For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gawtam Adani: అదానీ చేతిలోకి మరో కంపెనీ.. పరుగులు తీస్తున్న స్టాక్ ఇదే.. మీ దగ్గర ఉందా..?

|

Gawtam Adani: పవర్ రంగంలో గత కొంత కాలంగా అదానీ గ్రూప్ వేగంగా పెట్టుబడులను పెడుతోంది. ఈ క్రమంలో తాజాగా దేశంలోని మరో కంపెనీని అదానీ గ్రూప్‌ సొంతం చేసుకుంది. అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ పవర్.. అప్పుల ఊబిలో కూరుకుపోయిన డీబీ పవర్ లిమిటెడ్‌ను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ కొనుగోలుతో అదానీ పవర్ థర్మల్ పవర్ రంగంలో తన వ్యాపారాన్ని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. DB పవర్ ఛత్తీస్‌గఢ్‌లోని జంజ్‌గిర్ చంపా జిల్లాలో 600 మెగావాట్ల కెపాసిటీ ఉన్న రెండు థర్మల్ పవర్ ప్లాంట్లను కలిగి ఉంది.

కోల్ ఇండియాతో ఒప్పందం..

కోల్ ఇండియాతో ఒప్పందం..

అదానీ పవర్‌ ఈ కొనుగోలుకు సంబంధించిన అవగాహనా ఒప్పందానికి సంబంధించిన ప్రారంభ వ్యవధి అక్టోబర్ 31, 2022 వరకు ఉంటుంది. రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ ఈ విషయాన్ని వెల్లడించింది. అదానీ పవర్ 923.5 మెగావాట్ల సామర్థ్యం కోసం దీర్ఘకాలిక, మధ్యకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని కలిగి ఉందని స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. అలాగే ఇంధన సరఫరాకు సంబంధించి కోల్ ఇండియా లిమిటెడ్ తో ఒప్పందం కుదుర్చుకుని అదానీ గ్రూప్ వెల్లడించింది.

డీల్ విలువ..

డీల్ విలువ..

DB పవర్ మాతృసంస్థ అయిన DPPL కంపెనీలో అదానీ గ్రూప్ 100 శాతం ఈక్విటీ షేర్ క్యాపిటల్, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్‌ కలిగి ఉంది. ఈ డీల్ మెుత్తం విలువ దాదాపు రూ.7,017 కోట్లుగా ఉందని తెలుస్తుంది. DB పవర్ అక్టోబర్ 2006 నుంచి చత్తీస్‌గఢ్‌లో థర్మల్ పవర్ జనరేటింగ్ స్టేషన్‌ల స్థాపన, నిర్వహణ వ్యాపారంలో నిమగ్నమై ఉంది.

అదానీ పవర్ స్టాక్‌ పరుగులు..

అదానీ పవర్ స్టాక్‌ పరుగులు..

తాజా డీల్ వివరాలు వెలువడిన నేపథ్యంలో శుక్రవారం అదానీ పవర్ స్టాక్ మంచి ర్యాలీని చూసింది. అదానీ పవర్ షేరు 2.88 శాతం లాభంతో రూ.410.90 వద్ద ముగిసింది. గత నెల రోజుల వివరాలను పరిశీలిస్తే.. అదానీ పవర్ షేర్లు 35 శాతం లాభపడ్డాయి. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1.60 లక్షల కోట్లకు చేరింది.

అదానీ పవర్ ఇప్పుడు మార్కెట్ క్యాప్ పరంగా ప్రభుత్వ సంస్థ NTPC కంటే ఎక్కువగా ఉంది. అదానీ పవర్ తన ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రాబడిని స్థిరంగా అందించింది. గత ఐదు రోజుల్లో షేర్ దాదాపు 15 శాతం జంప్ చేసింది. గత నెలలో అదానీ పవర్ స్టాక్ 35 శాతానికి పైగా పెరిగింది. అదేవిధంగా గత ఆరు నెలల్లో షేర్ విలువ దాదాపు 240 శాతం పెరిగింది.

English summary

Gawtam Adani: అదానీ చేతిలోకి మరో కంపెనీ.. పరుగులు తీస్తున్న స్టాక్ ఇదే.. మీ దగ్గర ఉందా..? | adani purchasing this stock lead to mega rally in stock market

adani power purchasing db power plant deal under pipeline lead to heavy rally in stock
Story first published: Sunday, August 21, 2022, 9:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X