూరప్‌లోకి ఎంటర్ అవ్వాలని మాస్టర్ ప్లాన్ చేస్తోంది.

యూరప్ మార్కెట్ టార్గెట్..

యూరప్ మార్కెట్ టార్గెట్..

యూరప్ ఇంధన మార్కెట్ చాలా పెద్దది. అందుకే ఆఫ్రికా నుంచి విద్యుత్, ఎమిషన్ ఫ్రీ ఇంధనాన్ని సరఫరా చేసే లక్ష్యంతో అదానీ ముందుకు సాగుతున్నారు. అందుకే ఆఫ్రికాలో 10 గిగావాట్ల సామర్థ్యం కలిగిన ప్రాజెక్ట్ పెట్టవచ్చని తెలుస్తోంది. దీనిని రెండు దశల్లో నిర్మించాలని అదానీ గ్రూప్ ప్రణాళికలను కలిగి ఉందని సమాచారం.

చర్చలు ఇలా..

చర్చలు ఇలా..

అదానీ హైడ్రోజన్ అమ్మకం కోసం మొరాకో ప్రభుత్వ యాజమాన్యంలోని OCP గ్రూప్‌తో చర్చలు జరుపుతోంది. ఎరువుల తయారీదారు కార్బన్ రహిత అమ్మోనియాను ఉత్పత్తి చేయడానికి ఫీడ్‌స్టాక్‌గా ఉపయోగించవచ్చు. ప్రస్తుత సాంకేతికత ప్రకారం యూరప్ గ్రీన్ హైడ్రోజన్ ఎగుమతికి సమయం పట్టవచ్చు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, NTPC లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కంపెనీలు సైతం ఇండియాలో క్లీన్ ఎనర్జీ కోసం పనిచేస్తున్నాయి.

అదానీ కంపెనీల షేర్లు..

అదానీ కంపెనీల షేర్లు..

అదానీ ప్లాన్స్ కార్యరూపం దాల్చితే ఆయనకు చెందిన అనేక కంపెనీలు స్టాక్ మార్కెట్లో రాకెట్ వేగంతో పెరుగుతాయని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఇప్పటికే అదానీ గ్రీన్, అదానీ ట్రాన్స్ మిషన్, అదానీ ఎంటర్ ప్రైజెస్ కంపెనీల షేర్లు అనేక మంది రిటైలర్లకు లాభాల పంట పండించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ కంపెనీల్లో ఇప్పటికీ చాలా మంది చిన్న పెట్టుబడిదారులు ఈ కంపెనీల్లో తమ డబ్బును పార్క్ చేశారు. వ్యాపార అవసరాల కోసం తక్కువ వడ్డీకి రూ.83,000 కోట్ల రుణాలను సమీకరించాలని అదానీ గ్రూప్ ప్లాన్ చేస్తోంది.

Read more about: adani eurpoe energy africa morocco
English summary

Adani: అదానీ భారీ ప్లాన్.. ఇండియా వయా ఆఫ్రికా టూ యూరప్.. మాస్టర్ స్కెచ్ సూపర్.. | adani targetted eurpoe energy markets with morocco business plan of africa

adani targetted Europe energy markets with morocco business plan of africa..
Story first published: Saturday, October 22, 2022, 10:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X