For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Rakesh Jhunjhunwala: భారత 'వారెన్ బఫెట్'.. ప్రయాణం, పోర్ట్‌ఫోలియో.. ప్రధాని సంతాపం..

|

Rakesh Jhunjhunwala: ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలాను అందరూ భారతదేశపు వారెన్ బఫెట్ అని పిలుస్తారు. ఆయన నికర విలువ దాదాపు 5.8 బిలియన్ డాలర్లుగా ఉంది. 62 ఏళ్ల జున్‌జున్‌వాలా ఆదివారం ఉదయం ముంబైలో మరణించారు.

గుండె పోటుతో..

గుండె పోటుతో..

ఈ రోజు ఉదయం 6.45 గంటలకు రాకేష్ జున్‌జున్‌వాలాను ముంబైలోని క్యాండీ బ్రీచ్ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆయన అప్పటికే చనిపోయినట్లు ప్రకటించారు. జున్‌జున్‌వాలా గుండెపోటు కారణంగా తెల్లవారుజామున మరణించారని.. ఆయన కొత్తగా ఏర్పాటు చేసిన ఎయిర్‌లైన్‌లోని ఒక వ్యక్తి వెల్లడించారు. ఫోర్బ్స్ ప్రకారం.. తరచుగా ఆయనను 'ఇండియాస్ వారెన్ బఫెట్', భారతీయ మార్కెట్ల బిగ్ బుల్ అని పిలుస్తారు.

రాజస్థానీ కుటుంబం..

రాజస్థానీ కుటుంబం..

జూలై 5, 1960న రాజస్థానీ కుటుంబంలో జన్మించిన జున్‌జున్‌వాలా ముంబైలో పెరిగారు. అక్కడ అతని తండ్రి ఆదాయపు పన్ను శాఖ కమిషనర్‌గా పనిచేశారు. సిడెన్‌హామ్ కళాశాల నుంచి గ్రాడ్యూయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో చేరారి సీఏ పూర్తి చేశారు.

విమాన రంగంలోకి..

విమాన రంగంలోకి..

ఇటీవలే జెట్ ఎయిర్‌వేస్ మాజీ సీఈవో వినయ్ దూబే, ఇండిగో మాజీ హెడ్ ఆదిత్య ఘోష్‌తో కలిసి అకాశ ఎయిర్ ను ప్రారంభించారు. ప్రస్తుతం ఇది భారతదేశపు సరికొత్త బడ్జెట్ క్యారియర్‌గా ప్రారంభమైంది. ఈ నెల తొలిసారిగా ముంబై నుంచి అహ్మదాబాద్‌కు తొలి విమానం నడిపి ఎయిర్‌లైన్ వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది.

స్టాక్ మార్కెట్ ప్రయాణం..

స్టాక్ మార్కెట్ ప్రయాణం..

1985లో జున్‌జున్‌వాలా కేవలం రూ.5,000 ప్రాథమిక పెట్టుబడితో కళాశాలలో చదువుతున్న సమయంలోనే స్టాక్ మార్కెట్లలో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. చార్టర్డ్ అకౌంటెంట్ చదివిన బిగ్ బుల్ అకౌంట్స్ ఆడిట్ చేయడానికి బదులుగా దలాల్ స్ట్రీట్‌ను ఎంచుకున్నారు. సెప్టెంబర్ 2018 నాటికి ఆయన పెట్టుబడి విలువ దాదాపు రూ.11,000 కోట్లకు పెరిగింది. జున్‌జున్‌వాలా దేశంలోని 48వ అత్యంత ధనవంతుడిగా ఉన్నారు.

పోర్ట్‌ఫోలియోలో స్టాక్స్..

పోర్ట్‌ఫోలియోలో స్టాక్స్..

రాకేష్ పోర్ట్‌ఫోలియోలో స్టార్ హెల్త్, టైటాన్, రాలిస్ ఇండియా, ఎస్కార్ట్స్, కెనరా బ్యాంక్, ఇండియన్ హోటల్స్ కంపెనీ, ఆగ్రో టెక్ ఫుడ్స్, నజారా టెక్నాలజీస్, టాటా మోటార్స్ వంటి కంపెనీలు ఉన్నాయి. మొత్తం మీద జూన్ క్వార్టర్ ముగిసే సమయానికి 47 కంపెనీల్లో ఆయన పెట్టుబడులను కలిగి ఉన్నారు. టైటాన్, స్టార్ హెల్త్, టాటా మోటార్స్, మెట్రో బ్రాండ్స్ అతని అతిపెద్ద హోల్డింగ్‌లలో కొన్ని.

వివిధ పదవుల్లో..

వివిధ పదవుల్లో..

జున్‌జున్‌వాలా వ్యాపారి, చార్టర్డ్ అకౌంటెంట్, దేశంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరుగా ఉన్నారు. జున్‌జున్‌వాలా హంగామా మీడియా , ఆప్‌టెక్‌లకు ఛైర్మన్‌గా ఉన్నారు. అలాగే వైస్రాయ్ హోటల్స్, కాంకర్డ్ బయోటెక్, ప్రోవోగ్ ఇండియా, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లకు డైరెక్టర్‌గా కూడా ఉన్నారు.

జున్‌జున్‌వాలా మెుదటి లాభం..

జున్‌జున్‌వాలా మెుదటి లాభం..

ఆయన 1986లో టాటా టీ కంపెనీకి చెందిన 5,000 షేర్లను రూ. 43కి కొనుగోలు చేయడంతో తన మొదటి పెద్ద లాభాన్ని సంపాదించారు. మూడు నెలల్లో స్టాక్ రూ.143కి పెరిగింది. మూడేళ్లలో దాని నుంచి ఏకంగా రూ.20-25 లక్షలు సంపాదించారు. జున్‌జున్‌వాలా స్టాక్ మార్కెట్‌లోకి ప్రవేశించినప్పుడు సెన్సెక్స్ సూచీ 150 పాయింట్ల వద్ద ఉంది. ఆయన తన పెట్టుబడులను సొంత బ్రోకరేజ్ రేర్ ఎంటర్‌ప్రైజెస్ ద్వారా నిర్వహిస్తారు. దీని పేరు ఆయన, భార్ రేఖ పేర్లలోని అక్షరాల నుంచి ఏర్పిడింది.

ప్రధాని ట్వీట్..

జున్‌జున్‌వాలా మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఆర్థిక వ్యవస్థలో ఆయన సహకారాన్ని గుర్తుచేసుకున్నారు. దీనికి ముందు ఈ నెల ప్రారంభంలో సీఎన్బీసీ న్యూస్-18 ఛానల్ ఇంటర్వ్యూలో బిగ్ బుల్ నలతగా కనిపించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇదే సమయంలో దేశంలోని అనేక మంది ప్రముఖులు జున్‌జున్‌వాలా మరణంపై తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

English summary

ace investor Rakesh Jhunjhunwala died with heart attack know his portfolio and career in detail

ace investor Rakesh Jhunjhunwala died know about his journey till death
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X