For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gautam Adani: రాకెట్ లాగా దూసుకెళ్తున్న అదానీ.. కుబేరుల జాబితాలో బిల్ గేట్స్ ను వెనక్కు నెట్టి..

|

Gautam Adani: కుబేరుడు అనే పదానికి అదానీ సరిగ్గా సరిపోతారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన సంపద కూడా అంతే వేగంగా వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం ఆసియాలో సంపన్నుదిగా ఉన్న గౌతమ్ అదానీ.. ప్రపంచ కుబేరుల జాబితాలోను మరో మైలురాయిని అందుకున్నారు. ఈ క్రమంలో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడిని వెనక్కు నెట్టారు.

 ముందుకెళ్తున్న అదానీ..

ముందుకెళ్తున్న అదానీ..

అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్‌పర్సన్ అయిన గౌతమ్ అదానీ మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను అధిగమించి ప్రపంచంలో నాల్గవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. ఫోర్బ్స్ తాజా నివేదిక ప్రకారం.. టెస్లా అండ్ స్పేస్‌ఎక్స్ CEO ఎలాన్ మస్క్ 230.8 బిలియన్ డాలర్ల నికర విలువతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుగా కొనసాగుతున్నారు. లూయిస్ విట్టన్ గ్రూప్‌కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ (148.4 బిలియన్ డాలర్లు), అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (139.5 బిలియన్ డాలర్లు) సంపదతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

బిల్ గేట్స్ వెనక్కి..

బిల్ గేట్స్ వెనక్కి..

ఫోర్బ్స్ ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితా ప్రకారం.. అదానీ, అతని కుటుంబ ఆస్తుల నికర విలువ ఇప్పుడు 114.4 బిలియన్ డాలర్ల వద్ద ఉంది. గేట్స్ నికర విలువ సుమారు 102.4 బిలియన్ డాలర్లుగా ఉంది. బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్‌కు తన సంపదలో 20 బిలియన్ డాలర్లను విరాళంగా ఇస్తున్నట్లు గత వారం గేట్స్ ప్రకటించిన తర్వాత నివేదిక వెలువడింది.

అదానీ గ్రూప్ మార్కెట్ క్యాప్..

అదానీ గ్రూప్ మార్కెట్ క్యాప్..

జూలై 19, 2022 నాటికి అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ 197.49 బిలియన్ డాలర్లకుపైగా ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అదానీ.. ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీని అధిగమించి అగ్రస్థానంలో నిలిచారు. అంబానీ నికర విలువ 88.4 బిలియన్ డాలర్లుగా ఉండటంతో ఆయన ప్రపంచ కుబేరుల జాబితాలో పదవ స్థానానికి పరిమితమయ్యారు.

 బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్..

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్..

అయితే.. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ జాబితా ప్రకారం రిలయన్స్ టైకూన్ ముఖేష్ అంబానీ ప్రపంచంలోని పదకొండవ అత్యంత సంపన్న వ్యక్తి, ఒరాకిల్ లారీ ఎల్లిసన్ తొమ్మిదవ స్థానంలో ఉన్నారు.

English summary

Gautam Adani: రాకెట్ లాగా దూసుకెళ్తున్న అదానీ.. కుబేరుల జాబితాలో బిల్ గేట్స్ ను వెనక్కు నెట్టి.. | according to forbes latest billionaires report gowtham adani surpassed bill gates and stood in 4th place

Gautam Adani overtakes Bill Gates to become world's 4th richest person: Forbes
Story first published: Tuesday, July 19, 2022, 20:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X