For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Adani Enterprises: అదానీ గ్రూప్ లక్కీ ఛాన్స్.. మాటిచ్చిన అబుదాబి IHC.. ప్రతికూలాల్లోనూ

|

Adani Enterprises: అమెరికా సంస్థ ఇచ్చిన ఒక్క రిపోర్టుతో అదానీ గ్రూప్ కంపెనీలు అల్లకల్లోలం అయ్యాయి. దీంతో గౌతమ్ అదానీ సంపద కరిగిపోయి టాప్-10 ప్రపంచ కుబేరుల జాబితాలో నుంచి కనుమరుగయ్యారు. ఇలాంటి కష్టకాలంలో అదానీ ఎంటర్ ప్రైజెస్ FPO మార్కెట్లో నడుస్తోంది. అయితే ఇక్కడ ఇన్వెస్టర్లకు ఒక శుభవార్త ఉంది.

అబుదాబి సంస్థ..

అబుదాబి సంస్థ..

అబుదాబికి చెందిన ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ (IHC) అదానీ FPO విషయంలో పెద్ద ప్రకటన చేసింది. కంపెనీ ఫ్లోట్ చేసిన రూ.20,000 కోట్ల ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్ లో 400 మిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెడతానని ప్రకటించింది. భారత కరెన్సీ ప్రకారం ఈ డీల్ విలువ దాదాపు రూ.3,200 కోట్లకు సమానమైనదిగా తెలుస్తోంది. అంటే FPOలో 16 శాతాన్ని IHC సబ్‌స్క్రైబ్ చేయనుంది. సోమవారం ఈ ప్రకటన రావటంతో అదానీ ఎంటర్ ప్రైజెస్ కంపెనీ షేర్లు మార్కెట్లో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి.

ఫెయిల్ అనుకుంటే..

ఫెయిల్ అనుకుంటే..

ముందునుంచే గౌతమ్ అదానీ ఈ FPOపై ధీమాగా ఉన్నారు. కంపెనీ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే దీనిని క్లోజ్ చేస్తామని తెలిపారు. ఆఫర్‌ సక్సెస్ కావాలంటే కనీసం 90 శాతం బిడ్లు రావాల్సి ఉంటుంది. అయితే ఈ రోజు FPO ముగియనున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు ఎలా రియాక్ట్ అవుతారనేది వేచిచూడాల్సిన విషయంగా ఉంది. ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్లను కేటాయించడం ద్వారా రూ.5,985 కోట్లను అదాని ఎంటర్ ప్రైజెస్ సమీకరించింది.

IHC టార్గెట్..

IHC టార్గెట్..

అబుదాబికి చెందిన పెట్టుబడుల సంస్థ 2023లో ప్రధానంగా యూరప్, ఆఫ్రికా, ఆసియా, దక్షిణ అమెరికా మార్కెట్లపై దృష్టి సారించనున్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలో తన పెట్టుబడులను స్కేల్ చేయనున్నట్లు తెలిపింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ ప్రాథమికాంశాలపై తమకు విశ్వాసం ఉందని IHC చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సయ్యద్ బాసర్ షుబ్ వెల్లడించారు. ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ పూర్తి చేసిన రెండవ పెట్టుబడి ఒప్పందంగా ఇది నిలిచింది.

అదానీ ఎంటర్ ప్రైజెస్..

అదానీ ఎంటర్ ప్రైజెస్..

ఈ రోజు అదానీ గ్రూప్ లోని అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్ స్టాక్స్ మాత్రమే లాభాల్లో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అదానీ ఎంటర్ ప్రైజెస్ స్టాక్ ధర ఉదయం 9.54 గంటల సమయంలో రూ.45 లాభపడి రూ.2,937.90 వద్ద ట్రేడ్ అవుతోంది. గడచిన 5 ట్రేడింగ్ సెషన్లలో స్టాక్ ధర రూ.512.95 మేర పతనమైంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.3.35 లక్షల కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.4,190గా ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.1,528.80 వద్ద ఉంది.

English summary

Adani Enterprises: అదానీ గ్రూప్ లక్కీ ఛాన్స్.. మాటిచ్చిన అబుదాబి IHC.. ప్రతికూలాల్లోనూ | Abu dhabi's IHC to invest 3200 crores in Adani Enterises FPO know details

Abu dhabi's IHC to invest 3200 crores in Adani Enterises FPO know details
Story first published: Tuesday, January 31, 2023, 10:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X