For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Adani Enterprises: నాలుగో త్రైమాసికంలో లాభాలు డబుల్.. ఖుషీగా అదానీ ఇన్వెస్టర్స్..

|

Adani Enterprises: అదానీ గ్రూప్ ఫ్లాగ్ షిప్ కంపెనీ అదానీ ఎంటర్ ప్రైజెస్ తన నాలుగో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ఈ క్రమంలో గత ఏడాది కంటే లాభాలు రెండింతలు కావటంతో అదానీ ఎంటర్ ప్రైజెస్ స్టాక్ మార్కెట్లో టాప్ గెయినర్ గా నిలిచింది.

బిలియనీర్ గౌతమ్ అదానీ కంపెనీలపై హిండెన్ బర్గ్ ఆరోపణల తర్వాత వస్తున్న ఫలితాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ క్రమంలో మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.722.48 కోట్లుగా నమోదైంది. ఎయిర్ పోర్ట్స్ అండ్ రోడ్స్ వ్యాపారాల్లో వృద్ధి దీనికి తోహదపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో షేర్ 4.68 శాతం లాభపడి రూ.1,925 వద్ద నేడు ట్రేడింగ్ ముగించింది.

Adani group flagship company Adani Enterprises net profit doubled in Q4

గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ నికల లాభం కేవలం రూ.304.32 కోట్లుగా ఉంది. అంటే ఈ ఏడాది కంపెనీ రెండింతల లాభాన్ని నమోదు చేసింది. అలాగే ఆదాయం విషయానికి వస్తే నాలుగో త్రైమాసికంలో రూ.31,716.40 కోట్లుగా నమోదైంది. క్రితం సంవత్సరం రెవెన్యూ రూ.25,141.56 కోట్లుగా ఉంది. ఈ క్రమంలో ఒక్కో షేరుపై రూ.1.20 డివిడెండ్ చెల్లించాలని కంపెనీ బోర్డు నిర్ణయించింది. ఇన్వెస్టర్లు డివిడెండ్ పొందేందుకు జులై 7ను రికార్డు తేదీగా నిర్ణయించారు.

గత సంవత్సరం ఆర్థిక ఫలితాలపై చైర్మన్ గౌతమ్ అదానీ స్పందించారు. అదానీ ఎంటర్‌ప్రైజెస్ దేశంలో విజయవంతమైన వ్యాపార ఇంక్యుబేటర్‌గా మాత్రమే కాకుండా.. ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫౌండరీలలో ఒకటిగా నిలిచిందన్నారు. బలమైన ఆర్థిక పనితీరు కంపెనీ స్థిరత్వానికి అద్ధం పడుతోందని అదానీ వెల్లడించారు. తాము గవర్నెన్స్, కంప్లయన్స్, పనితీరు, నగదు ప్రవాహాలపై దృష్టి సారిస్తున్నట్లు బిలియనీర్ వెల్లడించారు.

English summary

Adani Enterprises: నాలుగో త్రైమాసికంలో లాభాలు డబుల్.. ఖుషీగా అదానీ ఇన్వెస్టర్స్.. | Adani group flagship company Adani Enterprises net profit doubled in Q4

Adani group flagship company Adani Enterprises net profit doubled in Q4
Story first published: Thursday, May 4, 2023, 22:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X