రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన డిజిటల్ ప్లాట్‌ఫామ్ జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి పెట్టుబడుల వరదెత్తుతోంది. తాజాగా అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (ADIA) సంస్థ రూ.5,683.50 కోట్ల పెట్టుబడితో 1.16 శాతం వాటాను దక్కించుకుంది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో వాటాలను విక్రయించడం ద్వారా ఇప్పటి వరకు రూ.97,885.65 కోట్ల నిధులు సమకూరాయి. దాదాపు లక్ష కోట్ల సమీపానికి వచ్చింది. 2021 మార్చి నాటికి రుణరహిత సంస్థగా మార్చాలని భావిస్తున్న ముఖేష్ అంబానీ కల మరింత దగ్గరగా వచ్చి, త్వరగా సాకారమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఏడు వారాల్లోనే..
జియో నికర వ్యాల్యూ రూ.4.91 లక్షల కోట్లు, ఎంటర్ ప్రైజెస్ వ్యాల్యూ రూ.5.16 లక్షల కోట్ల ఆధారంగా ఈ ఒప్పందం కుదిరినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. ఇప్పటికే జియోలో ఫేస్‌బుక్, సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ పార్టనర్స్, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్, ముబాదాల ఇన్వెస్ట్ చేశాయి. గత ఏడు వారాల వ్యవధిలో ఎనిమిది భారీ ఒప్పందాలు కుదిరాయి. ముబాదాల కంపెనీ 1.85 శాతం వాటాను కొనుగోలు చేసిన రెండు రోజులకే అబుదాబీ సంస్థ ADIA పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది.

21.06 శాతం వాటా విక్రయం
జియో ప్లాట్‌ఫామ్స్‌ల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పటి వరకు 21.06 శాతం వాటాలను అమ్మివేసింది. 8 భారీ పెట్టుబడుల ద్వారా ఏడు వారాల్లో రూ.97,885.65 కోట్లు లేదా 12.96 బిలియన్ డాలర్లు సమీకరించింది. ప్రస్తుతం జియోకు 38.80 కోట్ల మంది మొబైల్ కస్టమర్లు ఉన్నారు. పెట్టుబడుల సమీకరణలో రిలయన్స్ ఇండస్ట్రీస్ దూసుకెళ్తోంది.

పెట్టుబడులు
ఈ ఇన్వెస్ట్‌మెంట్ తమ వ్యూహానికి, దేశానికి బలమైన ఆమోదంగా ఉందని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అన్నారు. ADIA ప్రతినిధి హమాద్ షాహ్వాన్ మాట్లాడుతూ... జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడి ద్వారా మార్కెట్ లీడింగ్ కంపెనీలను తమ సంస్థ ఆకర్షిస్తోందనేందుకు నిదర్శనమన్నారు.
ఇప్పటి వరకు వచ్చిన పెట్టుబడులు...
- ఫేస్‌బుక్ - రూ.43,573.62 కోట్లు - 9.99 శాతం వాటా
- సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్ - రూ.5,655.75 కోట్లు - 1.15 శాతం వాటా
- విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్ - రూ.11,367.00 కోట్లు - 2.32 శాతం వాటా
- జనరల్ అట్లాంటిక్ - రూ.6,598.38 కోట్లు - 1.34 శాతం వాటా
- కేకేఆర్ - రూ.11,367.00 కోట్లు - 2.32 శాతం వాటా
- ముబాదాల - రూ.9,093.60 కోట్లు - 1.85 శాతం వాటా
- సిల్వర్ లేక్ (రెండోసారి) - రూ.4,546.80 కోట్లు - 0.93 శాతం వాటా
- ADIA - రూ.5,683.50 కోట్లు - 1.16 శాతం వాటా
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications