ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ అనుబంధ జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి పెద్ద మొత్తంలో పెట్టుబడులు వస్తున్నాయి. తాజాగా అబుదాబీకి చెందిన ముబాదాల ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ ఇందులో పెట్టుబడులు పెట్టేందుకు చర్చలు జరుపుతోందని వార్తలు వస్తున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ ప్లాట్‌ఫాంలో 1 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఈ ప్లాట్‌ఫాంలోకి గత నెల రోజుల్లో 10 బిలియన్ డాలర్లు పెట్టుబడులు వచ్చాయి.

క్యూలో అబుదాబీ కంపెనీ, మైక్రోసాఫ్ట్
అబుదాబీ కంపెనీతో పాటు మైక్రోసాఫ్ట్ కూడా రిలయన్స్ జియో ప్లాట్‌ఫాంలో 2 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తోందని వార్తలు వచ్చాయి. జియో ప్రపంచస్థాయి దిగ్గజ పెట్టుబడులను ఆకర్షిస్తోందని, ప్రపంచంలోని అతి పెద్ద మార్కెట్‌లలో ఒకటైన ఇండియాలో మరింత అత్యున్నత సేవలు అందించేందుకు ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు.

ఈ వ్యాల్యుయేషన్ వద్ద
రిలయన్స్, ముబదాల మధ్య గత కొన్ని రోజులుగా చర్చలు సాగుతున్నాయని, జియో ప్లాట్‌ఫాంలో 1 శాతం కంటే కాస్త ఎక్కువ వాటాను దక్కించుకోవాలని భావిస్తోందని, ఈ ఒప్పందం ముందుకు సాగితే రూ.5 ట్రిలియన్ల వ్యాల్యుయేషన్ వద్ద ఉండవచ్చునని చెబుతున్నారు. విస్టా ఈక్విటీ, సిల్వర్ లేక్ భాగస్వామ్యాల ద్వారా అంచనా వేయబడిన ఈ వ్యాల్యుయేషన్ వద్ద ఉండవచ్చు అంటున్నారు.

వరుస పెట్టుబడులు.. చర్చలు
జియో-ఫేస్‌బుక్ మధ్య రూ.43,574 కోట్ల డీల్ కుదిరింది. ఈ పెట్టుబడితో ఫేస్‌బుక్ 9.99% వాటాను దక్కించుకుంది. ఆ తర్వాత అమెరికా ప్రయివేటు ఈక్విటీ దిగ్గజం సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్.. జియో ప్లాట్‌ఫామ్స్‌లో 1% వాటాను రూ.5,655 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత విస్తా ఈక్విటీ రూ.11,367 కోట్ల విలువైన 2.3% వాటాను, జనరల్ అట్లాంటిక్ పార్ట్‌నర్స్ రూ.6,598.38 కోట్ల పెట్టుబడితో 1.34% వాటాను కొనుగోలు చేశాయి. చివరగా కేకేఆర్ రూ.11,367 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని తెలిపింది. వీటి ద్వారా 10 బిలియన్ డాలర్లు లేదా దాదాపు రూ.78,562 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇప్పుడు మైక్రోసాఫ్ట్, ముబదాల చర్చలు జరుపుతున్నాయని తెలుస్తోంది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications