For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Accenture: ఐటీ సంస్థలు మారాలంటున్న యాక్సెంచర్ ప్రతినిధి.. బంగారు భవిష్యత్తు కోసమే..

|

Accenture: ఐటీ కంపెనీలు ఉద్యోగులను అవసరానికి వాడుకుని వదిలేస్తాయని చాలా మంది టెక్కీలు ఆరోపిస్తూనే ఉంటారు. ప్రాజెక్టులు, బూమ్ కొనసాగుతున్నప్పుడు ఎడాపెడా ఉద్యోగులను రిక్రూట్ చేసుకునే కంపెనీలు వద్దనుకుంటే ఏదో ఒక నెపంతో ఉద్యోగులను తొలగిస్తుంటాయి. ఈ క్రమంలో యాక్సెంచర్ ప్రతినిధి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారింది.

యాక్సెంచర్ ఎండీ..

యాక్సెంచర్ ఎండీ..

భారతదేశంలోని ఐటి కంపెనీలు వినియోగదారులకు మాత్రమే కాకుండా ప్రతిభను సృష్టించాల్సిన అవసరం ఉందని యాక్సెంచర్ ఇన్ ఇండియా చైర్‌పర్సన్ & ఎండీ రేఖా ఎం. మీనన్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రతి వ్యాపారం కేవలం ప్రతిభకు వినియోగించుకుంటం మాత్రమే కాక.. వ్యక్తుల్లోని సామర్థ్యాలను అన్ లాక్ చేయటానికి సృష్టికర్తగా అభివృద్ధి చెందాలని అన్నారు.

భారత ఐటీ..

భారత ఐటీ..

భారత ఐటీ రంగం దాదాపు 50 లక్షల మంది ఉద్యోగులను కలిగి ఉంది. ఈ సెక్టార్ వైట్ కాలర్ ఉద్యోగాలకు అతిపెద్ద మార్గంగా మారిందన్నారు. ప్రపంచ దేశాలకు ఐటీ సేవలను ఎగుమతి చేయటంలో భారత్ అగ్రగామిగా కొనసాగుతోంది. ఈ రంగంలో టాలెంట్ లీడర్‌గా దేశం తన స్థానాన్ని ఎలా కొనసాగించగలదని అడిగినప్పుడు, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాలలో నైపుణ్యం కంపెనీలకు ప్రాధాన్యత ఇవ్వాలని మీనన్ పేర్కొన్నారు.

పెట్టుబడులు..

పెట్టుబడులు..

ఐటీ రంగం ప్రస్తుతం మారుతున్న సాంకేతికతల కారణంగా R&Dలో పెట్టుబడులు పెరిగాయి. 2021- 2030 మధ్య సాంకేతిక పరిజ్ఞానం ద్వారా దేశాన్ని ప్రగతి పథం వైపు నడిపించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపును 'టేకాడే'ను సూచిస్తుందని మీనన్ అభిప్రాయపడ్డారు. నైపుణ్యాల అంతరాన్ని తగ్గించడానికి, డిజిటల్ టాలెంట్ భారత్ ఆధిక్యాన్ని కొనసాగించడానికి పెట్టుబడులను కొనసాగించటం చాలా ముఖ్యమని అన్నారు.

డిజిటలీకరణ..

డిజిటలీకరణ..

చిట్టచివరి వ్యక్తి వరకు ప్రభుత్వ సేవలు, ఆరోగ్య సంరక్షణ వంటివి చేరుకునేందుకు కేంద్రం డిజిటల్ మౌలిక సదుపాయాలపై దృష్టి సారించింది. ఆధార్, UPI, కో-విన్, నేషనల్ హెల్త్ స్టాక్‌ వంటివి విజయానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. మరిన్ని సేవలను డిజిటల్ రూపంలో ప్రజలకు చేరువ చేయాలని కేంద్ర ప్రభుత్వం దేశంలో కృషిచేస్తూ ముందుకు సాగుతోంది.

English summary

Accenture: ఐటీ సంస్థలు మారాలంటున్న యాక్సెంచర్ ప్రతినిధి.. బంగారు భవిష్యత్తు కోసమే.. | Accenture MD Rekha m Menon Over It companies using employees talents

Accenture MD Rekha m Menon Over It companies using employees talents
Story first published: Friday, January 27, 2023, 18:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X