For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 300 పాయింట్లు డౌన్: అదానీ పోర్ట్స్ టాప్ లూజర్

|

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం (జూన్ 14) భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లు గతవారం మిశ్రమంగా ముగిశాయి. ఇది ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పైన ప్రభావం చూపుతోంది. దీనికి తోడు గతవారం సూచీలు రికార్డ్ స్థాయిలో గరిష్టాలను నమోదు చేశాయి. దీంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు. దీంతో నేడు ప్రారంభం నుండి సూచీలు నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. దేశీయంగా లోహ, రియాల్టీ, బ్యాంకింగ్, విద్యుత్ రంగ షేర్లు ఒక శాతం నుండి రెండు శాతం మేర నష్టాల్లో కొనసాగుతున్నాయి. అదానీ పోర్ట్స్ స్టాక్స్ భారీగా నష్టపోయాయి.

ATM cash withdrawal fee: ఏటీఎం 'లిమిట్' దాటితే మరింత భారం, ఛార్జీ పెంపుATM cash withdrawal fee: ఏటీఎం 'లిమిట్' దాటితే మరింత భారం, ఛార్జీ పెంపు

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

నేడు సూచీలు భారీ నష్టాల్లో ఉన్నాయి. సెన్సెక్స్ ఉదయం 52,492.34 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,542.66 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 51,936.31 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ ఉదయం 15,791.40 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,791.90 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,606.50 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.11 సమయానికి సెన్సెక్స్ -312.51 (0.60%) నష్టపోయి 52,162.25 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 108.20 (0.68%) పాయింట్లు నష్టపోయి 15,684.70 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

టాప్ గెయినర్స్, లూజర్స్

టాప్ గెయినర్స్, లూజర్స్

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో ఓఎన్జీసీ 1.25 శాతం, దివిస్ ల్యాబ్స్ 0.73 శాతం, విప్రో 0.76 శాతం, ఇన్ఫోసిస్ 0.59 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.56 శాతం లాభపడ్డాయి.

టాప్ లూజర్స్ జాబితాలో అదానీ పోర్ట్స్ 14.43 శాతం, కోల్ ఇండియా 2.43 శాతం, ఎస్బీఐ 1.90 శాతం, HDFC 1.70 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 1.53 శాతం నష్టపోయాయి.

నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్ ఉన్నాయి.

రంగాలవారీగా..

రంగాలవారీగా..

నిఫ్టీ 50 స్టాక్స్ 0.59 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 1.21 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఆటో 0.84 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.19 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.50 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.13 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.30 శాతం, నిఫ్టీ మీడియా 1.77 శాతం, నిఫ్టీ మెటల్ 1.19 శాతం, నిఫ్టీ ఫార్మా 0.33 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.96 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.44 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.23 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఐటీ మాత్రమే 0.19 శాతం లాభపడింది.

English summary

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 300 పాయింట్లు డౌన్: అదానీ పోర్ట్స్ టాప్ లూజర్ | Adani group stocks plunge: Indices trade lower amid profit booking

Adani group stocks have taken a beating after NSDL freezed three FPI accounts owning Adani Group shares. Except IT, all other sectoral indices are trading in the red.
Story first published: Monday, June 14, 2021, 11:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X