For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Adani News: అప్పుల కుప్పగా అదానీ కంపెనీ..! ఎందుకిలా జరిగిందంటే..?

|

Adani News: ఇండియన్ బిలియనీర్ గౌతమ్ అదానీకి చెందిన ముంద్రా పవర్ ప్లాంట్ చుట్టూ వివాదం నడుస్తోంది. ఈ పవర్ ప్లాంట్ కు ఆస్తుల కంటే అప్పులు ఎక్కవగా ఉన్నాయి. ప్రస్తుతం కంపెనీ రూ. 14,718 కోట్ల నష్టాన్ని కలిగి ఉంది. అయితే ముంద్రా ప్లాంట్‌లో నష్టాలను పూడ్చేందుకు, పెట్టుబడిదారులకు భరోసా కల్పించేందుకు అదానీ గ్రూప్ రూ. 8,176 కోట్ల కంటే ఎక్కువ సృజనాత్మక రుణ-ఫైనాన్సింగ్‌ను మోహరించిందని బ్లూమ్ బెర్గ్ వార్తా సంస్థ తన కథనంలో వెల్లడించింది.

 కుదుటపడుతున్న స్టాక్స్..

కుదుటపడుతున్న స్టాక్స్..

తప్పుడు అకౌంటింగ్ ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్ కంపెనీలు ఏకంగా రూ.12 లక్షల కంటే ఎక్కువ విలువను కోల్పోయాయి. అయితే గౌతమ్ అదానీ అంతర్జాతీయంగా రోడ్డు షోలను నిర్వహించటం, ఇన్వెస్టర్లలో ధైర్యాన్ని నింపటం వల్ల మార్కెట్లో గ్రూప్ కంపెనీల షేర్లు నష్టాల నుంచి తేరుకున్నాయి. గత నెలలో సింగపూర్, హాంకాంగ్‌లలో రోడ్‌షోలు నిర్వహించింది. ఈ క్రమంలో కంపెనీల విలువతో పాటు అదానీ వ్యక్తిగత సంపద క్షీణించి దాదాపు రూ.4 లక్షల కోట్లకు చేరుకుంది. ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో సైతం అదానీ అనేక స్థానాలు వెనకపడ్డారు.

 అదానీ పవర్..

అదానీ పవర్..

60 ఏళ్ల వయస్సున్న గౌతమ్ అదానీ దాదాపు 15 సంవత్సరాల కిందట విద్యుత్ ఉత్పత్తి వ్యాపారంలోకి అడుగు పెట్టారు. దేశంలో అతిపెద్ద పవర్ సరఫరాదారునిగా నిలిచే క్రమంలో అదానీ పవర్ అనేక ప్లాంట్లను వేగంగా సేకరించింది. గుజరాత్ తీరంలోని ముంద్రా పవర్ ప్లాంట్ నిర్మించబడింది. పూర్తి సామర్థ్యంతో పనిచేసినప్పుడు ఇది దాదాపు 50 లక్షల కంటే ఎక్కువ గ్రామీణ గృహాలకు సరిపోయే విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. అయితే ఈ ప్లాంట్ నడపాలంటే ఎక్కువగా ఇండోనేషియా నుంచి బొగ్గు దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది.

 గడచిన ఐదేళ్లుగా..

గడచిన ఐదేళ్లుగా..

ఐదేళ్ల క్రితం జీవితకాల నష్టాలు రూ. 12,264 కోట్లకు చేరుకున్నాయి. ప్లాంట్‌ ఉన్న భూమితో సహా ముంద్రా మొత్తం - అదానీ పవర్ ఆస్తులలో మూడింట ఒక వంతు. బ్యాంకు రుణాలకు భద్రతగా వీటిని తాకట్టు పెట్టినట్లు ఫైలింగ్స్ ప్రకారం తెలుస్తోంది. ఈ క్రమంలో అదానీ పవర్ ముంద్రాకు రూ. 4,905 కోట్ల కంటే ఎక్కువ రుణం ఇచ్చింది. 2019లో ముంద్రాకు బ్రేక్ వచ్చినట్లు అనిపించింది. దేశంలోని సెంట్రల్ పవర్ రెగ్యులేటర్ అదానీ పవర్‌కు గుజరాత్‌లో అధిక బొగ్గు ఖర్చులను భర్తీ చేయడానికి విద్యుత్ ధరలను పెంచడానికి అనుమతించింది.

English summary

Adani News: అప్పుల కుప్పగా అదానీ కంపెనీ..! ఎందుకిలా జరిగిందంటే..? | Adani's Mundra power plant was in deep debts than assets know details

Adani's Mundra power plant was in deep debts than assets know details
Story first published: Monday, March 6, 2023, 17:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X