For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Adani Ports: మాట నిలబెట్టుకున్న అదానీ.. వేల కోట్ల అప్పు ముందుగా చెల్లింపు..

|

Adani Ports: ఎవరు ఏమనుకుంటున్నా తాను మాత్రం తన పని చేసుకుపోతున్నారు గౌతమ్ అదానీ. హిండెన్ బెర్గ్ నివేదిక తర్వాత ఇన్వెస్టర్లలో నెలకొన్న ఆందోళనలను తగ్గించాలని నిర్ణయించిన ఆయన దానికి అనుగుణంగా కొన్ని నిర్ణయాలను కూడా ఇటీవల ప్రకటించారు. ఆ ప్రయత్నాలు కొంత మేర సఫలీకృతం అవుతున్నట్లు కనిపిస్తోంది.

అదానీ పోర్ట్స్..

అదానీ పోర్ట్స్..

గౌతమ్ అదానీకి చెందిన అదానీ పోర్ట్స్ & సెజ్ (APSEZ) రూ.1,500 కోట్ల రుణాన్ని సోమవారం చెల్లించింది. మార్చిలో మరో రూ.1000 కోట్లను చెల్లిస్తామని అదానీ గ్రూప్ హామీ ఇచ్చింది. కంపెనీ సోమవారం ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ కు ఉన్న రూ.1,500 కోట్ల బకాయిని చెల్లించింది. ఈ పార్ట్ ప్రీపేమెంట్ ప్రస్తుతం ఉన్న నగదు నిల్వలు, వ్యాపార కార్యకలాపాల నుంచి వచ్చిన నిధుల నుంచి చెల్లించినట్లు కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. ఇది మార్కెట్ విశ్వాసాలను పెంచుతుందని తెలుస్తోంది.

కంపెనీ అసలు నిర్ణయం..

కంపెనీ అసలు నిర్ణయం..

దేశంలో అతిపెద్ద పోర్ట్ ఆపరేటర్ గా కొనసాగుతున్న అదానీ గ్రూప్ ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.5,000 కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించాలని యోచిస్తోంది. డిసెంబరు 31 నాటికి APSEZ నగదు రూ. 6,257 కోట్లు ఉండగా.. కంపెనీ నికర రుణం మాత్రం రూ. 39,277 కోట్లుగా ఉంది. అలాగే గ్రూప్ మెుత్తాన్ని పరిశీలిస్తే డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో దాదాపు రూ.1.96 లక్షల కోట్ల నికర రుణాన్ని కలిగి ఉంది.

అదానీకి ఎదురుదెబ్బ..

అదానీకి ఎదురుదెబ్బ..

మార్కెట్లో అదానీ గ్రూప్ కంపెనీల ఫ్రీ ఫాల్ వల్ల దాదాపు 75 శాతం వరకు క్షీణించాయి. దీంతో అంతర్జాతీయ సంస్థలైన క్రెడిట్ సూయిస్సే, సిటీ గ్రూప్, స్టాండర్డ్ చార్టర్డ్ అదానీ బాండ్లను కొలేటరల్‌గా అంగీకరించడం నిలిపివేయటంతో గ్రూప్ పెద్ద ఎదురుదెబ్బను ఎదుర్కొంది. రేటింగ్ ఏజెన్సీ మూడీస్ నాలుగు గ్రూప్ కంపెనీల ఔట్‌లుక్‌ను ఇటీవల తగ్గించింది.

ఒక్కటే గుడ్‌న్యూస్..

ఒక్కటే గుడ్‌న్యూస్..

ఇటీవల అదానీ కంపెనీల విషయంలో ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చే ఒక వార్త ఉంది. అదే ఈ రోజు నుంచి ఏసీసీ సిమెంట్స్, అంబుజా సిమెంట్స్ సంస్థలు హిమాచల్ రాష్ట్రంలోని తమ ప్లాంట్లలో ఉత్పత్తిని తిరిగి ప్రారంభించాయి. రవాణా ఛార్జీల వ్యవహారంలో ట్రక్కర్ యూనియన్‌ల విభేదాల కారణంగా దాదాపు 67 రోజులుగా ఈ ఫ్యాక్టరీల్లో ఉత్పత్తిని అదానీ గ్రూప్ తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే సమస్యను పరిష్కరించిన కంపెనీ నేటి నుంచి కార్యకలాపాలను పునఃప్రారంభించింది. దీంతో ఈ రెండు కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

Read more about: adani adani ports gautam adani
English summary

Adani Ports: మాట నిలబెట్టుకున్న అదానీ.. వేల కోట్ల అప్పు ముందుగా చెల్లింపు.. | Adani Ports paid 1500 crores loan amount in advance as promised by Gautam Adani

Adani Ports paid 1500 crores loan amount in advance as promised by Gautam Adani
Story first published: Tuesday, February 21, 2023, 14:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X